Director Maruthi New Movie With Gopichand Announcement Video | సూపర్‌ డూపర్‌ కమర్షియల్‌ - Sakshi
Sakshi News home page

సూపర్‌ డూపర్‌ కమర్షియల్‌

Published Fri, Jan 8 2021 12:33 PM | Last Updated on Fri, Jan 8 2021 1:00 PM

Gopichand And Maruthi New Movie Announcement - Sakshi

‘భలే భలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే’ వంటి బ్లాక్‌ బస్టర్స్‌ తర్వాత మళ్లీ మారుతి దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్‌–యూవీ క్రియేషన్స్‌–బన్నీ వాసు నిర్మించనున్న మూడో చిత్రానికి శ్రీకారం జరిగింది. అల్లు అరవింద్‌ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రంలో గోపీచంద్‌ హీరో.

‘‘సూపర్‌ డూపర్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని తెరకెక్కించడానికి మారుతి రంగం సిద్ధం చేశారు. గోపీచంద్‌–మారుతి కాంబినేషన్‌లో సినిమా రాబోతుందనే ప్రకటన కూడా వైవిధ్యంగా ఉండేలా ప్లాన్‌ చేశాం. ‘ప్రతిరోజూ పండగే’ తర్వాత మారుతి చేయబోయే సినిమాపై వచ్చిన పుకార్లకు సెటైర్లు వేస్తూ, మారుతి మార్క్‌ స్టైల్‌లో ఓ హ్యూమరస్‌ వీడియోను విడుదల చేశాం. ఈ వీడియోకి రావు రమేశ్‌గారి వాయిస్‌ ఓవర్‌ బాగా కుదిరింది’’ అని చిత్రబృందం పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement