అదే ట్రెండ్ ఫాలో అవుతున్న మారుతి | Maruthi Next Movie with Sharwanand | Sakshi
Sakshi News home page

అదే ట్రెండ్ ఫాలో అవుతున్న మారుతి

Published Wed, Nov 23 2016 12:55 PM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM

అదే ట్రెండ్ ఫాలో అవుతున్న మారుతి

అదే ట్రెండ్ ఫాలో అవుతున్న మారుతి

కెరీర్ స్టార్టింగ్లో డబుల్ మీనింగ్ డైలాగ్లతో సక్సెస్ అయిన మారుతి తరువాత ఎంతో కష్టపడి ఆ ముద్ర చేరిపేసుకున్నాడు. భలే భలే మగాడివోయ్ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరయ్యాడు. అయితే ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో ఈ సినిమాకు ఫాలో అయిన ఓ సెంటిమెంట్ను తన నెక్ట్స్ సినిమాలలో కూడా కంటిన్యూ చేసేలా ప్లాన్ చేస్తున్నాడీ యువ దర్శకుడు. భలే భలే మగాడివోయ్ సినిమాలో హీరో క్యారెక్టర్ మతిమరుపుతో ఇబ్బంది పడుతుంటుంది. ఆ తరువాత తెరకెక్కించిన బాబు బంగారం సినిమాలో హీరో పాత్ర విపరీతమైన దయ కలిగిన పోలీస్ ఆఫీసర్.

తన నెక్ట్స్ సినిమాలో కూడా హీరో క్యారెక్టర్కు ఇలాంటి ఓ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడట. శర్వానంద్ హీరోగా సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన మారుతి, ఆ సినిమాతో హీరో బ్రాండ్ల పిచ్చి ఉన్న వ్యక్తిగా కనిపిస్తాడట. బాగా డబ్బున్న ఫ్యామిలీకి చెందిన హీరో ఓ మిడిల్ క్లాస్ అమ్మాయిని లవ్ చేయటం అనే కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో ఏ వస్తువైనా బ్రాండెడ్ అయితేనే వాడే పిచ్చి ఉన్న వ్యక్తిగా కనిపిస్తాడట. మరి ఈ సారి మారుతి ప్లాన్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement