TNR
-
TNR కుటుంబానికి 10 లక్షల రూపాయలందించిన 'ఐ డ్రీమ్' సంస్థ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ యాంకర్, నటుడు టీఎన్ఆర్ కుటుంబానికి ఐడ్రీమ్ మీడియా అండగా నిలిచింది. స్వయంగా ఆ సంస్థ ఛైర్మన్ చిన్న వాసుదేవ రెడ్డి టీఎన్ఆర్ ఇంటికి వెళ్లి 10 లక్షల రూపాయల చెక్కును అందించారు. అంతేకాకుండా టీఎన్ఆర్ పిల్లల చదువుకు సంబంధించి పూర్తి బాధ్యతలు తానే తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం టీఎన్ఆర్ పిల్లలతో పాటు మరికొంత మంది కుటుంబ సభ్యులకు సైతం కరోనా సోకిందని, అదృష్టవశాత్తు వారిలో ఎవరికి సీరియస్‌గా లేదని చెప్పారు. అపోలో హాస్పిటల్స్ నుంచి ప్రముఖ వైద్యులు ఒకరు టీఎన్ఆర్ కుటుంబానికి వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తన ఫేస్బుక్ ఖాతా ద్వారా సుధీర్ఘ పోస్టును విడుదల చేశారు. 'టీఎన్ఆర్ కేవలం ఐ డ్రీమ్ సంస్థకు ఉద్యోగి మాత్రమే కాదు. వ్యక్తిగతంగా నాకు సన్నిహితుడు, స్నేహితుడు. సంస్థ ఎదుగుదలకు ఎన్నో సూచనలు ఇచ్చాడు. అలాంటి వ్యక్తి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉండటం నా బాధ్యత. వాళ్ళ పిల్లల భవిష్యత్తు, జ్యోతి గారికి కావాల్సిన నైతిక, ఆర్థిక మద్దతు అందజేసే విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదు. వ్యక్తిగా TNR మనమధ్య లేకపోయినా ఆయన విడిచి వెళ్లిన జ్ఞాపకాలు, చేసిన కళాసేవ ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి' అని ఎమోషనల్ పోస్టును షేర్ చేశారు. ఇక టీఎన్ఆర్ ఇటీవలె కరోనా కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. 'ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్' అనే షోతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న టీఎన్ఆర్కు ఇటీవలె కరోనా సోకింది. మొదట హోం ఐసోలేషన్‌లో ఉన్న టీఎన్ఆర్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. చదవండి : TNR కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన డైరెక్టర్ మారుతి TNR కుటుంబానికి చిరంజీవి, సంపూర్ణేష్ బాబు ఆర్థిక సహాయం -
TNR కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన డైరెక్టర్ మారుతి
ప్రముఖ యాంకర్, నటుడు టీఎన్ఆర్ ఇటీవలె కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ అనే షోతో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న టీఎన్ఆర్కు ఇటీవలె కరోనా సోకింది. మొదట హోం ఐసోలేషన్‌లో ఉన్న టీఎన్ఆర్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. టీఎన్ఆర్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు కొందరు టీఎన్ఆర్ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయలతో పాటు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు యాభై వేల రూపాయలను టీఎన్నార్ కుటుంబానికి ఆర్థిక సాయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సైతం లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేసింది. తాజాగా డైరెక్టర్ మారుతి టీఎన్ఆర్ కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. తన వంతు సాయంగా 50 వేల రూపాయలను అందించారు. ఈ మేరకు టీఎన్ఆర్ భార్య జ్యోతి బ్యాంక్ అకౌంట్‌కు నగదును పంపించారు. అదే విధంగా ప్రతి ఒక్కరు తమకు తోచినంత సహాయం చేయాల్సిందిగా మారుతి సూచించారు. It's time to show our solidarity for our friend in media TNR we miss you, but we are with your family. Let's support #TNR's family pic.twitter.com/rLUfavz9EX — Director Maruthi (@DirectorMaruthi) May 13, 2021 చదవండి : TNR : కన్నీళ్లు తెప్పిస్తున్న టీఎన్ఆర్ చివరి పాట TNR : ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన టీఎన్ఆర్ -
TNR కుటుంబానికి అండగా ప్రముఖ నిర్మాణ సంస్థ
ప్రముఖ యాంకర్, నటుడు, జర్నలిస్టు టీఎన్ఆర్ (తుమ్మల నరసింహారెడ్డి) కరోనా కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కోవిడ్ బారిన పడిన ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. టీఎన్ఆర్ మృతి పట్ల సనీ ప్రముఖులు దిగ్భ్రాంతి తెలపడంతో పాటు ఆర్థిక సాయం చేసి ఆయన కుటుంబానికి అండగా నిలిచారు. మంగళవారం మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయలతో పాటు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు యాభై వేల రూపాయలను టీఎన్నార్ కుటుంబానికి ఆర్థిక సాయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కుటుంబానికి ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేసింది. ‘ప్రముఖ సినీ జర్నలిస్ట్,యాంకర్, సినీ నటుడు టీఎన్ఆర్ ఆకస్మిక మరణవార్త విని మేము దిగ్భ్రాంతికి గురయ్యాం. తక్షణ ఖర్చుల నిమిత్తం టీఎన్ఆర్ కుటుంబానికి రూ.1 లక్షను ఆర్థిక సాయంగా అందించాలని నిర్ణయించుకున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. అలాగే ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఓం శాంతి’అని నిర్మాణ సంస్థ పేర్కొంది. చదవండి: TNR కుటుంబానికి చిరంజీవి, సంపూర్ణేష్ బాబు ఆర్థిక సహాయం TNR : కన్నీళ్లు తెప్పిస్తున్న టీఎన్ఆర్ చివరి పాట -
TNR 'ప్లే బ్యాక్', ఆహాలో ఎప్పటినుంచంటే?
దినేష్ తేజ్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "ప్లే బ్యాక్". హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహించగా శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రసాద్‌రావు పెద్దినేని నిర్మించారు. మార్చి ఐదున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తాజాగా ఓటీటీ బాట పట్టింది. తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆహాలో మే 21 నుంచి ప్రసారం కానుంది. వేర్వేరు కాలాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఎలా మాట్లాడుకున్నారు? అనే అంశం చుట్టూ కథ కొనసాగుతూ ఉంటుంది. ఇక ఈ సినిమాలో దివంగత జర్నలిస్టు, నటుడు టీఎన్ఆర్ నటనలో సరికొత్త కోణాన్ని చూపించారు. నటన పరంగా 'ప్లే బ్యాక్' అతడి కెరీర్లో గుర్తుండిపోయే చిత్రంగా చెప్పవచ్చు. Tring! Tring! ☎️ It's a call from 1993. Pick up at your own risk! A thriller drama on your way. #Playback premieres May 21.@iam_jakka @idineshtej @AnanyaNagalla @ArjunKalyan @ImSpandanaa @TNRdirector @murthyscribe @UrsVamsiShekar @teju9666 pic.twitter.com/7Gdf8q2D37 — ahavideoIN (@ahavideoIN) May 11, 2021 చదవండి: నంబర్ వన్‌గా నిలబెట్టిన...గ్యాంగ్ లీడర్ -
TNR కుటుంబానికి చిరంజీవి, సంపూర్ణేష్ బాబు ఆర్థిక సహాయం
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ యాంకర్, నటుడు, జర్నలిస్టు టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. టీఎన్ఆర్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసిన చిరంజీవి ఫోన్లో టీఎన్ఆర్ కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఇక మరో నటుడు సంపూర్ణేష్ బాబు 50వేల రూపాయల అర్థిక సహాయం చేశారు. టీఎన్ఆర్ ఇంటర్వ్యూల ద్వారా వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా తాను ఓ మెట్టు ఎదిగానని, వారి కుటుంబానికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, తనవంతు సహాయం తప్పకుండా చేస్తానని పేర్కొన్నారు. కాగా కరోనా కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ టీఎన్ఆర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ అనే షోతో ఎంతో పాపులర్ అయిన టీఎన్ఆర్ ఎంతో గుర్తింపు పొందారు. పేరునే బ్రాండ్‌గా మార్చుకొని తనదైన స్టైల్లో ప్రశ్నలడిగేవారు టీఎన్ఆర్. అందుకే ఆయనతో ఇంటర్వ్యూలంటే ఎంతోమంది ప్రముఖులు ఆసక్తి కనబరిచేవారు. అప్పటిదాకా ఎవరికి తెలియని విషయాలను సైతం అతిధుల నుంచి రాబట్టేవారాయన.రామ్ గోపాల్ వర్మ, తేజ, తనికెళ్ల భరణి వంటి సినీ ప్రముఖులతో 4 గంటల పాటు సుధీర్గంగా ఇంటర్వ్యూ చేసిన ఘనత టీఎన్‌ఆర్‌దే. తెలుగులో ఇంతవరకు ఎవరు కూడా అంత ఎక్కువసేపు ఇంటర్వ్యూ చేయలేదు. అంతటి ప్రత్యేకతను సంపాదించుకున్నారయన. జర్నలిస్ట్ #TNR మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. కుటుంబసభ్యులతో ఫోన్ లో విచారం వ్యక్తం చేశారు. TNR కుటుంబానికి రూ 1 లక్ష ఆర్థిక సహాయం అందించారు చిరంజీవి @KChiruTweets — BARaju (@baraju_SuperHit) May 11, 2021 తెలుగు సినిమా జర్నలిస్టు TNR గారి కుటుంబానికి నా వంతుగా రూ.50,000 వారి భార్య అకౌంట్ లో డిపాసిట్ చెయ్యటం జరిగింది. వారి ఇంటర్వ్యూ ద్వారా నేను వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఒక మెట్టు ఎదిగాను. వారి కుటుంబానికి ఎప్పుడు ఏ అవసరం ఉన్న, నా వంతు సాయం తప్పక చేయగలను. మీరు సపోర్ట్ చెయ్యండి pic.twitter.com/1MBYS8F6pm — Sampoornesh Babu (@sampoornesh) May 11, 2021 చదవండి : TNR : కన్నీళ్లు తెప్పిస్తున్న టీఎన్ఆర్ చివరి పాట ఆ ఇంటర్వ్యూలతో టీఎన్ఆర్ దశ తిరిగింది.. -
TNR : కన్నీళ్లు తెప్పిస్తున్న టీఎన్ఆర్ చివరి పాట
ప్రముఖ యాంకర్, నటుడు టీఎన్ఆర్ కరోనా కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ అనే షోతో ఎంతో పాపులర్ అయిన టీఎన్ఆర్ మృతి పట్ల సినీ ఇండస్ర్టీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. ఇక పేరునే బ్రాండ్‌గా మార్చుకొని తనదైన స్టైల్లో ప్రశ్నలడిగేవారు టీఎన్ఆర్. అందుకే ఆయనతో ఇంటర్వ్యూలంటే ఎంతోమంది ప్రముఖులు ఆసక్తి కనబరిచేవారు. అప్పటిదాకా ఎవరికి తెలియని విషయాలను సైతం అతిధుల నుంచి రాబట్టేవారాయన. రామ్ గోపాల్ వర్మ, తేజ, తనికెళ్ల భరణి వంటి సినీ ప్రముఖులతో 4 గంటల పాటు సుధీర్గంగా ఇంటర్వ్యూ చేసిన ఘనత టీఎన్‌ఆర్‌దే. అంతేకాదు టీఎన్ఆర్ షో ఎంతసేపు చూసినా బోర్ కొట్టదు అనేంతగా సాగుతోంది ఆయన షో. తెలుగులో ఇంతవరకు ఎవరు కూడా అంత ఎక్కువసేపు ఇంటర్వ్యూ చేయలేదు. అంతటి ప్రత్యేకతను సంపాదించుకున్నారయన. ఇక లాక్డౌన్ సమయంలో స్టే హోం చాలెంజ్‌ను స్వీకరించిన కరోనా పట్ల భయపకుండా జాగ్రత్తలు పాటించాలని టీఎన్ఆర్ సూచించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన 'నా ప్రేమకే సెలవు..నా దారికే సెలవు' అంటూ పాడిన పాట నెట్టింట వైరలవుతోంది. 'ఈ శూన్యం నా గమ్యం..ఈ జన్మకే సెలవు'..అంటూ సాగే టీఎన్ఆర్ పాడిన ఈ పాట కన్నీళ్లు తెప్పిస్తుంది. ఎంతో ప్రతిభ కలిగిన వ్యక్తిని పరిశ్రమ కోల్పోయిందంటూ పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ విచారం వ్యక్తం చేశారు. చదవండి : TNR : ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన టీఎన్ఆర్ ఆ ఇంటర్వ్యూలతో టీఎన్ఆర్ దశ తిరిగింది.. -
TNR : ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన టీఎన్ఆర్
ప్రముఖ జర్నలిస్టు, యాంకర్, నటుడు టీఎన్ఆర్(తుమ్మల నరసింహా రెడ్డి) మరణం చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి కలగాని ప్రార్థించారు. ఇక కొద్ది రోజుల కిందట కరోనా బారిన పడ్డ టీఎన్ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం(మే10)న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. 'ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్' అనే షోతో తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ టీఎన్ఆర్ ఎంతో గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. యూట్యూబ్ వేదికగా రామ్ గోపాల్ వర్మ, తేజ సహా ఎంతోమంది సినీ ప్రముఖులను తనదైన శైలిలో ఒక్కోసారి 4 గంటలపాటు సుధీర్ఘంగా ఇంటర్వ్యూ చేసిన ఘనత టీఎన్‌ఆర్‌దే. 1992లో దేవదాస్ కనకాల వద్ద దర్శకత్వంలో మెళకువలు నేర్చుకున్న టీఎన్ఆర్ ఆ తర్వాత ఓ స్నేహితుడి ద్వారా రచయిత, నటుడు ఎల్బీ శ్రీరామ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అలీ నటించిన పలు సినిమాలకు, చిరు నటించిన ‘హిట్లర్’ చిత్రానికి సైతం స్క్రిప్ట్‌లో పాలు పంచుకున్నారు. ఆ తర్వాత నటుడిగానూ తన ప్రస్థానం సాగించారు. ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘జార్జిరెడ్డి’, ‘సుబ్రహ్మణ్య పురం’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే దర్శకుడిగా ఇండస్ర్టీలో తనదైన మార్క్ చూపించాలని టీఎన్ఆర్ కలలు కన్నారు. దర్శకుడిగా తన పేరును వెండితెరపై చూడాలన్న కల తీరకుండానే తుదిశ్వాస విడాచారు. మానవ విలువలతో కూడిన మంచి కథతో ప్రేక్షకులు మెచ్చే చిత్రాన్ని రూపొందిస్తానని టీఎన్ఆర్ అంటుండేవారని, అది తీరకుండానే వెళ్లిపోయారని ఆయన సన్నిహితులు గుర్తు చేసుకుంటున్నారు. చదవండి : కరోనా రక్కసికి బలైన టీఎన్ఆర్ టీఎన్ఆర్ లాస్ట్ వీడియో, కన్నీరు పెట్టిస్తోన్న చివరి వ్యాఖ్యలు -
టీఎన్ఆర్ లాస్ట్ వీడియో, కన్నీరు పెట్టిస్తోన్న చివరి వ్యాఖ్యలు
ప్రముఖ జర్నలిస్టు, యాంకర్, నటుడు టీఎన్ఆర్(తుమ్మల నరసింహా రెడ్డి)) సోమవారం కరోనా కాటుకు బలైన సంగతి తెలిసిందే. ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ అనే షోతో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, టాలెంటెడ్ డైరెక్టర్ తేజ వంటి ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూలు చేస్తూ ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న ఆయన మరణ వార్త టాలీవుడ్లో తీవ్ర విషాదం నింపింది. దీంతో ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో కరోనా పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన విడుదల చేసిన చివరి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన కరోనా ఏం చేయదంటూ అందరికి ధైర్యం చెప్పిన తీరు భావోద్వేగానికి గురిచేస్తోంది. కరోనా గురించి టీఎన్ఆర్ ఏమన్నారంటే.. ‘మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన స్టే హోం చాలెంజ్‌ను నేను స్వీకరించి వారం రోజుల పాటు ఇంట్లోనే ఉండబోతున్నాను. ఎక్కడికి వెళ్లడం లేదు. ఇంట్లోనే ఉంటూ మంచి పుస్తకాలు, మంచి సినిమాలు చూస్తున్నాను. చెడులో కూడా మంచి వెతుక్కోవాలని అంటారు కదా పెద్దలు. ఈ కష్టకాలం నాకు మంచి అలవాట్లను నేర్పింది. అవేంటంటే ప్రాణాయామం, యోగా. రోజూ చేస్తున్నాను. నా పిల్లలతో కూడా చేయిస్తున్నాను. దయచేసి ఇలాంటి సమయంలో పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపండి. పిల్లలకు మంచి మంచి విషయాలు చెబుతూ ధైర్యం చెప్పండి. వారి పని వారు చేసుకునేలా తీర్చిదిద్దండి. భవిష్యత్తుపై ఓ నమ్మకం ఏర్పరచండి’ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ‘తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే ఉంటే ఈ కరోనా ఏం చేయదు. దయచేసి రూమర్స్‌ను నమ్మకండి, నెగిటవ్ వీడియోలు ఎక్కువగా చూడకండి. పాజిటివ్‌గా ఉండండి. కరోనా మన దరిదాపుల్లోకి కూడా రాదు. ఇమ్యూనిటీని పెంచుకోండి. రోగనిరోధక శక్తికి నేనిచ్చే బెస్ట్ సలహా ప్రాణాయామం. తప్పకుండా చేయండి. ఇక నేను ఫోన్ చేసిన వారిలో చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు. ఇంటి పెద్దలే ప్యానిక్ అవ్వడం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు’ అని ఆయన పేర్కొన్నారు. ప్రజల క్షేమం దృష్ట్యా కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ధైర్యం చెప్పి.. చివరికి ఆయనే మహమ్మారితో పోరాడి ఓడిపోవడం అందర్నీ కలచివేస్తోంది. మహమ్మారి ఏం చేయదు, మన దరికి కూడా రాదంటూ ఆయన చేప్పిన ఈ చివరి మాటలు నెటిజన్లను, ఫాలోవర్స్‌ను కన్నీరు పెట్టిస్తున్నాయి. చదవండి: కరోనా రక్కసికి బలైన టీఎన్ఆర్ టీఎన్ఆర్ ఒక్క ఇంటర్య్వూ పారితోషికం ఎంతో తెలుసా! -
ఆ ఇంటర్వ్యూలతో టీఎన్ఆర్ దశ తిరిగింది..
ప్రముఖ జర్నలిస్ట్, యాంకర్ టీఎన్ఆర్(తుమ్మల నరసింహా రెడ్డి) ఈ రోజు(మే 10) కరోనాతో కన్నుమూశారు. తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ ఎంతో పాపులర్ అయిన ఆయన పలు సినిమాల్లో కూడా నటించి నటుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. టీఎన్ఆర్ అనగానే మొదట గుర్తొచ్చేది ‘ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ షో’. ఈ షో ద్వారా తనదైన శైలిలో సెలబ్రేటిలను ఇంటర్వ్యూ చేసి పాపులరిటీ తెచ్చుకున్న ఆయన ఎంతోమంది యూత్ ఫాలోవర్స్‌ను కూడా సంపాదించుకున్నారు. గంటల తరబడి సూటిగా సుత్తి లేకుండా సహజమైన ప్రశ్నలు వేస్తూ యాంకర్‌గా ప్రత్యేక గుర్తింపును అందుకున్నారు. ఫ్రాంక్లీ విత్ టీఎన్ఆర్ షో అంటే తెలియని వారులేరు అనేంతగా ఈ షోను పాపులర్ చేశారు ఆయన. అంతేకాదు ఎంతసేపు చూసిన ఈ షో అసలు బోర్ కొట్టదు అనే పేరును కూడా తెచ్చుకుంది. అలా ప్రస్తుత డిజిటల్ తెలుగు మీడియా రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే యాంకర్లలో ఆయన కూడా ఒకరయ్యారు. రామ్ గోపాల్ వర్మ, తేజ వంటి స్టార్ డైరెక్టర్లను ఇంటర్య్వూ చేసి సెన్సేషనల్ అయ్యారు. అలాగే టాలెంట్ ఉన్నవారిని కూడా ఆయన బాగా సపోర్ట్ చేసేవారు. కృష్ణవంశీ, తనికెళ్ళ భరణి వంటి వారితో 4గంటలకు పైగా ఇంటర్వ్యూ చేసి టీఎన్ఆర్ రికార్డ్ క్రియేట్ చేశారు. తెలుగులో ఇంతవరకు ఎవరు కూడా అంత ఎక్కువసేపు ఇంటర్వ్యూ చేయలేదు. అంతటి ప్రత్యేకతను చాటుకున్న టీఎన్ఆర్ ఒక్క షోకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకునేవారో తెలుసా. షో నిడివిని బట్టి ఒక్కొక్క ఇంటర్య్వూకు దాదాపు లక్ష రూపాయల నుంచి ఆపైనే పారితోషికం తీసుకునేవారని సమాచారం. కాగా పలు సినిమాలకు సహాయక దర్శకుడిగా వర్క్ చేసిన ఆయన ఆలీ నటించిన పిట్టల దొర సినిమాకు కూడా వర్క్ చేశారు. దర్శకుడిగా స్థిరపడాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి అనుకోకుండా మళ్ళీ టెలివిజన్ వైపు వచ్చారు. మొదట్లో జర్నలిజం బ్యాగ్రౌండ్‌తో పలు క్రైమ్ షోలను కూడా డైరెక్ట్ చేసిన ఆయన తర్వాత సినీ పరిశ్రమలో అడుగు పెట్టి జార్జిరెడ్డి, నేనే రాజు నేనే మంత్రి, హిట్, జాతిరత్నాలు వంటి సినిమాల్లో కూడా నటించారు. టీఎన్ఆర్ హఠాన్మరణంతో మీడియా రంగంలో, టాలీవుడ్ పరిశ్రమలో విషాదం నెలకొంది. చదవండి: కరోనా రక్కసికి బలైన టీఎన్ఆర్ -
TNR : ప్రముఖ యాంకర్, నటుడు టీఎన్ఆర్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ జర్నలిస్ట్, యాంకర్, నటుడు టీఎన్ఆర్(తుమ్మల నరసింహా రెడ్డి) కన్నుమూశారు. తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ ఎంతో పాపులర్ అయిన టీఎన్ఆర్ కరోనా రక్కసికి బలయ్యారు. గత కొద్ది రోజులుగా కరోనాతో బాధపడుతున్న టీఎన్ఆర్ నేడు(సోమవారం)తుదిశ్వాస విడిచారు. మొదట హోం ఐసోలేషన్‌లో ఉన్న టీఎన్ఆర్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చికత్స పొందుతూనే పరిస్థితి విషమించడంతో మరణించారు. 'ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR' అంటూ సూటిగా, సుత్తి లేకుండా ఇంటర్వ్యూలు చేసే టీఎన్ఆర్కు యూత్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. టిఎన్ఆర్కు అనారోగ్యం అని తెలియగానే ఆయన కోలుకోవాలంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక టీఎన్ఆర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ జర్నలిస్ట్ TNR కరోన తో కన్నుమూత Popular Youtube Host, Actor TNR Passed Away Due To COVID May His Soul Rest In Peace pic.twitter.com/u0BYEWbxLW — BARaju (@baraju_SuperHit) May 10, 2021