Nidhi Agerwal's career on a hitch with delayed releases - Sakshi
Sakshi News home page

Nidhi Agerwal: శనిలా మారిన ఆ ప్రాబ్లమ్స్.. ఇప్పట్లో ఛాన్సే లే!

Published Wed, Jun 28 2023 10:55 AM | Last Updated on Wed, Jun 28 2023 11:33 AM

Nidhi Agerwal Problems With Harihara Veeramallu Prabhas Movie - Sakshi

కొందరు హీరోయిన్లని చూడగానే 'అబ్బా.. ఏముందిరా బాబు' అని అనుకుంటాం. నిధి అగర్వాల్ ఆ కేటగిరీలోకే వస్తుంది. ఈమెని చూడగానే సరిగ్గా ఇలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఫిజిక్ సూపర్, గ్లామర్‌ అంతకంటే సూపర్. డ్యాన్సులు బాగా చేస్తుంది. అయినాసరే ఈమెని ఆ కష్టాలు వదలట్లేదు. 'అన్నీ ఉన్నా అల్లుడి నోటిలో శని' అన‍్నట్లు ఈమె లైఫ్ తయారైంది. కొన్ని సమస్యలు ఈమెని శనిలా వెంటాడుతున్నాయా అనిపిస్తోంది. అభిమానుల మధ్య ఇప్పుడు ఇదే టాపిక్ చర్చనీయాంశంగా మారిపోయింది. 

సినిమా కష్టాలు!
చాలామంది హీరోయిన్లకు అందం ఉన్నా.. స్టార్ హీరోల సినిమాల‍్లో అవకాశాలు రావు. ఒకవేళ వస్తే మాత్రం హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా క్రేజ్ సొంతం చేసుకుంటారు. 'ఇస్మార్ట్ శంకర్' బ్యూటీ నిధి అగర్వాల్ కూడా ప్రస్తుతం తెలుగులో ఇద్దరు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. ఒకటి 'హరిహర వీరమల్లు', మరొకటి ప్రభాస్-మారుతి కలిసి చేస్తున్న మూవీ. వీటిలో 'హరిహర..' 2020లోనే ప్రారంభమైంది. ఇప్పటికి సగం షూటింగే జరిగింది. మిగిలిన పార్ట్ ఎప్పుడు మొదలవుతుందో, అసలు జరుగుతుందో లేదా అనేది డౌటే!  

(ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్‌కి కాస్ట్‌లీ కారు గిఫ్ట్.. ఎన్ని లక్షలో తెలుసా?)

ఉంచుతారో.. తీసేస్తారో?
ప్రభాస్, మారుతి  దర్శకత్వంలో ఓ సినిమాలో చేస్తున్నాడు. హారర్ కామెడీ స్టోరీతో తీస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహన్ హీరోయిన్లు అని అన్నారు. ప్రభాస్ ప్రస్తుతం 'సలార్', 'ప్రాజెక్ట్ K' చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు పూర్తయిన తర్వాతే మారుతి మూవీ కోసం పనిచేస్తాడు. ఇదంతా జరగడానికి వచ్చే ఏడాది పట్టొచ్చు! అంతలో చిత‍్రబృందం మనసు మారకపోతే ఓకే. ఒకవేళ ఏమైనా జరిగి హీరోయిన్లు మార్చే ఆలోచన వస్తే మాత్రం నిధికి మూడినట్లే!  

ఎందుకంటే మహేశ్-త్రివిక్రమ్ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. లాంచ్ అయినప్పుడు ఇందులో లీడ్ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డేని ఎంపిక చేశారు. కానీ ఇప్పుడు ఆమెని పక్కనబెట్టేశారని, సెకండ్ హీరోయిన్ శ్రీలీలని మెయిన్ లీడ్ గా చేశారని వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఇదే ఫార్ములా ప్రభాస్-మారుతి సినిమాకు అప్లై చేస్తే మాత్రం నిధిని పీకేయడం గ్యారంటీ. ఒకవేళ ఇలా జరిగితే టాలీవుడ్ లో నిధి కెరీరే సందిగ్ధంలో పడిపోతుంది!


(ఇదీ చదవండి: ఆ రోజు గొడవలో అమ్మాయిదే తప్పు: హీరో నాగశౌర్య)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement