Prabhas Fans Fire On Director Maruthi - Sakshi
Sakshi News home page

Prabhas: మారుతిపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్‌

Published Sun, Jul 23 2023 8:13 AM | Last Updated on Sun, Jul 23 2023 11:24 AM

Prabhas Fans Fire On Director Maruthi - Sakshi

ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే! అయితే ఈ సినిమా పాతబడ్డ రాజా డీలక్స్‌ అనే థియేటర్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే తాతామనవళ్ల కథ అని ఫిలింనగర్‌లో వినిపిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే 50 శాతం పూర్తి అయినట్లు తెలుస్తోంది. చిన్న సినిమాగానే మొదట్లో ప్రారంభించినా ప్రభాస్‌ రేంజ్‌ పెరగడంతో బడ్జెట్‌ కూడా రూ. 200 కోట్లకు చేరిందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం సలార్‌, కల్కి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న డార్లింగ్‌.. మారుతి సినిమా షూటింగ్ కు కొద్దిగా గ్యాప్ ఇచ్చాడు. త్వరలోనే మళ్లీ షూటింగ్‌ ప్రారంభం కానుంది కూడా.

(ఇదీ చదవండి: సూర్య 'కంగువ' ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్‌)

ఇది ఇలా ఉంటే తాజాగా కల్కి టైటిల్‌ గ్లింప్స్‌ను వైజయంతి మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. దానిని చూసిన వారంతా హాలీవుడ్‌ రేంజ్‌లో ఉందని ప్రశంసలు కూడా డార్లింగ్‌ అందుకున్నాడు. ఇప్పటికి కూడా అది యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో ప్రభాస్ లుక్ అదిరిపోయిందంటూ.. డార్లింగ్ ఫ్యాన్స్​ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ప్రభాస్‌తో  సినిమా చేస్తున్న దర్శకుడు మారుతి మాత్రం ఈ గ్లింప్స్ గురించి ఒక్క ట్వీట్ కూడా చేయలేదు.  దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. దీంతో వాళ్లు మారుతిపై ఇలా ఫైర్‌ అవుతున్నారు.

(ఇదీ చదవండి: Oppenheimer Movie Review: ఓపెన్‌హైమర్ సినిమా రివ్యూ)

'బేబీ సినిమా గురించి బన్నీ మాట్లాడిన మాటలు ట్విటర్‌లో షేర్‌ చేశావ్‌ అందులో ఎలాంటి తప్పు లేదు.. కానీ నీకు సినిమా అవకాశం ఇచ్చిన  ప్రభాస్ గురించి ఒక్క ట్వీట్‌ అయినా చేశావా.. ? కల్కి మూవీకి సంబంధించిన గ్లింప్స్​పై ఒక్క ట్వీట్‌ అయినా చేశావా..? ఎటువంటి సంబంధం లేకపోయినా నీతో రూ.200 కోట్ల భారీ బడ్జెట్ సినిమాను మా ప్రభాస్‌ చేస్తున్నారు. అంకిత భావం, కృతజ్ఞత భావం లాంటివి నీకులేవు' అంటూ మారుతిపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు పలువురు నెటిజన్లు కూడా కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. మరికొందరేమో షూటింగ్‌లో బిజీ కారణంగా ట్వీట్‌ పెట్టలేకపోవచ్చు కానీ.. ప్రభాస్‌పై మారుతికి ఎనలేని ప్రేమ, కృతజ్ఞత ఉందని అంటున్నారు. ఇకపోతే  రాజా డీలక్స్‌ గురించి అధికారికంగా ప్రకటించలేదు. కానీ ప్రభాస్‌,మారుతి షూటింటిగ్‌ స్పాట్‌ ఫోటోలు కొన్ని ఇప్పటికే బయటకు వచ్చాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement