
మహానగరంలో మరో మాయగాడు..!
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజనుకు పైగా హీరోలు వెండితెర మీద సందడి చేస్తున్నారు.
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజనుకు పైగా హీరోలు వెండితెర మీద సందడి చేస్తున్నారు. అయితే ఈ మెగా హీరోల్లో మెగా ఇమేజ్ ను పర్ఫెక్ట్ గా వాడుకుంటున్న యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఒక్కడే. మామయ్య చిరంజీవి సినిమాల్లోని పాటలను రీమిక్స్ చేయటంతో పాటు, చిరు సినిమాల టైటిల్స్ ను కూడా వాడేస్తున్నాడు. లుక్స్ పరంగా కూడా యంగ్ చిరంజీవిలా కనిపించే సాయి మరోసారి చిరు టైటిల్ మీద కన్నేశాడు.
ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన నక్షత్రం రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న తేజు, బివియస్ రవి దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరిన్ని సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. స్టార్ డైరెక్టర్ వినాయక్ తో పాటు కరుణాకరన్ దర్శకత్వంలోనూ నటించేందుకు అంగీకరించాడు. వీటితో పాటు యువ దర్శకుడు మారుతితో కామెడీ ఎంటర్టైనర్ చేసే ఆలోచనలో ఉన్నాడట.
భలే భలే మొగాడివోయ్, బాబు బంగారం సినిమాలతో ఆకట్టుకున్న మారుతి, సాయి ధరమ్ తేజ్ తో మరో హిట్ మీద కన్నేశాడు. ఈ సినిమాకు మెగాస్టార్ సూపర్ హిట్ సినిమా మహానగరంలో మాయగాడు టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.