మారుతి డైరెక్షన్లో అక్కినేని హీరో..?
టాలీవుడ్ లో చిన్న సినిమాలతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు మారుతి, భలే భలే మగాడివోయ్ సినిమాతో తో రూట్ మార్చిన మారుతి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే చిత్రాల మీద దృష్టి పెట్టాడు. సీనియర్ హీరోగా వెంకటేష్ హీరోగా బాబు బంగారంతో పరవాలేదనిపించిన ఈ యంగ్ డైరెక్టర్, ప్రస్తుతం శర్వానంద్ హీరోగా మహానుభావుడు సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమా తరువాత అక్కినేని యువ హీరో నాగచైతన్యతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం యుద్ధం శరణం సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న చైతూ, తరువాత పెళ్లి, హనీమూన్ ల కోసం బ్రేక్ తీసుకోనున్నాడు. బ్రేక్ మారుతి దర్శకత్వంలో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట చైతూ. నాగచైతన్య హీరోగా ప్రేమమ్, మారుతి దర్శకత్వంలో బాబు బంగారం సినిమాలను తెరకెక్కించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ కాంబినేషన్ ను తెర మీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.