‘‘స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనే ఇంట్రెస్ట్ నాకు ఉంది. నేను అనుకున్న కాన్సెప్ట్ వారికి నచ్చాలి. కాలం కలిసి రావాలి. కొన్ని విషయాల ప్రభావం నా మీద పడకుండా నేను నాలా ఉండాలని ప్రయత్నించే వ్యక్తిని నేను. నేను తీసే సినిమాల కథలు దేనికదే డిఫరెంట్. డైరెక్టర్స్ ఎగై్జట్ అయ్యేదే సినిమా. కొందరికి బాగా నచ్చుతుంది. మరికొందరికి అది నార్మల్‌గా ఉండొచ్చు. నాకు ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ ఏమీ లేదు’’ అన్నారు మారుతి. సుమంత్ శైలేంద్ర కథానాయకుడిగా పార్కీ ప్రభాకర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘బ్రాండ్ బాబు’. ఇందులో ఈషా రెబ్బా కథానాయికగా నటించారు. ఎస్. శైలేంద్ర నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు మారుతి కథ అందించడంతోపాటు సమర్పకులుగా వ్యవహరించారు. ‘బ్రాండ్ బాబు’ చిత్రం ఆగస్టు 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి మారుతి చెప్పిన సంగతులు...
∙భావోద్వేగాలకు, ప్రేమలకు విలువ ఇవ్వకుండా కేవలం బ్రాండ్స్‌ని మాత్రమే ఫాలో అవుతుంటాడు హీరో. హోమ్‌మినిస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకునే ప్రయత్నంలో కొన్ని పరిస్థితుల కారణంగా ఆ ఇంట్లో ఉన్న పని మనిషికి కనెక్ట్ అవుతాడు. ఆ తర్వాత నిజం తెలుసుకుంటాడు. బ్రాండ్స్‌ను బట్టే ఇతరులను అంచనా వేసే హీరో ఫ్యామిలీ అతని లవ్‌ని ఒప్పుకుంటారా? ఆ తర్వాత హీరో పరిస్థితి ఏంటి? అన్నదే స్టోరీలైన్. ఏ టాపిక్ తీసుకున్నా మారుతి నవ్వించడగలడు అనుకునే ప్రేక్షకుల అంచనాలు ‘బ్రాండ్ బాబు’ సినిమాలో కూడా మిస్ కావన్న హామీ ఇవ్వగలను.
∙ఏదో కాసేపు బ్రాండ్స్‌పై ప్రేక్షకులను నవ్విద్దామని చేసిన కథ కాదు ఇది. మంచి సందేశం కూడా ఉంటుంది. సినిమాలో జెన్యూనిటీ ఉంటుంది. ఫస్ట్ టైమ్ నేను పూర్తి స్థాయిలో కథ, మాటలు ఇచ్చిన చిత్రమిది. ఆడియన్స్‌కు ఎక్కడా బోర్ కొట్టదు. బ్రాండ్స్‌ను ఫాలో అవుతూ ఎమోషన్స్‌కు, ప్రేమకు విలువ ఇవ్వనివారికి ఈ సినిమా వాటిని గుర్తు చేస్తుంది.
∙శైలేంద్రబాబుగారు నాకు ఎప్పటి నుంచో స్నేహితులు. ఆయన తన అబ్బాయిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అనుకుంటున్నప్పుడు నా దగ్గర ఈ పాయింట్ ఒకటి ఉందని చెప్పాను. హీరోగా పర్ఫెక్ట్‌గా న్యాయం చేశాడు. బ్రాండ్‌ను ఫాలో అయ్యేవారి క్యారెక్టర్‌లో ఓ యారగెంట్ యాంగిల్ ఉంటుంది. సుమంత్ శైలేంద్ర ఆ యారగెన్సీని వెండితెరపై ఫర్ఫెక్ట్‌గా మ్యాచ్ చేశాడు. మ్యూజిక్ బాగా కుదరింది. ఎప్పుడైనా సినిమా గురించి సినిమానే మాట్లాడాలి. మనం చెప్పినంత మాత్రాన ఆడియన్స్ రారు. సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది.
∙నేను పద్ధతిగా రాసుకున్న కథను నా విజన్‌కు తగ్గట్లుగా ప్రభాకర్ చక్కగా తెరకెక్కించాడు. ప్రభాకర్‌కు సీరియల్స్ చేసిన అనుభవం ఈ సినిమాకు హెల్ప్ అయింది. స్క్రిప్ట్‌లో ఎమోషన్‌ను ఈజీగా పట్టేశాడు. ఈ సినిమా అవుట్‌పుట్ చూసి రైటర్‌గా నేను శాటిస్‌ఫై అయ్యాను.
∙ఒక కాన్సెప్ట్ తీసుకుని రెండు గంటల పాటు థియేటర్స్‌లో ఆడియన్స్‌ను ఎలా కూర్చోబెట్టగలరు అన్న ప్రశ్నను మారుతిని అడిగినప్పుడు...‘‘ నా బలం అదే. మతిమరుపు కాన్సెప్ట్ పై ‘భలే భలే మగాడివోయ్’ సినిమా తీశాం. మెదడకు సమస్య ఉంటే ప్రేమించే హృదయం ఏం చేస్తుంది? అనే పాయింట్‌ను ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. నా సినిమా కథలన్నీ చిన్న చిన్న పాయింట్సే. రన్నింగ్ ఎంజాయ్‌మెంట్ గురించి ఆలోచిస్తుంటాను. ‘భలే మంచి చౌక బేరం’ సినిమాకు కాన్సెప్ట్ ఇచ్చాను. నిర్మాత రాధామోహన్‌గారు చూశారు. సెప్టెంబర్‌లో రిలీజ్ అనుకుంటున్నాం. నా దర్శకత్వంలో రూపొందుతోన్న నాగచైతన్య ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా గురించి ఆ సినిమా రిలీజ్ సమయంలో తప్పకుండా మాట్లాడతాను.
Comments
Please login to add a commentAdd a comment