Balachander
-
నా ఫస్ట్ సినిమానే ఆయనతో చేయడం అదృష్టం
-
బతికుండగానే చితికి నిప్పుపెట్టినట్లు నటి 'సుజాత' జీవితం ముగిసిందా?
టాలీవుడ్లో ఎందరో స్టార్ హీరోలకు తల్లిగా నటించి, అలరించిన సుజాత అందరికీ గుర్తుండే ఉంటారు. పాత తరం అందరి అగ్రకథానాయకల సరసన సుజాత హీరోయిన్గా నటించి ఆకట్టుకున్నారు. తెలుగు, తమిళ, మళయాల, కన్నడ చిత్రాలలో నటించి అలరించిన సుజాత కొన్ని హిందీ సినిమాల్లోనూ నటించారు. సహజనటిగా పేరు సంపాదించిన సుజాత అనేక తెలుగు చిత్రాలలో కీలక పాత్రలు పోషించి ఇక్కడ చెరగని ముద్ర వేశారు. (ఇదీ చదవండి: వీళ్లది అలాంటి ఫ్రెండ్షిప్.. స్టార్ హీరోలు అయినా సరే!) సుజాత స్వతహాగ మళయాలి. కానీ ఆమె శ్రీలంకలోని గల్లేలో జన్మించింది. ఆమె బాల్యం కూడా శ్రీలంకలోనే గడిచింది. హైస్కూల్ చదువు పూర్తి కాగానే తొలిసారి 'ఎమకులమ్ జంక్షన్' అనే మళయాళ చిత్రంలో తొలిసారి నటించారామె. తర్వాత కె.బాలచందర్ దృష్టిని సుజాత ఆకర్షించారు. బాలచందర్ తెరకెక్కించిన 'అవల్ ఒరు తోడర్ కథై'లో ప్రధాన పాత్ర పోషించారామె. సుజాత నటించిన తొలి తమిళ చిత్రం ఇదే. తెలుగులో 'అంతులేని కథ'గా వచ్చింది. తర్వాత బాలచందర్ తెరకెక్కించిన 'అవర్గల్' (ఇది కథ కాదు) మూవీ కూడా సుజాతకు నటిగా మంచి పేరు తెచ్చి పెట్టింది. దాసరి నారాయణరావు సినిమాతో ఎంట్రీ అలా మంచి క్రేజ్‌లో ఉన్న సుజాతను దాసరి నారాయణరావు 'గోరింటాకు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం చేశారు. తెలుగులో మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్‌ను అందుకుంది. తర్వాత దాసరి డైరెక్షన్లో ఏయన్నార్, సీనియర్ ఎన్టీఆర్,కృష్ణంరాజు, కృష్ణలతో పలు సినిమాల్లో నటించారు. గుప్పెడు మనసు, పండంటి జీవితం, రగిలే జ్వాల, ప్రేమతరంగాలు, బంగారు కానుక, బహుదూరపు బాటసారి, సూత్రధారులు వంటి సూపర్ హిట్ చిత్రాలలో సుజాత కీలక పాత్రలు పోషించారు. వెంకటేష్ 'చంటి'లో తల్లి పాత్రలో అలరించిన సుజాత.. 'పెళ్ళి'లో పృథ్వీకి తల్లిగా కనిపించి మెప్పించారు. భర్త అనుమానంతో ఎన్నో ఇబ్బందులు అలా తెలుగు తెరకు పరిచయం ఉన్న ప్రముఖ హీరోలందరీ సినిమాల్లో నటించిన ఆమె నిజ జీవితం మొత్తం కన్నీటి గాథలే. ఇంట్లో పెద్దలకు నచ్చకపోయిన జయశంకర్ అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో అతను పచ్చళ్ల వ్యాపారం చేసేవాడు. అప్పట్లోనే విదేశాలకు కూడా తన వ్యాపారాన్ని విస్తరించాడు. కొద్దిరోజుల తర్వాత తన వ్యాపారం అంతగా జరగకపోవడంతో రానురాను పూర్తిగా సుజాత సంపాదన మీదనే ఆధారాపడ్డాడు. అక్కడి నుంచే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. పచ్చళ్ల వ్యాపారాన్ని క్లోజ్ చేసిన తర్వాత జయశంకర్ కూడా సుజాతతో పాటు సినిమా షూటింగ్ వద్దకు వెళ్లేవాడు. అక్కడ ఆమె ఎవరితోనైనా మాట్లాడుతూ కనిపిస్తే చాలు అనుమానంతో ఆమెపై రెచ్చిపోయేవాడు. ఇంటికి వెళ్లిన తర్వాత సుజాతపై మానసికంగానే కాకుండా శారీరకంగా కూడా హింసించేవాడు. ఆ భయంతో ఆమె సినిమా సెట్లో ఎవరితో మాట్లాడకుండా ఉండేవారు. భర్తతో ఎన్ని గొడవలు ఉన్నా పిల్లల చదువుల విషయంలో ఆమె నిర్లక్ష్యం చేయలేదు. కుమారుడు సాజిత్ సాఫ్ట్వేర్ రంగంలో, కూతురు దివ్య డాక్టర్‌గా స్థిరపడ్డారు. అయితే భర్తకు ఆమెపై ఉన్న అనుమానం రోజురోజుకూ పెరుగుతూ రావడం వల్ల చాలా సినిమా అవకాశాలను వదులుకుంది. (ఇదీ చదవండి: రామ్ చరణ్,జూ.ఎన్టీఆర్.. ఉత్తమ హీరో ఎవరో తేలనుందా..?) తర్వాత ఆమె ఆరోగ్యం దెబ్బతింది. రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. ఆమెకు మంచి గుర్తింపుతో పాటు సినిమా అవకాశాలు భారీగా వస్తున్న సమయంలో మంచాన పడ్డారు. అలా 2011 ఏప్రిల్ 6న చెన్నైలో గుండెపోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. అలా ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తితో కన్నీటితోనే కాపురం చేసింది. అలా బతికుండగానే చితికి నిప్పుపెట్టినట్లు ఆమె జీవితం ముగిసింది. -
'ఆకలి రాజ్యంలో అంతులేని కథ'
యూత్ ఫుల్ ఎంటర్టైనర్లు తెరకెక్కించటంతో దర్శకుడు మారుతి సెపరేట్ స్టైల్. మొదట్లో అడల్ట్ కంటెంట్ ఉన్న కథలతో సక్సెస్ సాధించిన మారుతి తరువాత రూట్ మార్చి రొమాంటిక్ ఎంటర్టైనర్లను అంధిస్తున్నాడు. అదే సమయంలో తాను నిర్మాతగా కొత్త దర్శకులను పరిచయం చేస్తూ యూత్ ఫుల్ కథలతో సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. అదే బాటలో ఓ ఇంట్రస్టింగ్ టైటిల్‌తో సినిమాను రెడీ చేస్తున్నాడు మారుతి. రోజులు మారాయి సినిమా ఫేం మురళి దర్శకుడిగా కొత్త నటీనటులతో ఆకలిరాజ్యంలో అంతులేని కథ పేరుతో సినిమాను రూపొందిస్తున్నాడు. లెజెండరీ దర్శకుడు బాలచందర్ రూపొందించిన రెండు సినిమాల టైటిల్స్‌ను ఈ సినిమాకు టైటిల్‌గా ఎంచుకున్నాడు. తానే కథ అందిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమకాలీన సమస్యలను ప్రస్తావిస్తున్నాడట మారుతి. ఇప్పటికే ఈ సినిమాను షూటింగ్ 50 శాతానికి పైగా పూర్తయిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో ఇద్దరు కొత్త హీరోలు ఇండస్ట్రీ పరిచయం అవుతున్నారు. -
చిట్టీల పేరుతో కుచ్చుటోపీ
♦ రూ. 3 కోట్లతో ఉడాయించిన హెచ్ఏఎల్ కార్మికుడు ♦ కోర్టును ఆశ్రయించిన బాధితులు బాలానగర్ : చిట్టీల పేరుతో హెచ్ఏఎల్ కార్మికుడు కుచ్చుటోపీ పెట్టాడు. బాధితులు తెలిపిన వివరాలు.. బాలానగర్‌లోని హిందూస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)లో బహదూర్ డిపార్టుమెంట్లో పనిచేసే పద్మనాభయ్య 2008 నుంచి చిట్టీలు నిర్వహిస్తున్నాడు. సుమారు 70 మంది హెచ్ఏఎల్ కార్మికులు అతడి వద్ద చిట్టీలు వేస్తున్నారు. మూడు కోట్ల రూపాయల చిట్టీల నిర్వాహణ జరుగుతుంది. 2014 వరకు చిట్టీలు సక్రమంగా నిర్వహించిన పద్మనాభయ్య అనంతరం సక్రమంగా డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడు. వడ్డీతో చెల్లిస్తానని నమ్మబలికాడు. అనుమానం వచ్చిన బాధితులు కంపెనీలో ఉన్న యూనియన్‌కు ఫిర్యాదు చేశాడు. యూనియన్ పద్మనాభయ్య, కార్మికులతో మాట్లాడించి ఆరు నెలల్లో మొత్తం డబ్బులు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఆరు నెలలు గడిచినప్పటికీ పద్మనాభయ్య బాధితులకు డబ్బులు ఇవ్వలేదు. వారు పద్మనాభయ్యపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో గత నెల 11వ తేదీన కుటుంబ సభ్యులతో వెళ్లిపోయాడు. బాధితులు పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించగా ఇది సివిల్‌కు సంబంధించిందని పోలీసులు చెప్పడంతో బాధితుల్లో ఒకరైన జిల్లా కోర్టును ఆశ్రయించారు. కోర్టు అరెస్టు వారంట్ జారీ చేసింది. అయితే అతడు ఎక్కడున్నది తెలియ రాలేదు. ఆలస్యంగా వెలుగులోకి మరో ఘటన.. ఇదిలా ఉండగా మూడు నెలల క్రితం హెచ్ఏఎల్లో పనిచేసే బాలచందర్ అనే వ్యక్తి కూడా చిట్టీల పేరుతో సుమారు 20 కోట్లతో ఉడాయించి వెళ్లిపోయాడు. చిట్టీలతో పాటు ఉద్యోగ విరమణ పొందిన కార్మికుల నుంచి కోట్లాది రూపాయలను వడ్డీకి తీసుకొని జమచేశాడు. గత సంవత్సరం నుంచి అడిగిన వారికి డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడు. కార్మికుల ఒత్తిడి తట్టుకోలేక గత ఆరు నెలల క్రితం బాలచందర్ కుటుంబం వెళ్లిపోయింది. మోసపోయామని తెలుసుకున్న కార్మికులు గత మూడు నెలల క్రితం బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు చేతుల్లో మోసపోయిన తమకు న్యాయం చేయాలని హెచ్ఏఎల్ బాధిత కార్మికులు కోరుకుంటున్నారు. -
రంగురంగుల నలుపు
చూడచూడ బాధల జాడ వేరు. నిజమే కదా. మహిళ కష్టాలకు ఎన్ని కారణాలు! ఎన్ని కోణాలు! ఎన్ని నలుపులు! ఎన్ని నలుపులేంటీ?! మహిళకు కష్టం ఒక చీకటి అయితే, చీకటి రంగు నలుపు అయితే... ఆ నలుపునకు ఎన్ని రంగులు ఉంటాయో ఈ సినిమా చూస్తే అర్థం అవుతుంది. అందుకే ఇది అంతులేని కథ... అంతుచిక్కని వ్యథ. సినిమా చూస్తూ ఉంటే మెల్లగా ఓ తెలియని వెలితి ఏదో గుండెను నింపేస్తుంది. ఇది ఒక పొయెటిక్, ఫిక్షనల్ కథనం అయినా... మహిళల జీవితాలలో ఎప్పటికీ తెగని, తగ్గని కష్టానికి అద్దం పడుతుంది. సెన్సిటివ్ వ్యూయర్‌కి మాత్రం... అనాదిగా మహిళ కడుపులో తిప్పే బాధ, వ్యథ... సమాజం ఒడిలో ప్రసవించినట్టు అనిపిస్తుంది. సినిమా నిడివికి అంతు ఉంది. కాని అది చెప్పే కథ అంతులేనిది. మళ్లీ చూడండి ప్రతి అమ్మాయిలోనూ ఒక జయప్రద ఉంటుంది. నాన్న చేతులెత్తేసినప్పుడో, అన్న చేతకానితనంలోనో ఆమె బయటికొచ్చి కుటుంబం కోసం ఓ చెయ్యి వేస్తుంది. స్త్రీ తనను తానైనా వదిలించుకుంటుంది కానీ, బాధ్యతలను వదిలించుకుని వెళ్లిపోలేదు. అది ఆమె బలమా? బలహీనతా? లేక సహజ గుణమా?‘పెద్దపులి, పొగరుబోతు, గయ్యాళి, కొరకురాని కొయ్య, గర్విష్టి! ఇవన్నీ రోజూ సరిత పొందే బిరుదులు. (సరితంటే జయప్రద).జగమంత కుటుంబం ఆమెది!పిరికిభర్తకు భార్యగా, పసుపు కుంకుమలతో ఉన్న వితంతువు... తల్లి పార్వతి. ఆమె రెండవ కూతురు, సరిత చెల్లెలు భారతి. అక్క కన్నా ముందు తొందరపడి తలంబ్రాలు పోయించుకుని, అంతకన్నా తొందరగానే తలమాసి కూర్చున్న కన్నెపిల్ల. అన్నెం పున్నెం ఎరుగని మరో చెల్లెలు సుమతి. కన్న ఇంటికే కన్నం వేయడానికీ వెనుకాడని ప్రబుద్ధుడు అన్న మూర్తి (రజనీకాంత్). భరించలేని భర్తకు భార్యగా, ఆ ఇంటికో బరువుగా బ్రతుకు లాగుతున్న ఇద్దరు పిల్లల తల్లి కనకం. పుట్టించినవాడు పెట్టక మానడని ఏ కొరతా తెలియక పెరుగుతూన్న పసి హృదయాలు సీత, కుమార్. కళ్లు లేకున్నా కలలకు కరువు, ఆశలకు అదుపు లేని గుడ్డి తమ్ముడు రాజు. ఈ నిస్సహాయులకు, నిర్భాగ్యులకు తన నీడనంతా పంచి, తనకొక నీడను చూసుకోవాలనే తలంపును చంపుకుని ఎనిమిదేళ్లుగా ఆ కుటుంబలోనే వేళ్లు పాతుకుపోయిన మహావృక్షం, మనసుగల వృక్షం సరిత. ఆమె జీవితానికి గమ్యం ఎక్కడో, ఆమె త్యాగానికి అంతం ఎప్పుడో ఎవ్వరికీ తెలియదు. అందుకే ఆమె కథ... అంతులేని కథ’. సినిమా ప్రారంభంలో జయప్రద ఇంట్రడక్షన్ ఇది. నిజానికి సినిమాలోని ప్రతి సీన్... ఆమె ఇంట్రడక్షన్లాగే ఉంటుంది. రాత్రి 1.25. మంచంపై పడుకుని ‘పోర్ట్నాయ్స్ క ంప్లైంట్’ పుస్తకం చదువుతోంది జయప్రద! ఇరవయ్యిల్లో ఉన్న జయప్రద. తొమ్మిది మంది ఉన్న ఇంట్లో ఒక్కటే అయిపోయిన జయప్రద. నిద్ర పట్టక ఆమె చదవడం లేదు. నిద్ర పట్టడానికీ చదవడం లేదు. చదువుతోంది అంతే. అవునూ... ఆమె చేతుల్లో ఆ పుస్తకమే ఎందుకు ఉంది? పుస్తకం తెరవగానే ఫస్ట్ పేజీలోనే... లోపల ఏం ఉందో చెప్పేస్తాడు పుస్తక రచయిత ఫిలిప్ రోత్. ‘అంతులేని కథ’... ఎవరి కథో సినిమా మొదట్లోనే కె.బాలచందర్ చెప్పేసినట్టు.ఒక్క ముక్కలో : నైతిక కట్టుబాట్లకు, భౌతిక పట్టువిడుపులకు మధ్య సాగే సిగ్గులేని సంఘర్షణ... పోర్ట్నాయ్స్ కంప్లైంట్. బాలచందర్ ఎవర్నీ నేరుగా చూపించరు. వేరేచోట్నుంచి బయటికి లాగుతారు. ఇక్కడ ఆయన చూపించదలచుకుంది జయప్రదను కాదు. రజనీకాంత్‌ని. అంత రాత్రప్పుడు లస్ట్-రిడెన్గా ఉన్న రజనీకాంత్‌ని రిప్రెజెంట్ చేయడానికి జయప్రద చేతిలో ఆయన ఆ పుస్తకం పెట్టారని.. సీన్ కొనసాగింపులో తడుతుంది. జయప్రద బుక్ చదువుతోంది. బయట చంటిపిల్లాడి ఏడుపు వినిపిస్తోంది. వాడు ఏడుపు ఆపడం లేదు. ఎవరూ వాడి ఏడుపును ఆపడం లేదు. జయప్రద బయటికి వస్తుంది. మంచాల మధ్య... నేలపై చాప. చాపపై పిల్లాడు. గుక్కపట్టి ఏడుస్తుంటాడు. ‘వదినా.. వదినా....’ అని పిలుస్తుంది జయప్రద. వదిన రాదు. పక్కనే ఉన్న చెల్లి మేల్కొంటుంది. ‘వదినెక్కడ’? అని అడుగుతుంది చెల్లిని. ‘అక్కడే పడుకుని ఉండాలే’ అని అంటుంది చెల్లి. వాణ్ని చేతుల్లోకి తీసుకుని మళ్లీ ‘వదినా’ అని పిలుస్తుంది. వదిన రాదు. వదిన భర్త రజనీకాంత్ గది బయటికి వచ్చి తలుపుకు ఆనుకుని నిలబడతాడు. ఒంటి మీద చొక్కా లేకుండా. వట్టి లుంగీతో. జయప్రద అసహ్యంగా చూస్తుంది. రజనీకాంత్ నిర్లక్ష్యంగా చూస్తాడు. పిల్లాడు ఏడుపు ఆపడు. ‘వదినా’ అని ఇంకోసారి పిలుస్తుంది. కొన్ని క్షణాల తర్వాత అదే గదిలోంచి (రజనీకాంత్ వచ్చిన గది) చీరను భుజం చుట్టూ కప్పుకుంటూ వచ్చి ఆడపడుచు చేతుల్లోంచి బాబును అందుకుని వెళ్లిపోతుంది. ఎక్కడి వాళ్లు అక్కడ మళ్లీ పడకల్లోకి సర్దుకుంటారు. జయప్రద తన గదిలోకి వెళుతుంది. వెళ్లి, వెనక్కు తిరిగి రజనీకాంత్‌ను చూస్తుంది. ‘హు.. డబ్బు దాహం తీర్చడానికి ఒక చెల్లెలు, ఆకలి, దాహం తీర్చడానికి ఒక తల్లి, కామదాహం తీర్చడానికి ఒక పెళ్లాం. ఛీ.. సిగ్గులేని జన్మ’ అని ముఖం మీదే తలుపులు దడేల్మని వేస్తుంది. పరిస్థితులతో వెక్స్ అయిపోయిన అమ్మాయి అలాగే మూసేస్తుంది. తనను తనూ మూసేసుకుంటుంది. అంతులేని కథ 1976లో విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరికి 40 ఏళ్లు. కథంతా ముందే చెప్పేసి, కథనంతో సినిమాను ప్లే చేశారు బాలచందర్. క్లాసిక్‌గా నిలబడి పోయింది. కథ ఎం.ఎస్.పెరుమాళ్. మాటలు పాటలు ఆచార్య ఆత్రేయ. సంగీతం ఎం.ఎస్.విశ్వనాథన్. స్వరామృతం జేసుదాస్, పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్పీబీ, ఆనంద్. అంతా కలిసి సినిమాను నిలబెట్టారు. సినిమాతో పాటు నిలిచిపోయారు. రజనీకాంత్‌కి, నారాయణరావుకు ఇది తొలి చిత్రం. జయప్రదకు, ఫటాఫట్ జయలక్ష్మికి, శ్రీప్రియకు, చిన్నాచితక చిత్రాల తర్వాతి చిత్రం. కమలహాసన్... ఇలా వచ్చి, అలా వెళ్లిపోయే గెస్ట్ రోల్ చేసిన చిత్రం. ఫైట్లు లేవు. డ్యూయెట్లు లేవు. సెట్టింగులు లేవు. హీరోల్లేరు. విలన్లు లేరు. కేవలం మనుషులు, వారి స్వభావాలు మాత్రమే ఉన్నాయి అంతులేని కథలో. షూటింగ్ కూడా ఒకేచోట వైజాగ్‌లో ఒక మామూలు మధ్యతరగతి ఇంట్లో జరిగింది.జయప్రద వర్కింగ్ ఉమెన్. ఇంట్లోవాళ్లందరి కోసం తనొక్కతే కష్టపడి పనిచేస్తుంటుంది. తన గురించి మర్చిపోతుంది. త్యాగానికి కూతురు, త్యాగానికి చెల్లి, త్యాగానికి అక్క, త్యాగానికి అత్త... అన్నీ అవుతుంది. భార్యగా త్యాగమూర్తి కావడమే మిగిలింది. సినిమా ఎండింగులో ఆ త్యాగాన్ని కూడా చేస్తుంది. భర్తగా కాబోయే కమలహాసన్‌ను ఆఖరి నిమిషంలో (రజనీకాంత్‌ని ఎవరో చంపేశారన్న వార్త తెలిసిన నిమిషంలో) ఒప్పించి అదే ముహూర్తానికి చెల్లికి భర్తను చేస్తుంది. సినిమాలో జయప్రద సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్. అంతులేని కథలో ఆమెను చూస్తుంటే... ఆమెలోని హోప్ మీద, డిటర్మినేషన్ మీద చచ్చేంత అట్రాక్షన్ కలుగుతుంది. స్ట్రాంగ్ విల్డ్ ఉమన్. అంత స్ట్రాంగ్‌గా ఉన్న మనిషికి తన దారి తను చూసుకునే ధైర్యం కూడా ఉంటుంది. సంపాదిస్తోంది కనుక. కానీ ఆలా చూసుకోలేదు. తండ్రి వదిలించుకుని వెళ్లిన బాధ్యతల కోసం, అన్న భుజంపై వేసుకోని బరువుల కోసం స్ట్రాంగ్‌గా నిలబడింది. మొదట్లో జయప్రదను ఇంట్రడ్యూస్ చేసినప్పుడే... రీ ఇంట్రడ్యూస్ కూడా చేస్తాడు బాలచందర్. మంచులా కరిగిపోయే సరిత మనసు ఎందరికి తెలుసు? నిజాయితీలో నిప్పులా, నియమాలలో కత్తిలా, కర్తవ్య నిర్వహణలో కటిక పాషాణంలా కనిపిస్తుంది. కానీ రాళ్లల్లో కూడా నీళ్లుంటాయని తెలిసినవాళ్లెందరు? ఆమె కళ్లల్లో కన్నీళ్లు, ఆమె మనసులో మంచితనం చూడగలవాళ్లెవ్వరూ లేరు... అంటారు.. జయప్రదకు నా అన్నవారు ఎవరూలేరా? ఒక స్నేహితుడు ఉంటాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ తను పెళ్లిచేసుకుని వెళ్లిపోతే తన ఫ్యామిలీ ఎలా అని ఆలోచిస్తుంది. ఆ స్నేహితుడి మనసు క్రమంగా ఆమె చెల్లి (వితంతువు శ్రీప్రియ) వైపు మళ్లుతుంది. ఆమెకు ప్రేమలేఖ కూడా రాస్తాడు. ఇది తెలిసి వాళ్లిద్దరికీ పెళ్లి చేస్తుంది జయప్రద. (ఆ తర్వాతే కమల్ ప్రపోజల్ వస్తుంది). సినిమా ప్రారంభంలో ఆమె జీవితం ఎలా మొదలవుతుందో... సినిమా ముగింపులోనూ అదే విధంగా మొదలౌతుంది. మార్పు లేదు. అంతిమ తీర్పూ లేదు. - సాక్షి ఫ్యామిలీ మరపురాని పాటలు దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి (జేసుదాస్) కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు (ఎస్.జానకి) అరె ఏమిటి లోకం... (ఎల్.ఆర్.ఈశ్వరి) తాళికట్టు శుభవేళ (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) ఊగుతోంది నీ ఇంట ఉయ్యాల(పి.సుశీల) -
వారంతా చిరంజీవులే!
గత సంవత్సర కాలంగా సినీ ప్రముఖులు అనేక మంది ఎన్నడు లేని విధంగా వరుసగా అసువులు బాయడం బాధాకరమైన విషయం. చిత్రపరిశ్రమ దిగ్ధంతులు ఒక్కొక్కరు అర్ధాంతరంగా, సహజంగా, అసహజంగా తెరమరుగవుతున్నారు. దీంతో సినీ అభిమానులు తమ ఆప్తులను కోల్పోయినట్లు విచారంలో మునుగుతున్నారు. మహా నటీనటులు అంజలిదేవి, అక్కినేని నాగేశ్వరరావు, దర్శకులు, రచయిత వి.బి.రాజేంద్రప్రసాద్, బాపు, బాలచందర్, గణేశ్ పాత్రో, యువ కథానాయకుడు ఉదయ్‌కిరణ్, క్యారెక్టర్ యాక్టర్ పి.జె.శర్మ, శ్రీహరి, ఆహుతి ప్రసాద్, తెలంగాణ శకుంతల, సంగీత దర్శకుడు, గాయకుడు చక్రి, ప్రేక్షకులను తమ హాస్య సంభాషణ, నటనలతో ఉర్రూతలూగించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్, ఎం.ఎస్.నారాయణ లాంటి తమకు తామే సాటైన హాస్యనటులు ఈ భూప్రపంచం నుండి, సినిమాలోకం నుండి జారిపోవడం అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. ఈ నేపథ్యంలో మన కళాకారులందరికీ ఒక విన్నపం. వారు ఆరోగ్యాన్ని అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ జన్మలన్నీ అపురూపమైనవి. ఆ జిలుగుల ప్రపంచంలో ఈ విషయాన్ని చాలామంది విస్మరిస్తున్నారు. ఇకనైనా నటీనటులు ఆరోగ్యం కోసం జాగ్రత్త పడాలి. భౌతికంగా కనిపించకపోయినా వారు తీసిన సినిమాలు, చూపిన ప్రతిభ, అందించిన సంగీతం, నేడు మనకు కనిపించకపోయినా ఆయా చిత్రాలలో లీనమై చేసిన పాత్రలు ఎన్నటికీ జీవించే ఉంటాయి. ఎన్ని తరాలు గడిచినా కళ్లముందు కదలాడుతూనే ఉంటాయి. ఆ రకంగా వారు ఎప్పుడూ చిరంజీవులే. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సంతాపం. - జి.వి. రత్నాకర్‌రావు వరంగల్ -
బాలచందర్ పెట్టిన పేరే జీవా
నన్ను నటుడిగా తీర్చిదిద్దింది... సినీ రంగానికి జీవాగా పరిచయం చేసింది ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ అని నటుడు జీవా తెలిపారు. పారిశ్రామికవేత్త పుట్టగుంట వెంకటసతీష్‌కుమార్ పరిశ్రమలో జరిగే నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు బుధవారం సాయంత్రం హనుమాన్‌జంక్షన్ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. వెయ్యికిపైగా సినిమాల్లో నటించి అన్ని వయసుల వారి ఆదరాభిమానాలు అందుకోవడం తన అదృష్టమన్నారు. తనకు నటుడిగా జన్మనిచ్చిన దర్శకుడు కె.బాలచందర్ మరణం తనకు 2014లో పెను విషాదం మిగిల్చిందన్నారు. ప్రశ్న : జీవాగా బాల చందర్ పరిచయంచేశారని అంటున్నారు.. మీ అసలు పేరు ఏమిటి? జవాబు : నా అసలు పేరు కొచ్చర్ల దయారత్నం. మహాదర్శకుడు బాలచందర్ పెట్టిన పేరుతో ప్రేక్షకులకు చేరువయ్యా. ప్రశ్న : మీ మొదటి చిత్రం ఏది? జవాబు : ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘తొలి కోడి కూసింది’. ప్రశ్న : ఆయన చిత్రానికి ఎలా ఎంపికయ్యారు? జవాబు : ‘తొలి కోడి కూసింది’ సినిమా కోసం నటులు కావాలని పత్రికల్లో ప్రకటన వచ్చింది. అది చూసిన నా స్నేహితులు నా ఫొటోలు పంపించారు. గుట్టలుగుట్టలుగా ఫొటోలు వచ్చినా సినిమా నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఒక్కరినీ కూడా ఎంపికచేయలేదు. ఆ విషయాన్నే బాలచందర్‌కు చెప్పారు. సంస్థ కార్యాలయం నుంచి వెళ్తున్న బాలచందర్‌కు ఫొటోల గుట్టల్లో రెండు కళ్లు కనిపించాయి. ఆ ఫొటోలో కుర్రాడికి కబురుపెట్టండని చెప్పడంతో సంస్థ ప్రతినిధులు నాకు టెలిగ్రామ్ ఇచ్చారు. ఆయనే నా పేరు కూడా మార్చి జీవాగా పరిచయం చేశారు. ప్రశ్న : మీరు తృప్తిపడింది విలన్‌గానా, హాస్యనటుడిగానా? జవాబు : రెండు పాత్రలూ రెండు కళ్లు వంటివి. ప్రతి ఒక్కరిలో అన్ని కోణాలూ ఉంటాయి. అయితే దర్శకుడు తమకు కావాల్సిన విధంగా నటుడిని మలుచుకుంటాడు. వంశీ, కృష్ణవంశీ, పూరిజగన్నాథ్ తదితర దర్శకులు నన్ను హాస్యనటుడిగా తీర్చిదిద్దారు. ప్రశ్న : ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం... జవాబు : నూతన సంవత్సరంలో ఎదుటి మనిషికి మంచి చేయకపోయినా ఫర్వాలేదు. కీడు మాత్రం తలపెట్టవద్దు. తెలుగు ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. -
'నాన్న కన్నా...ఆయన దగ్గరే ఎక్కువ పెరిగా'
చెన్నై: సినీనటుడు కమల్ హాసన్ బుధవారం ప్రముఖ దర్శకుడు బాలచందర్ కుటుంబసభ్యులను పరామర్శించారు. బాలచందర్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో షూటింగ్ నిమిత్తం కమల్ హాసన్ లండన్‌లో ఉండటంతో బాలచందర్‌ను చివరి చూపు చూసేందుకు అవకాశం దక్కలేదు. చెన్నై చేరుకున్న కమల్ హాసన్ ఈరోజు ఉదయం బాలచందర్ కుటుంబ సభ్యుల్ని కలిసి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాలచందర్ తనకు తండ్రిలాంటివారని, తన తండ్రి వద్దకన్నా ఆయన దగ్గరే ఎక్కువ పెరిగానని.. తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బాలచందర్ చివరిసారి 'ఉత్తమ విలన్' చిత్రంలో నటించటం తన పూర్వజన్మ సుకృతమన్నారు. ఆయన చిత్రాలను ప్రభుత్వం భద్రపరచి రేపటి తరాలకు అందించాలని కమల్ హాసన్ విజ్ఞప్తి చేశారు. -
చెన్నై సినీ చిత్రోత్సవాలు బాలచందర్‌కు అంకితం
తమిళసినిమా: 12వ చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల ముగింపు కార్యక్రమం స్ఫూర్తి దాయకంగా ప్రోత్సాహకరంగా జరిగింది. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన చిత్రోత్సవ కార్యక్రమాలు 46 దేశాలకు చెందిన చెన్నై సంస్కృతి, సంప్రదాయాలతో కూడిన 171 చిత్రాల ప్రదర్శన చెన్నై సినీ ప్రముఖులను పులకరింప చేసింది. అదే విధంగా ఉన్నత విలువలతో కూడిన మంచి కథా వస్తువుగా తమిళ చిత్రాలకు చక్కనిగుర్తింపు, గౌరవం దక్కింది. ఈ చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో యువతరానికి తగిన ప్రాధాన్యత లభించిందని చెప్పవచ్చు. గురువారం సాయంత్రం స్థానిక రాయపేటలోని ఉడ్‌ల్యాండ్ థియేటర్లో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో ఉత్తమ చిత్రాలకు అవార్డులను అందించారు. కుట్రం కడిదల్కు ప్రథమ అవార్డు ముందుగా ప్రతి ఏడాదీ అందిస్తున్న టెలిఫిలిం బఫ్ అవార్డు కోసం అత్యధికంగా 138 ఎంట్రీలు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు. వాటిలో టెలిఫిలిం బఫ్ అవార్డును మద్రాసు స్కూల్ ఆఫ్ ఎకనామిక్ అధ్యాపకుడు ఎస్.వినాయక్ గెలుచుకున్నారు. అదేవిధంగా ఎంజీఆర్ ఫిలిం ఇన్స్టిట్యూట్ విద్యార్థులు రూపొం దించిన ఐదు షార్ట్ ఫిలింస్లు ‘ఛీ’ అనే షార్ట్ ఫిలిం అమ్మా అవార్డును గెలుచుకున్నాయి. ఈ లఘు చిత్రరూపకర్త మనోజ్‌కుమార్ ఈ అవార్డుతో పాటు పదివేల రూపాయల నగదు బహుమతిని అందుకున్నారు. అమితాబ్‌బచ్చన్ యూత్ ఐకాన్ అవార్డును ఈ ఏడాది యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌కు దక్కింది. ఆయన అవార్డుతో పాటు లక్ష రూపాయల బహుమతిని అందుకున్నారు. కాగా తమిళ చిత్రాల పోటీలు మహిళాదర్శకురాలు తావిత్ షమీమ్ తెరకెక్కించిన పూవరసం పీపీ, నట దర్శకుడు పార్దీపన్ రూపొందించిన కథై తిరె కథై ఇయక్కం చిత్రంలో ప్రత్యేక జూరి అవార్డులను గెలుచుకున్నాయి. వీటికి తలా లక్షరూపాయల నగదు బహుమతుల్ని అందించారు. ఇక రెండో ఉత్తమ కథా చిత్రంగా నవ దర్శకుడు హబ్ వినోద్ దర్శకత్వంలో నటుడు మనోబాల నిర్మించిన చదరంగవేట్టై గెలుచుకుంది. ఈ అవార్డుతో పాటు నిర్మాతకు లక్ష, దర్శకుడిగి లక్ష నగదు బహుమతితో సత్కరించారు. ప్రథమ ఉత్తమ కథా చిత్రంగా కుట్రం కడిదల్ చిత్రం ఎంపికైంది. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన బ్రహ్మజీకి రెండు లక్షలు, నిర్మాతలు సతీష్‌కుమార్, కిష్టి సిలువప్పన్లకు లక్ష రూపాయల నగదు బహుమతిని అందుకున్నారు. ఇండో సినీ అప్రిషియోషన్ సంస్థ నిర్వహించిన ఈ చిత్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ రాధిక ఫిలిం చాంబర్ అధ్యక్షుడు వాసుదేవన్, నటి సుహాసిని, పూర్ణిమా భాగ్యరాజ్, శ్రీప్రియన రాజ్‌కుమార్, పీ.వాసు మొదలగు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఉత్తమ చిత్రాల ఎంపిక కష్టమనిపించింది ముందుగా అవార్డు బ్యూరీ కమిటీ సభ్యుడు, దర్శకుడు పీ.వాసు మాట్లాడుతూ ఈ రోజు తమిళ సినిమా హెడ్మాస్టర్ లేని పాఠశాలగా మారిపోయిందన్నారు. కారణం అందరికీ తెలిసిందే. కె.బాలచందర్ లేని లోటు తీర్చలేనిదన్నారు. ఇక ఈ చిత్రోత్సవాల గురించి చెప్పాలంటే 171 విదేవీ చిత్రాలను తమిళ సినీ ప్రేక్షకుల చూసే భాగ్యం కలిగిందన్నారు. అవార్డుల పోటీలో పాల్గొన్న 12 తమిళ చిత్రాలలో ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేయడం చాలా కష్టమైందని అన్నారు. మంచి కథా చిత్రాలను చూడాలంటే ఇంతకుముందు కోల్కత్తా, బెంగళూరు, కేరళ చిత్రాలను ఉదాహరణగా చెప్పేవారన్నారు. అలాంటిదిప్పుడు తమిళ సినిమా అని గర్వంగా చెప్పుకునే స్థాయికి మన చిత్రాలు ఉంటున్నాయని అన్నారు. కె.బాలచందర్ అవార్డు గత ఏడాది ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్‌బచ్చన్ యువ కళాకారులను ప్రోత్సహించే విధంగా 11 లక్షలను విరాళంగా ప్రకటించారు. ఆ మొత్తాన్ని అమితాబ్ యువ ఐకాన్ అవార్డును ప్రవేశ పెట్టి ప్రతి ఏడాదీ ఒకవర్ధమాన కళాకారుడికి అవార్డుతో పాటు *లక్ష అందిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి మరో అవార్డు నెలకొననుంది. అదే బాలచందర్ అవార్డు. ఈ అవార్డు కోసం ప్రతి ఏడాది నటి శ్రీప్రియ రాజ్‌కుమార్ *లక్ష రఅందించనున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ 12వ చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలను దర్శక శిఖరం బాలచందర్‌కు అంకితం ఇస్తున్నట్లు శరత్‌కుమార్ తెలిపారు. -
బాలచందర్ శ్రీశ్రీ
స్మరణ ఢిల్లీలో ముగ్గురు నిరుద్యోగులు. ‘ఏంటి... స్మోకింగ్ చేయవా... ఇక్కడ చాలాసార్లు దాంతోనే కడుపు నింపుకుంటాం తెలుసా’ అంటాడు కమలహాసన్ సినిమా ప్రారంభంలో. ఆకలి రాజ్యం రోజులు అవి. నిరుద్యోగ రోజులు. ‘మీకు ఉద్యోగం ఇవ్వలేకపోతున్నందుకు చింతిస్తున్నాం’ అని చెప్పే రోజులు. ఏ రాజధాని చేరినా నో వేకెన్సీ బోర్డులే. కాని ఆకలి ఊరుకోదు కదా. టైమ్‌కు అలారం మోగినట్టుగా పేగుల్ని మెలిపెడుతుంది. కడుపును రగిలిస్తుంది. మొదటి రీలులోనే ఎవడో ‘రేయ్ ఆకలిగా ఉందిరా’ అంటాడు. దానికి కమలహాసన్ ఊపిరి బిగపట్టి కవిత అందుకుంటాడు. శ్రీశ్రీ కవిత. పతితులారా భ్రష్టులారా బాధాసర్పదష్టులారా దగాపడిన తమ్ములారా ఏడవకండేడవకండి జగన్నాథ రథచక్రాలొస్తున్నాయ్ యొస్తున్నాయ్... సంప్రదాయ కుటుంబంలో పుట్టినా కూపస్థ మండూకంలా ఉండదలుచుకోలేదా యువకుడు. అభ్యుదయం కావాలి. వెలుతురు కావాలి. క్షవరం చేయించుకుని వచ్చిన అతడిని ‘దూరం నిలబడు. మైల’ అంటాడు తండ్రి. మైలా? దీనికి జవాబు? శ్రీశ్రీ కవితే. సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు నా వినిపించే నవీన గీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం.... పోస్టల్ ఆర్డర్‌కు తండ్రి డబ్బు ఇవ్వకపోతే ఆయన తంబూరా అమ్మేస్తాడా యువకుడు. మిగిలిన చిల్లరతో ద్రాక్షపళ్లు కొని చేతిలో పెడతాడు. ఇంటి నుంచి బయటకు గెంటేయడానికి ఇంతకన్నా ఏం కారణం కావాలి. ఫో.. బయటకి ఫో. అతడు అప్పటికే ఢిల్లీకి టికెట్ కొనుక్కుని ఉన్నాడు. సూట్‌కేస్ అందుకుని ఇంటి నుంచి బయటకు నడుస్తుంటే తండ్రి హేళనగా రెట్టిస్తాడు... ‘ఏం... ఇప్పుడు గుర్తుకు రావడం లేదా శ్రీశ్రీ కవిత్వం?’ ఎందుకు లేదు? సిద్ధంగా ఉంది. పోనీ పోనీ పోతే పోనీ సతుల్ సుతుల్ హితుల్ పోనీ రానీ రానీ వస్తే రానీ కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ శాపాల్ రానీ..... దేశంలోని నిరుద్యోగ సమస్య చూసి విసుగెత్తిన బాలచందర్ 1980లో ‘ఒరుమయిన్ నిరం సివప్పు’ పేరుతో తమిళంలో సినిమా తీశాడు. తెలుగులో ఆ మరుసటి సంవత్సరమే ‘ఆకలి రాజ్యం’ పేరుతో. తమిళంలో ఆయన తన కథానాయకుడి ఆగ్రహానికి ఆలంబనగా సుబ్రమణ్య భారతి కవిత్వాన్ని సందర్భానుసారంగా వాడాడు. తెలుగులో అందుకు ప్రత్యామ్నాయం శ్రీశ్రీ కాకుండా వేరెవరు ఉంటారు? సాహిత్యాన్ని, కవిత్వాన్ని పలవరించే నాయకుడు, శ్రీశ్రీని గౌరవించే నాయకుడు మన వెండితెర మీద ఉండొచ్చని, ఉండాలని ఒక తమిళుడు చూపించాడు. విషాదం. గొప్ప సాహిత్యాన్ని తూకానికి అమ్ముకునే దౌర్భాగ్యానికి ఏడ్చే నాయకుణ్ణి కూడా. శ్రీశ్రీ ఇంతగా వినిపించిన సినిమాను శ్రీశ్రీ చూశారా? ఆ ప్రశ్నే అడిగితే- విన్నాను. ఇంకా చూడలేదు అని జవాబు చెప్పారు శ్రీశ్రీ ఏదో ఇంటర్వ్యూలో. ఓ మహాత్మా.... ఓ మహర్షీ... -
బాలచందర్ మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటు : ఆర్కే రోజా
నగరి(చిత్తూరు): పముఖ దర్శకుడు బాలచందర్ మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటని సినీనటి, చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన మహానటులను పరిచయం చేసిన ఘనత బాలచందర్‌కు దక్కుతుందని అన్నారు. నటులు సూపర్‌స్టార్ రజనీకాంత్, కమల హాసన్, ప్రకాష్‌రాజ్ లాంటి వందలాది నటులను, మ్యూజిక్ డెరైక్టర్ ఏఆర్ రహమాన్‌ను చిత్రసీమకు ఆయనే పరిచయం చేశారన్నారు. వందకు పైగా చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారన్నారు. ప్రతి చిత్రాన్ని తనదైన శైలిలో వినూత్నంగా మలచడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. 2014 చలన చిత్ర పరిశ్రమకు అచ్చిరాలేదన్నారు. మహా నటులు అక్కినేని నాగేశ్వరరావు, మ్యూజిక్ డెరైక్టర్ చక్రి, శ్రీహరి, ఉదయకిరణ్, తెలంగాణ శకుంతల, ధర్మవరపు సుబ్రమణ్యం, శర్మ, మంజుల, బాపు లాంటి ఎందరినో ఈ ఏడాది చరిత్రలో కలిపి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
బాలచందర్‌కు అంతిమ వీడ్కోలు
* శోకసంద్రంలో దక్షిణాది సినిమా * అంజలి ఘటించిన తారాలోకం సాక్షి, చెన్నై: దక్షిణాది సినీదర్శక దిగ్గజం బాలచందర్ భౌతికకాయానికి బుధవారం సాయంత్రం చెన్నై బీసెంట్ నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు ముగిశాయి. అంతకుముందు మైలాపూర్‌లోని బాలచందర్ స్వగృహంలో ఆయన భౌతికకాయానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పించారు. శోకతప్తులైన అభిమానులతో ఆ ప్రాంతం నిండిపోయింది. డీఎంకే అధినేత కరుణానిధి, స్టాలిన్‌లతోపాటు పలువురు రాజకీయ నాయకులు నివాళులర్పించారు. నటులు రజనీకాంత్, శరత్‌కుమార్, విజయకాంత్, విజయ్, కార్తి, ధనుష్, శివకుమార్, సీనియర్ నటి రాజశ్రీ, రాధిక, సరిత, సుహాసిని, నిరోషా, లతా రజనీకాంత్, ఐశ్వర్య ధనుష్, వై.విజయ, సరస్వతి, దర్శకుడు ఎస్.పి.ముత్తురామన్, శంకర్, మణిరత్నం, ఇళయరాజా, ఎ.ఆర్.రెహ్మాన్, అర్జున్ తదితరులు నివాళులర్పించారు. హైదరాబాద్ నుంచి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ముంబయి నుంచి నటి జయప్రద ప్రత్యేకంగా చెన్నైకి వచ్చి బాలచందర్‌కు నివాళులర్పించారు. అయితే అమెరికాలో ఉత్తమవిలన్ చిత్ర నిర్మాణంలో ఉన్న కమల్‌హాసన్ తన గురువు కడసారి చూపునకు నోచుకోలేకపోయారు. నాకు గురువు కాదు దేవుడు: రజనీకాంత్ ‘‘దర్శక దిగ్గజం బాలచందర్ నాకు గురువు కాదు, దేవుడు. ఆయన మృతితో నన్ను నేను కోల్పోయూను. ఇది నా జీవితంలో ఎప్పటికీ తీరని లోటు’’ అంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ అవార్డు నందించారు: అరవింద్ బాలచందర్‌తో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని, తన తండ్రి ఆయన దర్శకత్వంలో రెండు చిత్రాల్లో నటించారని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. ‘‘మా కుటుంబానికి రుద్రవీణ చిత్రంతో జాతీయ అవార్డును అందించిన దర్శకుడు కె.బాలచందర్. అలాంటి రుద్రవీణ నేడు మూగబోయింది’’ అన్నారు. బాలచందర్ చిత్రం ‘అరంగేట్రం’ చూశాక డైరీలో బాలచందర్ గారి అడ్రసు చూసి ఆయన ఇంటికి వెళ్లినట్టు చెప్పారు. ‘నన్ను కూర్చోబెట్టి వచ్చిన విషయం చెప్పమని అడిగారు. అరంగేట్రం చిత్రం నాకు ఎంతగానో నచ్చిందని చెప్పాను. నా విచక్షణను బాలచందర్ మెచ్చుకున్నార’ని అరవింద్ అన్నారు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్ర నిర్మాణానికి ముందు బాలచందర్‌ను కలిసి మీ ‘బొమ్మా బొరుసా’ చిత్రాన్నే ఆ చాయలు లేకుండా తీస్తున్నట్టు మరోసారి కలసి చెప్పానన్నారు. అదే చిత్రాన్ని తమిళంలో మాప్పిళై పేరుతో రీమేక్ చేసి విజయం సాధించినప్పుడు ఆయన్ని కలసినట్టు తెలిపారు. నాకు తండ్రిలాంటి వారు: నటి జయప్రద ‘‘కె.బాలచందర్ నాకు తండ్రి లాంటివారు. ఆయన చాలా మితభాషి. సెట్లోకొస్తే ఎప్పుడూ ఏదో కొత్తగా చెయ్యాలని తపించేవారు’’ అని ప్రముఖనటి జయప్రద అన్నారు. బాలచందర్ సెట్లోకి వస్తున్నారంటే రజనీ, కమల్‌లతో సహా అందరం ఉత్కంఠతో ఎదురుచూసేవాళ్లమన్నారు. ‘‘ఆయనంటే మాకెంతో గౌరవం. ఆయన గట్టిగా అరిస్తే ఏడ్చేసేదాన్ని.. నటనలో ఎక్కడా శిష్యరికం చెయ్యకపోయినా బాలచందర్ స్కూల్లో చాలా నేర్చుకున్నాం. అలాంటి ఆయన లేరంటే నమ్మలేకపోతున్నాం’’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
మన ఇంట్లోనో ..పక్కింట్లోనే జరిగినట్లు..
చెన్నై : తనకు సినిమాల్లో అవకాశం తగ్గినప్పుడు బుల్లితెర ద్వారా బాలచందర్ ఛాన్సులు ఇచ్చి ..తనకు భిక్ష పెట్టారని నటుడు శుభలేఖ సుధాకర్ అన్నారు. ఆయన బుధవారం ఉదయం బాలచందర్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ బాలచందర్ తనకు గురువు అని గుర్తు చేసుకున్నారు. ఆయన తీసిన సినిమాలు మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించినవేనని... వారి సమస్యలతో పాటు మానసిక స్థితిని వెండితెరపై బాగా చూపించేవారన్నారు. బాలచందర్ సినిమాలు ప్రేక్షకులకు దగ్గరగా ఉంటాయని..'మన ఇంట్లోనో లేక పక్కింట్లోనే..ఎక్కడో జరిగినట్లుగా నిజ జీవితానికి' దగ్గరగా ఉంటాయన్నారు. ఆయన సృష్టించిన పాత్రల్లో నటించిన నటులకు కూడా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. మధ్య తరగతి కుటుంబాల మానసిక స్థితిని ఏ దర్శకుడు ఇంత దగ్గరగా చిత్రీకరించలేదన్నారు. ఈ సందర్భంగా బాలచందర్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని శుభలేఖ సుధాకర్ గుర్తు చేసుకున్నారు. -
ఆయన నా గురువే కాదు...తండ్రిలాంటి వారు
చెన్నై : ప్రముఖ నటుడు రజనీకాంత్ ఇంకా షాక్‌లోనే ఉన్నారు. ప్రముఖ దర్శకుడు బాలచందర్ ఇకలేరన్న వార్తను ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. బాలచందర్ లోటు తనకు వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగా కూడా పూడ్చలేని లోటు అని రజనీకాంత్ అన్నారు. ఆయన లేరంటే నమ్మలేకపోతున్నానని, బాలచందర్ తనకు గురువు మాత్రమే కాదని.. ఆయన తండ్రిలాంటి వారని, ఆయన తనను సొంత బిడ్డలా చూసుకునేవారని ఆయన పేర్కొన్నారు. కాగా రజనీకాంత్‌తో పాటు కమల్ హాసన్‌ను వెండి తెరకు పరిచయం చేసింది బాలచందరే. 1975లో 'అపూర్వ రాగంగల్' చిత్రం ద్వారా రజనీకాంత్‌ను బాలచందర్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. మొదటి చిత్రం నుంచి చివరి వరకూ వారి మధ్య సాన్నిహిత్యం కొనసాగింది. వీరిద్దరి కాంబినేషన్లో పది చిత్రాలు వచ్చాయి. చెన్నైలోని ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలచందర్ నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా కుటుంబ సభ్యులు బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
అతనిక చరిత్ర
-
తొందరపడ్డ రాంగోపాల్ వర్మ..
దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఈసారి ఆయన బతికి ఉన్నవాళ్లను తొందరపడి మరి 'ట్విట్'తో చంపేశారు. ప్రముఖ దర్శకుడు బాలచందర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే... చనిపోయినట్లు ...అందుకు ఆయనకు సంతాపం తెలుపుతూ ట్విట్ చేశారు. అయితే జరిగిన పొరపాటును గ్రహించి నాలిక కరుచుకున్న వర్మ ...కొద్దిసేపట్లోనే తాను చేసిన ట్విట్‌ను తొలగించేశారు రాంగోపాల్ వర్మ ఎక్కడుంటే వివాదాలు అక్కడే ఉంటాయని నానుడి ఉంది. దేవుడు నుంచి దెయ్యాన్ని కూడా వదలని ఆయన..తన కామెంట్లతో తరచు మీడియాలో నానే విషయం తెలిసిందే. మరోవైపు బతికున్నవాళ్లు చనిపోయారని అవగాహనారాహిత్యంతో స్పందించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి సున్నిత విషయాల్లో విజ్ఞత పాటించటం ఎంత ఉత్తమమో ఈ ఉదంతం చెప్పకనే చెబుతుంది. కాగా బతికున్నవారు చనిపోయినట్లుగా ప్రచారం జరిగితే వారికి ఆయుషు పెరుగుతుందనే నమ్మకం ఉంది. అలాగే వర్మ కూడా తన ట్విట్‌తో బాలచందర్‌కు దిష్టి తీసి ఉంటారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
నిలకడగా బాలచందర్ ఆరోగ్యం
ప్రఖ్యాత సినీ దర్శకుడు కె.బాలచందర్ నగరంలోని కావేరి ఆస్పత్రిలో అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ సమస్య మినహా మిగతా అన్ని అవయవాలు కుదుటపడినట్లు వైద్యులు మంగళవారం సాయంత్రం విడుదల చేసిన బులెటన్లో వెల్లడించారు. కిడ్నీలకు డయాలసిస్ చికిత్స అంది స్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బాలచందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడిం చారు. పలువురు సినీ ప్రముఖులు బాలచందర్‌ను ఆస్పత్రిలో కలిసి పరామర్శించారు. డీఎంకే నేత స్టాలిన్, విజయకుమార్, నటి కె ఆర్ విజ య, రాజేష్, తమిళనాడు దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్ మొదలగు పలువురు కె.బాలచందర్‌ను పరామర్శించారు. కె ఆర్ విజయ బాలచందర్‌ను చూసి బోరున విలపించారు. ఆయన త్వరగా కోలుకుని ఇంటికి చేరాలని ఆమె ఆకాంక్షించారు. -
నేను... స్వప్న... ప్రసాద్
ఇన్నాళ్లూ నేనేమిటో నాకు తెలియజెప్పడానికి చాలామంది ట్రై చేసినా ఈ మట్టిబుర్రకి అర్థం కాలేదు. కానీ... నిన్న ఓ చూపు చూసి, ఓ నిట్టూర్పు విడిచి ‘స్వప్న’అలా అనేసరికి ‘నేనేంటో’ తెలిసొచ్చింది! స్వప్న ఏం అన్నదో చెప్పాలంటే... ముందు ‘స్వప్న’ గురించి చెప్పాలి! స్వప్న గురించి చెప్పాలంటే, ‘ప్రసాద్’ గురించి చెప్పాలి! ప్రసాద్ గురించి చెప్పాలంటే, నా గురించి చెప్పాలి! నా గురించి చెప్పాలంటే ముప్ఫై ఏళ్లు వెనక్కి వెళ్లాలి. అవి తెలుగుతెరను నలుగురు అగ్రహీరోలు నాలుగు వైపుల నుంచి అప్రతిహతంగా ఏలుతున్న రోజులు! ఆ సమయంలో... అంతులేని కథ, మరో చరిత్ర, ఇది కథ కాదు, ఆకలి రాజ్యం అంటూ నాలుగు వైపుల నుంచి విరుచుకుపడ్డాడు బాలచందర్! సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య నలిగిపోతున్న ఆ సంధి కాలపు రోజుల్లో అప్పటి మా యువతకు పై సినిమాల ప్రభావాన్ని తట్టుకోవడం కష్టమైంది కానీ... ‘మరో చరిత్ర’ ప్రభావం నుంచి బయట పడటం దాదాపు అసాధ్యమైంది! అజ్ఞానం, ఆకలి, నిరుద్యోగం, నిస్సహాయతల మధ్య నలిగిపోతున్న సమాజానికి మా వంతుగా ఏదైనా చేయాలని, సమాజాన్ని సమూలంగా మార్చి ‘మరో చరిత్ర’ సృష్టించాలన్న కసితో మొదలుపెట్టాం ‘మరో చరిత్ర’ ట్యూషన్ సెంటర్లు! అప్పటికింకా విద్య వ్యాపారంగా అభివృద్ధి (?) చెందకపోవడంతో స్కూల్ ముగిసిన వెంటనే పిల్లలు ఇప్పట్లా రెసిడెన్షియల్ బోనుల్లో కాకుండా వీధుల్లో ఉండేవారు! సాయంత్రం అయ్యేసరికి పిల్లల కేరింతలతో వీధులు దద్దరిల్లిపోతుంటే, పెద్దలు పిల్లల్ని మురిపెంగా కోప్పడుతుండేవారు! ముందుగా పిల్లల్ని తద్వారా పెద్దల్ని సంస్కరించాలన్న తాపత్రయంతో మా యువత అంతా కలిసి సాయంత్రం అయిదు నుంచి ఎనిమిది గంటల వరకూ అన్ని తరగతుల వారికీ ఉచితంగా ట్యూషన్లు చెప్పేవాళ్లం! అప్పటికి ఇరవై, ఇరవై రెండు మధ్యనున్న నేను, మా యువతకు లీడర్ని! అప్పుడు మాతో కలిశాడు... ప్రసాద్! మా ఊరి పిల్ల జమీందార్! రాచరికం పోయి ప్రజాస్వామ్యానికి బాటలు పరిచిన మొదటి