ఫ్లాప్‌ దర్శకులకు ఓకె చెప్తున్నాడు..! | Sharwanand Next Movie with Hanu Raghavapudi | Sakshi
Sakshi News home page

ఫ్లాప్‌ దర్శకులకు ఓకె చెప్తున్నాడు..!

Published Sun, Oct 29 2017 12:45 PM | Last Updated on Sun, Oct 29 2017 4:28 PM

Sharwanand Next Movie with Hanu Raghavapudi

యంగ్‌ జనరేషన్‌లో మినిమమ్‌ గ్యారెంటీ హీరోగా ఎదుగుతున్న స్టార్‌ శర్వానంద్‌. ఇప్పటికే వరుస విజయాలతో సత్తా చాటిన శర్వా ఇటీవల మారుతి దర్శకత్వంలో మహానుభావుడు సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న శర్వానంద్‌ తరువాత సుధీర్‌ వర్మ దర్శకత్వంలో మరో సినిమాకు అంగీకరించాడు. దర్శకుడిగా ప్రకాష్‌ ఇంతవరకు ఒక్క కమర్షియల్‌ హిట్‌ కూడా సాధించలేదు. సుధీర్‌ వర్మ కూడా తాజా చిత్రం కేశవతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు.

ఈ ఇద్దరు దర్శకులతో పాటు మరో ఫ్లాప్‌ డైరెక్టర్‌కు ఓకె చెప్పాడు శర్వానంద్‌. అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్‌ ఓ సినిమా చేయనున్నాడు. అందాల రాక్షసి తరువాత కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో సక్సెస్‌ సాధించిన హను తరువాత లై సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. ఇలా వరుసగా ఫ్లాప్‌ దర్శకులతో సినిమాలు చేస్తున్న శర్వానంద్‌ ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement