మహానుభావుడు ఎవరంటే..!
హ్యట్రిక్ హిట్స్తో సత్తా చాటిన యంగ్ హీరో శర్వానంద్ ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉన్నాడు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న శతమానంభవతి సినిమాలో హీరోగా నటిస్తున్న శర్వా, ఆ తరువాత చేయబోయే సినిమాలను కూడా లైన్లో పెట్టాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తవ్వగానే మారుతి దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగకీరించాడు. మారుతి మార్క్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాకు డిఫరెంట్ టైటిల్ను ఫిక్స్ చేశారు.
భలే భలే మొగాడివోయ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన మారుతి, తరువాత వెంకటేష్ హీరోగా తెరకెక్కిన బాబు బంగారం సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. తాజాగా శర్వానంద్ సినిమాతో మరోసారి భారీ హిట్ మీద కన్నేశాడు. శర్వా సరసన కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేం మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు మహానుభావుడు అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. శతమానంభవతి మూవీ షూటింగ్ పూర్తయిన తరువాత మహానుభావుడు సెట్స్ మీదకు వెళ్లనుంది.