స్పిరిట్‌ కంటే ముందు ‘రాజా డీలక్స్‌’ను సెట్స్‌పై తీసుకొచ్చే ప్లాన్‌లో ప్రభాస్‌? | Prabhas Raja Deluxe Movie Update: Team Planning To Start Shooting, Deets Inside | Sakshi
Sakshi News home page

Prabhas-Maruthi: స్పిరిట్‌ కంటే ముందు ‘రాజా డీలక్స్‌’ను సెట్స్‌పై తీసుకొచ్చే ప్లాన్‌లో ప్రభాస్‌?

Published Wed, Feb 23 2022 12:05 PM | Last Updated on Wed, Feb 23 2022 12:49 PM

Prabhas Raja Deluxe Movie Update: Team Planning To Start Shooting, Deets Inside - Sakshi

ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ చేతిలో దాదాపు అరజడజను చిత్రాలు ఉన్నాయి. రాధేశ్యామ్‌, సలార్‌, ఆదిపురుష్‌, ప్రాజెక్ట్‌ కె, స్పిరిట్‌తో పాటు మరిన్న ప్రాజెక్ట్స్‌ చర్చల దశలో ఉన్నాయి. అయితే ఇప్పటికే రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌ చిత్రాలు షూటింగ్‌ను పూర్తి చేసుకోగా మార్చిలో రాధేశ్యామ్‌ విడుదలకు సిద్ధమైంది. సలార్‌ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం నాగ్‌ అశ్విన్‌ ప్రాజెక్ట్‌ K షూటింగ్‌ను జరుపుకుంటోంది.

వీటి తర్వాత ప్రభాస్‌ సందీప్‌ వంగతో స్పిరిట్‌ మూవీని సెట్స్‌పై  తీసుకువస్తాడని అంతా అనుకున్నారు. కానీ దీని కంటే ముందు ప్రభాస్‌ మారుతి సినిమాను పట్టాలెక్కించేలా కనిపిస్తున్నాడట. కాగా డైరెక్టర్‌ మరుతితో ప్రభాస్‌ ఓ సినిమా చేయబోతున్నాడని, ఇప్పటికే చర్చలు, స్క్రిప్ట్‌ కూడా పూర్తయ్యాయంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ ప్రాజెక్ట్‌కు 'రాజా డీలక్స్'గా టైటిల్‌ ఖరారు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ఈ వార్తలను మారుతి ఖండించలేదు.

దీంతో ఇది నిజమే అని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ మూవీ సెట్స్‌ నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయంటూ ఫిలిం దునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేసి, గ్యాప్ లేకుండానే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. దీని బట్టి చూస్తుంటే 'స్పిరిట్' కాస్త ఆలస్యమయ్యేలాగే కనిపస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement