శర్వా సినిమా కోసం భారీ సెట్‌ | Huge Port Set For Sharwanand New Movie | Sakshi
Sakshi News home page

Published Thu, May 3 2018 3:20 PM | Last Updated on Thu, May 3 2018 3:22 PM

Huge Port Set For Sharwanand New Movie - Sakshi

వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో శర్వానంద్‌ ప్రస్తుతం సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్‌ డాన్‌గా కనిపించనున్నాడట. 1980ల కాలంలో జరిగే కథ కావటంతో అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా చూపించేందుకు చిత్రయూనిట్ శ్రమిస్తున్నారు. తాజాగా కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం ఓ భారీ సెట్‌ను నిర్మించారు.

అప్పటి వాతావరణం ప‍్రతిబింభించేలా ఓ పోర్ట్‌ సెట్‌ను నిర్మించారు. ప్రొడక్షన్‌ డిజైనర్‌ రవీందర్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ సెట్‌ సినిమాకే హైలెట్‌ గా నిలుస్తుందన్న టాక్‌ వినిపిస్తోంది. శర్వానంద్‌ సరసన హలో ఫేం కల్యాణీ ప్రియదర్శన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వా హీరోగా తెరకెక్కిన పడి పడి లేచే మనసు త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement