
కొత్త తరహా కథలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శర్వానంద్, మరో ఆసక్తికరమైన సినిమా ప్రారంభించనున్నాడు. ఇటీవల మహానుభావుడు సినిమాతో మరో ఘనవిజయాన్ని అందుకున్న శర్వానంద్, తన కొత్త సినిమాను గురువారం ప్రారంభించనున్నాడు. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకుడు. అందాల రాక్షసి సినిమాలతో దర్శకుడిగా పరిచయం అయిన హను, కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తొలి విజయాన్ని అందుకున్నాడు.
తరువాత నితిన్ హీరోగా తెరకెక్కిన లై సినిమాతో నిరాశపరిచినా.. దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ఓ క్లీన్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను రూపొందించేందుకు రెడీ అవుతున్నాడు హను రాఘవపూడి. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా శర్వాకు జోడిగా ఫిదా ఫేం సాయి పల్లవి నటించే అవకాశం ఉంది. ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment