బాబు బంగారంలో వెంకీ ఇలా.. | Venkatesh Babu bangaram First look | Sakshi

బాబు బంగారంలో వెంకీ ఇలా..

Apr 8 2016 2:07 PM | Updated on Sep 3 2017 9:29 PM

బాబు బంగారంలో వెంకీ ఇలా..

బాబు బంగారంలో వెంకీ ఇలా..

గోపాల గోపాల సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్, యువ దర్శకుడు మారుతి డైరెక్షన్లో బాబు బంగారం సినిమా చేస్తున్నాడు. భలే భలే మొగాడివోయ్ సినిమాతో మంచి సక్సెస్ సాధించిన మారుతి...

గోపాల గోపాల సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంకటేష్, యువ దర్శకుడు మారుతి డైరెక్షన్లో 'బాబు బంగారం' సినిమా చేస్తున్నాడు. భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి సక్సెస్ సాధించిన మారుతి.. వెంకటేష్ హీరోగా కూడా మరోసారి పక్కా కామెడీ ఎంటర్ టైనర్ ను రెడీ చేస్తున్నాడు. ముఖ్యంగా తన వయసుకు, ఇమేజికి తగ్గ కథ కోసం చాలాకాలం ఎదురుచూసిన వెంకీ ఈ సినిమాతో మంచి సక్సెస్ మీద కన్నేశాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఉగాది సందర్భంగా రిలీజ్ అయ్యింది.
 
గతంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సూపర్ పోలీస్ సినిమాలోని పాత్ర తరహాలోనే బాబు బంగారం సినిమాలోనూ కామెడీ పోలీస్ గా కనిపించనున్నాడు వెంకీ. అందుకు తగ్గట్టుగా ఫిట్ బాడీతో ఘర్షణ సినిమాలో కనిపించినట్టుగా ఈ సినిమాలో కూడా కనిపించనున్నాడు. తన గత సినిమాలతో పోలిస్తే ఈ ఫస్ట్ లుక్ లో వెంకీ చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. యూత్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయటంలో మారుతికి కూడా మంచి రికార్డ్ ఉంది. దీంతో బాబు బంగారం సినిమాతో వెంకీకి మరో హిట్ ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement