ఏప్రిల్ 6 నుంచి శర్వా కొత్త సినిమా | Sharwanand And Sudheer Varma New Movie Update | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 3 2018 12:08 PM | Last Updated on Tue, Apr 3 2018 12:08 PM

Sharwanand And Sudheer Varma New Movie Update - Sakshi

యంగ్ హీరో శర్వానంద్‌ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. విభిన్న కథలతో ఆకట్టుకుంటున్న శర్వా, అదే సమయంలో ఫ్యామిలీ డ్రామా, కమర్షియల్ ఎంటర్‌టైనర్లు కూడా చేస్తున్నాడు. ఇటీవల మహానుభావుడుగా ఘనవిజయం అందుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది.

దీంతో ఈ నెల 6 నుంచి కొత్త సినిమా ప్రారంభించనున్నాడు శర్వానంద్‌. యువ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయన్నాడు. స్వామి రారా, కేశల లాంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన సుధీర్.. శర్వాను మాఫియా డాన్ పాత్రలో చూపించనున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement