ప్రముఖ యాంకర్, నటుడు టీఎన్‌ఆర్ ఇటీవలె కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఫ్రాంక్లీ విత్ టీఎన్‌ఆర్ అనే షోతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న టీఎన్‌ఆర్‌కు ఇటీవలె కరోనా సోకింది. మొదట హోం ఐసోలేషన్‌లో ఉన్న టీఎన్‌ఆర్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. టీఎన్‌ఆర్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు కొందరు టీఎన్‌ఆర్ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి ఆయన కుటుంబానికి అండగా నిలిచారు.
మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయలతో పాటు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు యాభై వేల రూపాయలను టీఎన్నార్ కుటుంబానికి ఆర్థిక సాయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ సైతం లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేసింది. తాజాగా డైరెక్టర్ మారుతి టీఎన్‌ఆర్ కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. తన వంతు సాయంగా 50 వేల రూపాయలను అందించారు. ఈ మేరకు టీఎన్‌ఆర్ భార్య జ్యోతి బ్యాంక్ అకౌంట్‌కు నగదును పంపించారు. అదే విధంగా ప్రతి ఒక్కరు తమకు తోచినంత సహాయం చేయాల్సిందిగా మారుతి సూచించారు.
It's time to show our solidarity for our friend in media
— Director Maruthi (@DirectorMaruthi) May 13, 2021
TNR we miss you, but we are with your family.
Let's support #TNR's family pic.twitter.com/rLUfavz9EX
చదవండి : TNR : కన్నీళ్లు తెప్పిస్తున్న టీఎన్‌ఆర్ చివరి పాట
TNR : ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన టీఎన్‌ఆర్
Comments
Please login to add a commentAdd a comment