Anushka To Pair with Prabhas Once Again In Maruthi Movie Deets Inside - Sakshi
Sakshi News home page

Prabhas - Anushka: మరోసారి ప్రభాస్‌తో అనుష్క..!

Published Tue, Mar 29 2022 11:25 PM | Last Updated on Wed, Mar 30 2022 10:11 AM

Anushka with Prabhas once again in Maruthi Movie - Sakshi

హీరో ప్రభాస్‌తో అనుష్కది సూపర్ హిట్ కాంబినేషన్ అన్న సంగతి తెలిసిందే. దర్శకదిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ తరువాత మరోసారి ప్రభాస్‌, అనుష్క జంట కలిసి సినిమా చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఇటీవల ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు జోరుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించబోతున్నట్టు సమాచారం. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అందులో మెయిన్ హీరోయిన్ పాత్ర కోసం అనుష్కను సెలెక్ట్ చేసినట్టు సమాచారం.

ఇక తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండటంతో జేజమ్మ ఈ చిత్రానికి ఓకే చెప్పినట్టు సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రచారం జరుగుతోంది. ఇక రెండో హీరోయిన్‌గా కృతి శెట్టిని దాదాపుగా కన్ ఫార్మ్ చేసినట్టు తెలుస్తోంది. మరో హీరోయిన్‌గా మాళవిక పేరుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక ఇదిలా ఉంటే కొంతకాలంగా అనుష్క సినిమాలకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్‌తో అనుష్క కాంబినేషన్‌పై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement