సాక్షి, న్యూఢిల్లీ: మారుతి సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇంట్రూడర్‌లో కొత్త వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఇంట్రూడర్ 2019 ఎడిషన్ బైక్‌ను భారతీయ మార్కెట్‌లొ విడుదల చేసింది. గేర్ షిప్ట్ డిజైన్, అధునాతన బ్రేక్ పెడల్ కొత్త డిజైన్‌తో న్యూ లుక్‌ని తీసుకొచ్చింది. దీని ధరను రూ. 1,08,162 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గా నిర్ణయించింది.
ఆధునిక డిజైన్, ప్రీమియమ్ అప్పీల్‌తో క్రూయిజర్ ప్రేమికులను ఆకట్టుకుంటుందని మారుతి వైస్ ప్రెసిడెంట్ దేవాషిష్ హాండా తెలిపారు. రోజు ప్రయాణంతో పాటు, వీకెండ్ రైడ్స్‌కు కూడా కొత్త మారుతి ఇంట్రూడర్ మంచి అనుభవాన్నిస్తుందని చెప్పారు. 155 సిసి ఇంజీన్, ప్రామాణికే ఏబీఎస్, పుల్లీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ లాంటి కీలక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment