రెండు సినిమాలు లైన్లో పెట్టిన యంగ్ హీరో
రాధతో నిరాశ పరిచిన యంగ్ హీరో శర్వానంద్, వరుస సినిమాలతో రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో మహానుభావుడు షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో తరువాత చేయబోయే మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. సంక్రాంతి బరిలో స్టార్ హీరోలతో పోటి పడి సత్తా చాటిన శర్వాతో సినిమా చేసేందుకు అగ్రనిర్మాణ సంస్థలు ముందుకు వస్తున్నాయి.
బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించిన ఆర్కా మీడియా బ్యానర్ లో తెరకెక్కుతున్న నెక్ట్స్ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. రాఘవేంద్రరావు తనయుడు కేయస్ ప్రకాష్ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాతో పాటు మరో సినిమాకు కూడా ఓకె చెప్పాడు శర్వా. నిఖిల్ హీరోగా రెండు హిట్స్ అందించిన సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకె చెప్పాడు. ఈ మూడు సినిమాలను వచ్చే ఏడాదిలోగా పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నాడు.