‘‘లైఫ్.. ఎ ట్రూ బ్లెస్సింగ్’ షార్ట్ ఫిలిం చూసి దర్శకుడు నాగ్ అశ్విన్‌గారు ‘చాలా బాగుంది. అమ్మాయి పాత్ర పెద్ద బోనస్’ అన్నారు. అలాగే డైరెక్టర్ మారుతిగారు కూడా ‘మంచి ప్రయత్నం... బాగుంది’ అన్నారు. ఆ ఇద్దరి ప్రశంసలను మరచిపోలేను’’ అని రుత్విక్ రెడ్డి అన్నారు. విజయ్ దాస్ దర్శకత్వంలో రుత్విక్ రెడ్డి స్త్రీ పురుష పాత్రల్లో నటించిన షార్ట్ ఫిలిం ‘లైఫ్.. ఎ ట్రూ బ్లెస్సింగ్’. శ్రీలతా రెడ్డి నిర్మించిన ఈ షార్ట్ ఫిలింని డైరెక్టర్ మారుతి విడుదల చేశారు.
రుత్విక్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నాకు నటన అంటే ఇష్టం. న్యూయార్క్‌లో రెండేళ్లు నటనలో శిక్షణ తీసుకున్నాను. తొలి ప్రయత్నంగా ‘లైఫ్.. ఎ ట్రూ బ్లెస్సింగ్’ షార్ట్ ఫిలిం చేశా. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులతో పాటు లింగ మార్పిడి అనేది ప్రకృతికి విరుద్ధం అనీ, చిన్న విషయాలకే భయపడి ఆత్మహత్యలు చేసుకోవడం కరెక్ట్ కాదనే విషయాలను చూపించాం. నా షార్ట్ ఫిలిం బాగుందని ఫోన్లు చేయడంతో పాటు కామెంట్లు పెడుతుండటం హ్యాపీ. ఇటీవల కొన్ని సినిమా కథలు విన్నాను. నా నటనతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోవాలన్నదే నా లక్ష్యం’’ అన్నారు.
చదవండి : విజయ్‌ను కలిసి షణ్ముక ప్రియ, లైగర్ ఓ పాట పాడే అవకాశం
ఆ ట్విస్ట్ తెలిసి వావ్ అనుకున్నా!
Comments
Please login to add a commentAdd a comment