అరెరె... ఇది తెలీక వేరే కథతో సినిమా తీస్తున్నానే..: మారుతి | Director Maruthi Satirical Comments On IMDb Over Prabhas The Raja Saab Movie Plot Line, Tweet Goes Viral - Sakshi
Sakshi News home page

The Raja Saab-IMDb Story: ప్రభాస్‌ రాజాసాబ్‌ కథ ఇదేనట.. IMDBపై దర్శకుడి సెటైర్లు!

Published Thu, Jan 18 2024 8:34 AM | Last Updated on Thu, Jan 18 2024 8:59 AM

Director Maruthi Satires on IMDB over The Raja Saab Movie Plot Line - Sakshi

సినిమా కథ ఇదేనంటూ కొన్ని వార్తలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ఆఖరికి ఐఎమ్‌డీబీ కూడా.. ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడుతారు. కానీ నెగెటివ్‌ ఎనర్జీ వల్ల ఆ ప్రేమజంట గమ్యాన్ని మార్చుకోవా

గత కొంతకాలంగా హిట్లు లేక సతమతమైన ప్రభాస్‌కు సలార్‌ రూపంలో సంజీవని దొరికినట్లైంది. ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.611 కోట్లకు పైగా రాబట్టింది. ఈ జోష్‌లో వరుస సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్‌. దర్శకుడు మారుతితో ఓ సినిమా ఉంటుందని గతంలోనే ప్రభాస్‌ ప్రకటించాడు. కామెడీ హర్రర్ థ్రిల్లర్ జానర్‌లో ఈ ప్రాజెక్ట్‌ తెరకెక్కనున్నట్లు సమాచారం. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీకి ది రాజాసాబ్‌ అనే టైటిల్‌ ఖరారు చేసినట్లు ప్రకటించారు.

కథ ఇదేనా?
ఇకపోతే సినిమా కథ ఇదేనంటూ కొన్ని వార్తలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ఆఖరికి ఐఎమ్‌డీబీ కూడా.. ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడుతారు. కానీ నెగెటివ్‌ ఎనర్జీ వల్ల ఆ ప్రేమజంట తమ గమ్యాన్ని మార్చుకోవాల్సి వస్తుంది.. ఇదే సినిమా కథ అని రాసుకొచ్చింది. ఇది చూసిన మారుతి ట్విటర్‌(ఎక్స్‌) మీడియాలో సెటైర్లు వేశాడు. అరెరె... ఈ విషయం నాకు తెలియక నేను వేరే స్క్రిప్ట్‌తో షూటింగ్‌ చేస్తున్నాను! ఇప్పుడు ఐఎమ్‌డీబీ సమాజం నన్ను యాక్సెప్ట్‌ చేస్తదా? అంటూ నవ్వుతున్న ఎమోజీ జత చేశాడు.

దాని జోలికి మాత్రం వెళ్లకండి
ఇది చూసిన అభిమానులు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. అన్నా, దయచేసి ప్రభాస్‌ లుక్‌ ఎడిట్‌ చేసి ఇవ్వకండి, సహజంగా తీసినవే పోస్టర్లు వదలండి.. ఈ విధిరాతల జోలికి పోకండి.. హారర్‌ స్క్రిప్ట్‌ చాలు, మమ్మల్ని నిరాశపరచవని ఆశిస్తున్నాము అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు ప్రభాస్‌.. కల్కి 2898ఏడీ అనే సైన్స్‌ ఫిక్షన్‌ మూవీలోనూ నటిస్తున్నాడు. దీనికి నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.

whatsapp channel

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement