'మహానుభావుడు' వస్తున్నాడు..!
వరుస విజయాలతో దూసుకుపోతోన్న శర్వానంద్ జోరుకు రాధ సినిమాతో బ్రేక్ పడింది. దీంతో తిరిగి ఫాంలోకి వచ్చేందుకు మరో ఇంట్రస్టింగ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు శర్వా. కామెడీ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో మహానుభావుడు అనే ఆసక్తికరమైన టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాను కూడా స్టార్ హీరోలు మహేష్, ఎన్టీఆర్ లకు పోటిగా దసరా సీజన్లో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
హైదరాబాద్ తో పాటు పొల్లాచ్చి, యూరప్ లలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల మీద దృష్టి పట్టిన చిత్రయూనిట్ వినాయక చవితి కానుకగా ఈ నెల 24న మహానుభావుడు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేం మెహరీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.