
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే! అయితే ఈ సినిమా పాతబడ్డ రాజా డీలక్స్ అనే థియేటర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే తాతామనవళ్ల కథ అని ఫిలింనగర్‌లో వినిపిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ కోసం ఆల్‌రెడీ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో థియేటర్ సెట్‌ను రెడీ చేస్తున్నారట చిత్రయూనిట్. అలాగే వీలైనంత త్వరగా రెండు షెడ్యూల్స్‌లోనే షూటింగ్‌ను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట మారుతి.
హారర్ కామెడీ జానర్‌లో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్‌లో ప్రభాస్ త్వరలోనే జాయిన్ కానున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. అలాగే అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే చిత్రానికి కూడా ప్రభాస్ పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే! కాగా ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.
చదవండి: పబ్లిక్‌గా నటికి ముద్దులు.. అమ్మ చూస్తే ఏమంటుందోనంటున్న నటుడు
హీరోతో సహజీవనం వార్తలపై ఇస్మార్ట్ బ్యూటీ గప్‌చుప్!
Comments
Please login to add a commentAdd a comment