'ఆకలి రాజ్యంలో అంతులేని కథ' | Maruthi New movie aakali rajyam lo anthu leni katha | Sakshi
Sakshi News home page

'ఆకలి రాజ్యంలో అంతులేని కథ'

Published Tue, May 30 2017 12:56 PM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM

'ఆకలి రాజ్యంలో అంతులేని కథ'

'ఆకలి రాజ్యంలో అంతులేని కథ'

యూత్ ఫుల్ ఎంటర్టైనర్లు తెరకెక్కించటంతో దర్శకుడు మారుతి సెపరేట్ స్టైల్. మొదట్లో అడల్ట్ కంటెంట్ ఉన్న కథలతో సక్సెస్ సాధించిన మారుతి తరువాత రూట్ మార్చి రొమాంటిక్ ఎంటర్టైనర్లను అంధిస్తున్నాడు. అదే సమయంలో తాను నిర్మాతగా కొత్త దర్శకులను పరిచయం చేస్తూ యూత్ ఫుల్ కథలతో సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. అదే బాటలో ఓ ఇంట్రస్టింగ్ టైటిల్తో సినిమాను రెడీ చేస్తున్నాడు మారుతి.

రోజులు మారాయి సినిమా ఫేం మురళి దర్శకుడిగా కొత్త నటీనటులతో ఆకలిరాజ్యంలో అంతులేని కథ పేరుతో సినిమాను రూపొందిస్తున్నాడు. లెజెండరీ దర్శకుడు బాలచందర్ రూపొందించిన రెండు సినిమాల టైటిల్స్ను ఈ సినిమాకు టైటిల్గా ఎంచుకున్నాడు. తానే కథ అందిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమకాలీన సమస్యలను ప్రస్తావిస్తున్నాడట మారుతి. ఇప్పటికే ఈ సినిమాను షూటింగ్ 50 శాతానికి పైగా పూర్తయిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో ఇద్దరు కొత్త హీరోలు ఇండస్ట్రీ పరిచయం అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement