జనవరి 19 నుంచి మహానుభావుడు
సంక్రాంతి బరిలో సీనియర్ హీరోలతో తలపడేందుకు రెడీ అవుతున్న యంగ్ హీరో శర్వానంద్ వెంటనే మరో సినిమాను ప్రారంభించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న శతమానంభవతి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న శర్వా, ఐదు రోజుల గ్యాప్ తో కొత్త సినిమాను ప్రారంభిస్తున్నాడు.
భలే భలే మగాడివోయ్, బాబు బంగారం సినిమాలతో ఆకట్టుకున్న యూత్ ఫుల్ సినిమాల దర్శకుడు మారుతి, శర్వానంద్ హీరోగా సినిమాను తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈసినిమాకు మహానుభావుడు అనే టైటిల్ ను ఫైనల్ చేశారు. ఈ సినిమాను జనవరి 19న లాంచనంగా ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు మారుతి.