దశాబ్దానికి చివరి ప్రతినిధి అయిన ప్రసాద్, వెనకా ముందూ ఏమీ లేకపోయినా సమాజానికి ఏదో చేయాలని ప్రయత్నిస్తున్న మమ్మల్ని చూసి ఆకర్షితుడై, మాతో చేరి, వాళ్ల దివాణం అరుగుమీద ట్యూషన్లు చెప్పుకోమనడమే కాక, రోజూ మాకు కాఫీ, టిఫిన్లు కూడా ఏర్పాటు చేశాడు! వాడు మాత్రం పాఠాలు చెప్పడానికి ప్రయత్నించలేదు. ఇలా జరుగుతుండగా ఒకరోజు... ‘మా తమ్ముణ్ని కూడా ట్యూషన్లో చేర్చుకోండి’ అంటూ వచ్చింది స్వప్న! వెండితెరను చీల్చుకుని బయటకు వచ్చినట్లుగా... నా కలలలోంచి నేరుగా నడచి వచ్చినట్లుగా... ఆమె అసలు పేరు తెలియదు కానీ... ‘మరో చరిత్ర’ హీరోయిన్లా ఉండటంతో ఆ పేరే ఫిక్సయిపోయాన్నేను! చెప్పడం మరిచా! చిన్నప్పుడు బంతిలా ఉండేవాణ్నట. అందుకని నన్నందరూ ‘బాలూ’ అని పిలుస్తారు! స్వప్న... పద్దెనిమిదికి అటూ ఇటూగా వయసు... నేరేడు పండు నిగారింపుతో, నల్ల కలువను తెల్ల రేకులో చుట్టినట్లు, తెల్ల చీరలో నుదుట బొట్టు లేకుండా ఉంది! వాళ్ల నాన్న రైల్వేలో చిరుద్యోగట! తల్లి లేదు. ఆరుగురి పిల్లల్లో తనే పెద్ద. ట్రాన్స్ఫర్ నిమిత్తం ఈ ఊరు వచ్చారట. స్వప్నకు సంవత్సరం కిందటే పెళ్లయిందట! అయినా మూడు నెలలకే ‘అన్నీ’ అయిపోయాయట! ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్లుగా చెప్పిందే కానీ, జరిగినదానికి ఏమీ బాధ పడుతున్నట్లు లేదు. రోజూ తమ్ముడి వెంట వచ్చే స్వప్న, తనూ క్లాసులు తీసుకొనేది. పది వరకూ చదివిందట! ఆశయాల గురించి, ఆదర్శాల గురించి మాతో ధైర్యంగా చర్చిస్తుండేది! అప్పుడే నిర్ణయించుకున్నాను - పెళ్లంటూ చేసుకుంటే స్వప్ననే చేసుకోవాలని! కానీ నా ఆశ, ఆశయం అమలు కాకుండా పెళ్లికెదిగిన నా చెల్లెళ్లు! కులాంతరం. అందునా వితంతు వివాహం చేసుకుంటే, నా ఆశయం సిద్ధిస్తుంది కానీ, ఆ ప్రభావం నా చెల్లెళ్ల పెళ్లిళ్లపై పడుతుందని ధైర్యం చేయలేకపోయాను. కానీ స్వప్నకు న్యాయం జరగాలి. ఆమెకు కొత్త జీవితం రావాలి! ఎలా?! ఆలోచించాను... ఎస్. ప్రసాద్! ఆర్థికంగాను, సామాజికంగాను బలమైన కుటుంబం! మమ్మల్ని చూసి వాడూ ఆశయాలపై మోజు పెంచుకుంటున్నాడు. అందుకే ఓ శుభోదయాన వాణ్ని కలిసి - ‘‘స్వప్న గురించి నీ అభిప్రాయం ఏమిటి?’’ అంటే, ‘‘సదభిప్రాయమే’’ అన్నాడు ప్రశ్నార్థకంగా. ‘‘అయితే, స్వప్నను పెళ్లి చేసుకోవచ్చు కదా’’ అన్నాను. చిరాగ్గా మొహం పెట్టి, ‘‘అదేదో నువ్వే చేసుకోవచ్చు కదా’’ అన్నాడు పెడసరంగా! నేను నా బాధ్యతల గురించి చెప్పాను. దానికి వాడు నావైపొకసారి వింతగా చూసి, ‘‘ఆదర్శాలు పాటించడం అంటే వాటిని వల్లె వేయడం కాదు. ప్రతికూల పరిస్థితుల్లో ఎదురీదడం. పెళ్లిళ్ల పేరయ్య అవతారం ఎత్తి తనకుమాలిన ధర్మం భుజాన వేసుకోకు. అన్నట్లు నా మేనకోడలితో నా పెళ్లి నిశ్చయమైంది’’ అంటూ విసవిసా వెళ్లిపోయాడు! వెధవ! ఆస్తులు బయటకు పోకుండా కాపాడుకోవడానికి మేనరికం చేసుకుంటున్నాడు. ఆ సాయంత్రం స్వప్నతో ప్రసాద్గాడి నిర్వాకం గురించి చెప్పిన నాకు, స్వప్న ప్రతిస్పందన ఇంకా విచిత్రంగా అనిపించింది! ‘‘నా పెళ్లి విషయం నిన్నెవరు మాట్లాడమన్నారు బాలూ. అతను ఒప్పుకున్నా, నేనెలా ఒప్పుకుంటాననుకొన్నావ్?’’ ఇంచుమించు ప్రసాద్‌లానే ప్రతిస్పందించింది! తర్వాత ప్రసాద్గాడి పెళ్లయిపోయి, పెళ్లాం ద్వారా వచ్చిన ఆస్తులు చూసుకోవడానికి మద్రాసు వెళ్లిపోయాడు. ‘మరో చరిత్ర’ వేడి తగ్గిపోయింది. మా ట్యూషన్ సెంటర్ పలచబడింది. ఓ రోజు రాత్రి ఎనిమిదౌతుందనుకొంటా. వసారాలో కూర్చొని షార్ట్‌హ్యాండ్ ప్రాక్టీస్ చేస్తున్న నా దగ్గరకు వచ్చింది స్వప్న! వాళ్ల నాన్నకు ట్రాన్స్ఫర్ అయిందని, ఊరు వదిలి పోతున్నామని చెప్పింది. ఆ తర్వాత స్వప్న కనపడదు అన్న భావనకు గుండె బరువెక్కింది. ఇన్నాళ్లూ తన తమ్ముడికి ట్యూషన్ చెప్పినందుకు కృతజ్ఞతలు చెప్పి, వెళ్లబోతూ ఒక్కసారిగా వెనుదిరిగి, నా మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని, నా పెదాలను చుంబించి, వేగంగా వెళ్లిపోయింది. ఒక్కసారిగా నా మెదడు అచేతనమైంది! నా మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొన్నప్పుడు, ఎడం చేత్తో ఆమె నడుం పట్టుకొని, కుడి చేతిలోనికి ఆమె శిరస్సు తీసుకొని... చాలాసార్లు అనుకొన్నాను. ఏం చెయ్యను! నేను పెరిగిన వాతావరణం నా చేతులను కట్టేసింది. తర్వాత నాకు ఉద్యోగం రావడం, మా పెద్ద చెల్లి పెళ్లి, మా నాన్నగారు పోవడం, నేను పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. స్వప్న జాడ తెలియదు. ప్రసాద్గాడు తన ఆస్తులు చూసుకోవడానికి అప్పుడప్పుడూ వస్తుండేవాడు. అప్పుడే నా జీవితంలో ఊహించని దెబ్బ తగిలింది! నేను ఎంతో జాగ్రత్తగా పెంచిన మా మూడో చెల్లి ప్రేమ వివాహం చేసుకుని పోతే, నేను ఏరి కోరి చేసిన పెళ్లి కాదని, రెండో చెల్లి నా దగ్గరకు వచ్చేసింది. నా చెల్లికి చాలావిధాలుగా నచ్చజెప్పాను. ఆ అబ్బాయిని కూడా కలిశాను. ఇద్దరూ మొండి ఘటాలే. ఒక్కటే సమాధానం - ‘తమ అభిప్రాయాలు వేరట!’ ‘అయినా సర్దుకుపోవాలని’ నేనంటే, ‘‘మేమేం శత్రువులం కాదన్నయ్యా. మా మనసులు కలవలేదు. విడిగా ఉందామనుకొంటున్నాం. అయినా నీ దగ్గర ఉండనులే. సిటీలో జాబ్‌కి ట్రై చేస్తున్నాను. వస్తూ పోతాను’’ అంది. దాన్ని డిగ్రీ చదివించి ఎంత తప్పుచేశానో అర్థమైంది! ఈ దెబ్బ నుండి కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టింది నాకు. ఈసారి ఊహించని షాక్ మా ఆవిడ ఇచ్చింది! రోజులాగే ఆఫీస్ నుంచి వచ్చిన నాకు, ‘నేను మా ఇంటికి పోతున్నాను’ అన్న మా ఆవిడ లెటర్ చూసి ఒళ్లు జలదరించింది! నా అనుమతి లేనిదే గడప దాటడానికి సాహసించని నా భార్య... పిల్లాణ్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది! వెంటనే నేను వెళ్లేసరికి గుమ్మంలో కూర్చుని బాబుకి పాలు పడుతోంది. ‘‘ఏమిటీ పిచ్చి పని. పద.’’ ‘‘ఎక్కడికి?’’ అంది అర్థం కానట్లు! ‘‘ఎక్కడికేంటి? మనింటికి.’’ ‘‘ఇది నా ఇల్లే.’’ ‘‘నీకేవన్నా పిచ్చి పట్టిందా?’’ కోపాన్ని ఆపుకోవడం కష్టంగా ఉంది నాకు! ‘‘వదిలింది. అందుకే వచ్చేశాను’’ కూల్‌గా అంది. చాచిపెట్టి కొట్టాను. అంతే! ‘‘ఇది నా ఊరు. ఇక్కడంతా నా జనాలు. మీ మర్యాద దక్కాలంటే హద్దుల్లో ఉండటం మంచిది’’ అంది. ‘‘ప్లీజ్. నీకే ఇబ్బందీ రానివ్వను’’ ‘‘ఇబ్బందులున్నాయని అన్లేదే! మీతో ఉండటం ఇష్టం లేదు’’ స్థిరంగా అంది. ‘‘నాతో ఉండటం ఇష్టం లేనప్పుడు, నా కొడుకుని ఎందుకు తెచ్చుకున్నావ్?’’ ‘‘రేపు జడ్జిగారికి ఓ మాట చెప్పి...’’ రాక్షసి తెగించింది. ఆడది ఏ మాటకు విలవిల్లాడుతుందో ఆ బాణం వదిలాను. ‘‘అంతగా రానంటున్నావ్. ఇక్కడ ఎవణ్నయినా మరిగావా?’’ ఆ మాటకు ఒక్కసారిగా రోషంతో ముక్కుపుటాలెగరేస్తూ నావైపు చూసి, ‘‘అవును. ఇన్నాళ్లకు నాకో మగాడు దొరికాడు’’ పిల్లాణ్ని చంక మార్చుకుంటూ అని మొహం మీదే తలుపు వేసేసింది! * చూస్తుండగానే కాలం ఇంకొన్ని సంవత్సరాలు మింగేసింది! ఓ రోజు ప్రసాద్ ఓ వంద మంది పిల్లల్ని తీసుకుని వేసవి సెలవుల నిమిత్తం మా ఊరు వచ్చాడు. ఏదో ట్రస్ట్ కూడా పెట్టాడట. ట్యాక్స్ ఎగవేత కోసమేమో! విషయం ఏంటో తెలుసుకుందామని వాడింటికి వెళ్లాను. వాడు, వాడి భార్య సాదరంగా ఆహ్వానించారు. వృద్ధాశ్రమం కూడా ఉందట. భోజనాల సమయం కావడంతో వాడి భార్య మా ఇద్దరికీ వడ్డిస్తుంటే, ప్రసాద్ ఆమెతో ‘‘తిన్నాడా?’’ అని అడిగాడు ఎవర్నో ఉద్దేశించి! ‘లేదంటూ’ లోపలికి వెళ్లి, ఓ ఐదేళ్ల పసివాణ్ని తీసుకొచ్చింది. అన్నం తినకుండా అలిగాడట. గిటార్ కొనాలట! వచ్చిన విజిటర్స్ నుంచి డొనేషన్లు వసూలు చేయడానికి ఇదో పద్ధతేమో! ప్రసాద్ ఆ పసివాణ్ని బుజ్జగిస్తూ, ‘‘నువ్వు చిన్నపిల్లాడివి కదా. పెద్దయ్యాక కొంటాను. అన్నం తిను’’ అన్నాడు. విననట్లు తల తిప్పేశాడు పిల్లాడు. బంగారు రంగులో బాలకృష్ణునిలా ఉన్న పసివాణ్ని చూస్తే ముచ్చటేసింది. ‘‘నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తే, గిటార్ కొనిస్తాను’’ అన్నాను. వాడు నావైపు చూసి, ‘‘మా క్లాస్‌కి నేనే ఫస్ట్’’ అన్నాడు కొంచెం గర్వంగా! ఆ మాటకు ప్రసాద్ నవ్వుతూ, ‘‘సర్లే. రేపు కొంటాను. అన్నం తిను’’ అన్నాడు. మెరుస్తున్న కళ్లతో పిల్లాడు ప్రసాద్‌ను చూస్తూ, ‘ప్రామిస్’ అని చెయ్యి చాపాడు. ‘‘ఆ డబ్బు నేనిస్తాను’’ అన్నాను పిల్లాడి చేతిలో చెయ్యి వేసి! ‘‘తీసుకెళ్లి అన్నం పెట్టు’’ అంటూ పిల్లాణ్ని ఆయాకు అప్పగించాడు ప్రసాద్! ఆ పసివాణ్ని చూసిన తన్మయత్వంలో నేను, ప్రసాద్‌ను ‘‘నీకెంతమంది పిల్లలు?’’ అని అడిగాను. దానికి వాడు చిన్నగా నవ్వుతూ, ‘‘పిల్లలు వద్దనుకొన్నాం బాలూ. మొదటి నుంచీ మా ఇద్దరికీ సమాజానికి ఏదైనా చేయాలనే తపన ఉండేది. మేం ప్రేమించుకోవడానికి అదో కారణం. అందుకే పెళ్లయిన వెంటనే కుటుంబ నియంత్రణ చేయించుకొన్నాం’’ అన్నాడు. నాకు షాకింగ్‌గా ఉంది. నా అంచనా తప్పుతోంది! ‘‘పిల్లలు లేకపోవడం ఏమిటి? డజను మంది మనవలు కూడా ఉన్నారు. నా పిల్లలు ఇప్పుడు విదేశాల్లో కూడా ఉన్నారు తెలుసా?’’ మొహంలో ఆనందం తొణికిసలాడుతుండగా చెప్తోంది ప్రసాద్ భార్య! భోజనాల తర్వాత, నేను గిటార్ డబ్బుకు చెక్కు ఇవ్వబోతుంటే, ‘‘డొనేషన్లు తీసుకోం బాలూ. కేవలం మా ఆస్తులతోనే వీటిని రన్ చేయాలనుకున్నాం’’ గర్వంగా చెబుతున్న వాడి కళ్లలో ఏదో చైతన్యం! మాటల సందర్భంలో స్వప్న కనిపించిందని, రైల్వేలో జాబు చేస్తోందని చెప్పాడు. నా గుండె గొంతులోకి వచ్చినట్లయింది! ‘‘పెళ్లయిందా?’’ ఆతృతగా అడిగితే, ‘‘తెలీదు’’ అన్నాడు ఆ విషయానికి అంత ప్రాముఖ్యం లేనట్లు! నాకు వెంటనే స్వప్నను చూడాలని ఉంది. వాడి దగ్గర అడ్రెస్ తీసుకుని వెతుక్కుంటూ వెళ్లాను. స్వప్నే తలుపు తీసింది. మనిషి ఏం మారలేదు కానీ, తల కొంచెం నెరసి హుందాగా ఉంది. ఆశ్చర్యంతో రిసీవ్ చేసుకుంది! తండ్రి పోయిన తర్వాత ఆ ఉద్యోగం ఆమెకు ఇచ్చారట. చెల్లెళ్లని, తమ్ముళ్లని చదివించి, అందరికీ పెళ్లిళ్లు చేసిందట. ప్రస్తుతం ఇక్కడే ఒంటరిగా ఉంటోందట! జీవన సాగరాన్ని ఈదిన పరిణతి ఆమె మొహంలో ప్రతిఫలిస్తోంది. ‘‘పెళ్లి చేసుకోలేదేం?’’ అని అడిగితే, ‘‘ఆ ఊహే రాలేదు... ఈ పనులలో పడి’’ అంది నవ్వుతూ. నా గురించి పూర్తిగా చెప్పి, ‘‘మనం పెళ్లి చేసుకుందామా?’’ అడిగాను. నా కళ్లలోకి చూసి నవ్వుతూ, ‘‘నువ్వేం మారలేదు బాలూ’’ అంది. ‘‘అది కాదు. అప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని గ్రహించలేకపోయాను.’’ ‘‘నువ్వింకా అక్కడే ఉన్నావా బాలూ? తలచుకొంటే ఇప్పుడు సిల్లీగా ఉంటోంది. ఇంత జీవితం గడిపాక, వెనక్కి చూసుకుంటే ఆ భావాలు, ప్రేమలు, పెళ్లిళ్లు... ఎంత అల్ప విషయాలో తెలుస్తోంది.’’ ఆడదై ఉండి ఒంటరి జీవితం గడుపుతున్న స్వప్నను చూసి, నేనెందుకు ఒంటరిగా ఉండలేను అనిపించి వచ్చేశాను. అలా ఒంటరితనానికి అలవాటుపడిన నా దగ్గరకు ఓ రోజు మా రెండో చెల్లి వచ్చింది. మాటల సందర్భంలో, ‘‘మొన్న ఆఫీస్ నుండి వస్తుంటే, వదిన కనిపించింది. ఇంటికి తీసుకెళ్లి టీ పెట్టి ఇచ్చింది’’ అంది. నాకు చాలా కోపం వచ్చింది. ‘‘అది ఇంటికి పిలిస్తే వెళతావా? తను నన్ను కాదని పోయింది తెలుసా?’’ ‘‘మీ ఇద్దరికీ పొసగలేదు. విడిపోయారు. మధ్యలో మాకు శతృత్వం ఏమిటి? అయినా మా విడాకుల విషయంలోనూ నువ్వు ఇలానే స్పందించావ్. ప్రతి ఒక్కరినీ నీ కోణంలోంచి చూడటం మానుకో అన్నయ్యా’’ అంది. నా కళ్ల ముందు పుట్టిన పిల్ల నాకు తత్వం బోధిస్తుంటే, బాధగా అనిపించింది. ఓ విధమైన విరక్తితో మిగిలిన జీవితాన్నైనా ప్రశాంతంగా గడుపుదామని ప్రసాద్ ఆశ్రమంలో చేరడానికి వెళ్లాను. నన్ను రిసీవ్ చేసుకొన్న ఆయా - ‘‘సార్ ఢిల్లీ వెళ్లారు. మేడమ్‌ను పిలుస్తాను కూర్చోండి’’ అని లోపలికి వెళ్లింది. గోడకి ఉన్న మదర్ థెరిస్సా ఫొటో చూస్తూ కూర్చున్నాను. కర్టెన్ తొలగించుకుంటూ కాళ్లకి మెట్టెలు, మెళ్లో సూత్రాలతో నిండు ముత్తయిదువలా గదిలోకి ప్రవేశించింది... స్వప్న! ఒక్కసారిగా షాకయ్యాను. ‘‘చెప్పండి’’ అంటూ నన్ను చూసి ఆశ్చర్యపోయి, ‘‘ఏంటి ఇలా వచ్చావ్?’’ అంది ప్రసాద్ కూర్చునే సీట్లో కూర్చుంటూ. గోడకి ఉన్న మదర్ థెరిస్సా ఫొటో చూస్తూ కూర్చున్నాను. కర్టెన్ తొలగించుకుంటూ కాళ్లకి మెట్టెలు, మెళ్లో సూత్రాలతో నిండు ముత్తయిదువలా గదిలోకి ప్రవేశించింది... స్వప్న! ఒక్కసారిగా షాకయ్యాను. ‘‘నువ్వేంటి ఇక్కడ?’’ నా గొంతు పొడిబారుతోంది. ‘‘ప్రసాద్‌ని పెళ్లి చేసుకున్నాను.’’ బాంబ్ పేలినట్లుగా వినబడింది నాకు! ‘‘నెలరోజుల కిందట ప్రసాద్ భార్య చనిపోయింది. చాలా రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. అంతిమ సంస్కారాలు చేయవద్దనీ, తన శరీరాన్ని ఏదైనా హాస్పిటల్‌కు దానం చేయమనీ ఆమె కోరడంతో ఎవరికీ చెప్పలేదు.’’ ‘‘మరి ప్రసాద్ నిన్ను చేసుకోవడమేంటి?’’ ‘‘ప్రసాద్ నన్ను చేసుకోలేదు. నేనే ప్రసాద్‌ని చేసుకున్నాను.’’ రెంటికీ తేడా అర్థం కాని నేను, ‘‘నీకు పెళ్లి ఇష్టం లేదనీ, అది చాలా స్వల్ప విషయం అన్నావ్’’ అన్నాను. అందుకామె నావైపు నిర్లిప్తంగా చూస్తూ, ఓ నిట్టూర్పు విడిచి, ‘‘నువ్వు మారవు బాలూ’’ అంది. జీవితంలో మొదటిసారి నాకు, నా గురించి తెలిసింది! - . దొడ్డిగల్లు నారాయణరావు -
సినీచంద్రుడు...
-
కమల్ తదుపరి సినిమాలో బాలచందర్
ఒకాయన మెగాఫోన్ పట్టుకున్నారంటే.. తిరుగులేదు బ్రహ్మాండమైన హిట్లే. మరొకాయన నటిస్తున్నారంటే అదో అద్భుత చిత్రరాజం అన్నట్లే. అలాంటి వాళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే... ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు కదూ. అవును, అద్భుత చిత్రాల సృష్టికర్త కె.బాలచందర్‌తో కలిసి నవరస నటనా సార్వభౌముడు కమల్ హాసన్ నటించబోతున్నాడు. విశ్వరూపం-2 విడుదలైన తర్వాత షూటింగ్ చేసుకోబోయే తమిళ కామెడీ చిత్రం 'ఉత్తమ విలన్'లో ప్రముఖ దర్శకుడు బాలచందర్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నారు. కమల్ కెరీర్‌ను తీర్చిదిద్దిన బాలచందర్, 1973 నుంచి దాదాపు 30 సినిమాలు ఆయనతో తీశారు. అలాంటిది కమల్‌తో కలిసి నటించడం కోసం ఆయన గెడ్డం కూడా పెంచుతున్నారు. కమల్ వ్యక్తిగతంగా కోరడంతోనే ఈ ప్రాజెక్టు చేయడానికి ఆయన అంగీకరించారు. ఆయన నిజజీవిత పాత్రకు ఆ సినిమాలో పాత్ర చాలా దగ్గరగా ఉంటుందట. 'ఉత్తమ విలన్' సినిమాకు కమల్ స్నేహితుడు, బాలచందర్ శిష్యుడైన రమేష్ అరవింద్ దర్శకత్వం వహించబోతున్నారు. వయసు మీరిపోతున్న ఓ సూపర్‌స్టార్ పాత్రలో కమల్ ఆ చిత్రంలో నటిస్తారు. క్రేజీ మోహన్ ఈ చిత్రానికి డైలాగులు రాస్తారు. గతంలో కమల్ నటించిన మైఖేల్ మదన కామరాజు, విచిత్ర సోదరులు, భామనే సత్యభామనే, పంచతంత్రం లాంటి కామెడీ హిట్ సినిమాలకు క్రేజీ మోహనే సంభాషణలు అందించారు. -
ఐదు నిమిషాల్లో కథ చెప్పమన్నారు...:గీతాకృష్ణ
తొలియత్నం అతడు పదం. ఆమె పాదం. అతడు గానం. ఆమె ప్రాణం. అతడు పాటై ఎగిసినప్పుడు ఆ కెరటాలకు ఆమె అందెల. ఆమె నాట్యానికి అతని పదం ఆది తాళం. సముద్రం దిగంతమై, కళ అనంతమైనప్పుడు కళకు ఆమె చేసే నివేదన నాట్యం. ప్రకృతికి అతడి అభిషేకం కవిత్వం. ఇద్దరు కళాకారుల ఆధ్యాత్మిక ప్రేమకు దృశ్యకవి గీతాకృష్ణ వెండితెరపై చేసిన కళార్చన ఈ సంకీర్తన. అసిస్టెంట్‌గా అంటూ చేస్తే బాలచందర్, బాపు, విశ్వనాథ్ వీళ్ల దగ్గరే చేయాలి. లేకపోతే పూణె ఫిలిం ఇన్స్టిట్యూట్. ఇదీ లెక్క. బాలచందర్‌గారిని కలిస్తే నేనిప్పుడే తమిళ్ సినిమా చేస్తున్నాను. తెలుగు సినిమా చేసినప్పుడు తప్పక తీసుకుంటాను. నెక్స్ట్ బాపుగారు. నేనిప్పుడు హిందీ సినిమా చేస్తున్నాను, తెలుగు సినిమా చేసినప్పుడు కలువు. ఇక మిగిలింది విశ్వనాథ్‌గారు. నాకు బాగా తెలిసిన కె.వాసు (ప్రాణం ఖరీదు, కోతలరాయుడు వంటి హిట్ చిత్రాల దర్శకుడు)గారి ద్వారా విశ్వనాథ్‌గారిని కలిశాను. అప్పట్లో అది కాన్ఫిడెన్సో, యారగెన్సో తెలియదు. నేను మీ దగ్గర మూడు సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేస్తాను. ఆ తరువాత డెరైక్ట్‌గా సినిమా డెరైక్షన్ చేస్తానన్నాను. విశ్వనాథ్‌గారు సరేనన్నారు. ‘సాగరసంగమం’ ఆయనతో అసోసియేషన్ ప్రారంభమైంది. ఆ సినిమా చేస్తున్నప్పుడు రష్యాలో ఒక ఫిలిం ఫెస్టివల్లో విశ్వనాథ్‌గారి రెట్రాస్పెక్టివ్ కోసం అక్కడి నుంచి ఒక టీమ్ వచ్చింది. వాళ్లకు విశ్వనాథ్‌గారి సినిమాలు చూపిస్తూ, వాటి థీమ్‌ను వివరించడం నా పని. చెన్నయ్‌లో ఆండాళ్ ప్రొడక్షన్స్ అధినేత రామ అరంగణళ్కు సంబంధించిన ఆండాళ్ థియేటర్ బుక్ చేశాం. వాళ్లకు ఒక్కో సినిమా చూపిస్తూ, ప్రతి రెండు రీళ్లకు ఒకసారి సినిమా ఆపి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఇదంతా గమనించిన అక్కడి మేనేజర్ కృష్ణమూర్తి నా గురించి అరంగణళ్గారికి చెప్పారు. ఇది గడిచిన కొంతకాలానికి వాళ్ల నుంచి నాకు ఫోన్ వచ్చింది. సినిమా చేస్తావా అని అడిగారు. ఎందుకు చేయను, అందుకోసమే కదా వచ్చింది అన్నాను. రామ్ అరంగణళ్గారిని కలవగానే నా చేతిలో ఫైల్స్ చూసి ఏంటివన్నీ అని అడిగారు. నేను తయారుచేసుకున్న సబ్జెక్ట్స్ అన్నా. మొదట అవన్నీ పక్కన పెట్టు అన్నారు. మొదట నువ్వు చెప్పాలనుకున్న కథ అయిదు నిమిషాల్లో చెప్పడం నేర్చుకో. అందుకు కావాలంటే ఇంకో అయిదు నెలలు తీసుకో. ఎందుకంటే నువ్వు చెప్పాలనుకున్న కథ అయిదు నిమిషాలకు మించి చెపితే అవతలివాళ్లకు నిద్ర వచ్చే ప్రమాదముంది. అయిదు నిమిషాల కథను తెరమీద మూడు గంటల్లో చెప్పడం తరువాత పని అన్నారు. అయితే నాకు ఒక గంట టైమ్ కావాలని అడిగాను. సరేనని నాకో గది కేటాయించారు. గంట తరువాత కలిసి పది నిమిషాల్లో రెండు కథలు వినిపించాను. నీ వయసుకు మించిన కథలు చెప్పావని మెచ్చుకున్నారు. అందులో ఒక కథలో ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ల మధ్యకు మరో చిన్న బాబు రావడమనే కథ ఆయనకు చాలా నచ్చింది. అయితే అది మ్యాన్ ఉమన్ అండ్ ఏ ఛైల్డ్ అనే నవల నుంచి తీసుకున్నానని, అది హాలీవుడ్లో క్రామర్ వర్సెస్ క్రామర్ అనే సినిమాగా వచ్చిందని చెప్పాను. దాని ఆధారంగా శేఖర్‌కపూర్ మాసూమ్, బాలూమహేంద్ర మలయాళంలో ఓలంగళ్ తీశారని చెప్పాను. అయినా మనం చేద్దామన్నారాయన. నేను విశ్వనాథ దగ్గర మూడు సినిమాలు చేస్తానని మా అన్నకు మాట ఇచ్చాను కాబట్టి, ఇప్పుడు సినిమా చేయలేనన్నాను. కానీ నాకిదో గొప్ప అనుభవమని చెప్పి వచ్చేశాను. ‘సాగరసంగమం’, ‘స్వాతిముత్యం’ చేస్తున్నప్పుడు కమలహాసన్, నేను చాలా విషయాలు చర్చించుకునేవాళ్లం. ‘స్వాతిముత్యం’ మధ్యలో ఉన్నప్పుడు మా ఊరి పక్కన కడియానికి చెందిన గిరిజాల కృష్ణారావు, డాక్టర్ గంగయ్యను పరిచయం చేశారు. ఆయన సినిమా చేద్దాం కధ చెప్పమనగానే రెండు కథలు వినిపించాను. మన్మథ పూజారి, సంకీర్తన కథల్లో రెండవది ఆయనకు బాగా నచ్చింది. విశ్వనాథ్‌గారికి చెబితే సరే అన్నారు. తరువాత ‘స్వాతిముత్యం’ శత దినోత్సవానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆ వేదిక మీదే విశ్వనాథ్‌గారి శిష్యుడు, దర్శకుడు కాబోతున్నారని ప్రకటించారు. హీరో కాశీ పాత్ర కోసం వెతుకుతున్నప్పుడు అనుకోకుండా సచిత్ర వారపత్రికలో కవర్‌పేజీలో ఒక యువకుడి ఫొటో చూశాను. కింద అక్కినేని వారసుడు నాగార్జున హీరోగా ఆరంగేట్రం చేయబోతున్నాడని వార్త. అది పట్టుకెళ్లి కమలహాసన్‌కు చూపించాను. ఎవరితను అని అడిగాడు. నాగేశ్వరరావుగారి అబ్బాయి అనగానే బావున్నాడన్నారు. తరువాత నాగేశ్వరరావుగారిని కలిసి కథ చెప్పాను. పొయెటిక్‌గా ఉంది, కొంచెం దృష్టి పెడితే చాలా బాగా వస్తుందన్నారాయన. అప్పటికే నాగేశ్వరరావుగారి నిర్మాతలు నాగార్జునతో సినిమాలు వరుసగా ప్రకటిస్తున్నారు. అన్నపూర్ణ బ్యానర్లో విక్రమ్ మొదలైంది. విక్రమ్ ఒక షెడ్యూల్ అయ్యాక, సంకీర్తన మొదలైంది. హీరోయిన్ కీర్తన పాత్ర కోసం చాలామందిని చూశాం. శోభన ,అమల ఇంకా చాలా మందిని అనుకున్నా రకరకాల కారణాల వల్ల కుదరలేదు. అదే సమయంలో ముఖ్యమంత్రి రామారావుగారి ప్రోత్సాహంతో హైదరాబాద్‌లో ఫిల్మోత్సవ్ జరుగుతోంది. అందులో ప్రారంభోత్సవ నృత్యానికి నేను వెళ్లాను. స్టేజ్ మీద ఒక యాభై మంది డ్యాన్సర్స్ ఉన్నారు. అందులో ఒకమ్మాయి నన్ను ఆకర్షించింది. కార్యక్రమ నిర్వాహకురాలు రాజసులోచనగారిని కలిస్తే తన పేరు రమ్యకృష్ణ అని చెప్పింది. అడ్రెస్ తీసుకుని ఫొటో షూట్ చేసి తనను ఎంపిక చేసుకున్నాం. తను అంతకుముందు ఒక సినిమాలో ఏదో చిన్న పాత్ర చేసినా, పూర్తి స్థాయిలో హీరోయిన్గా తనకిదే మొదటి సినిమా. మిగతా ముఖ్యపాత్రల్లో గిరీష్ కర్నాడ్, సోమయాజులును తీసుకున్నాం. నిజానికి కథ రాజమండ్రి దగ్గర ఒక చిన్న పల్లెటూళ్లో జరుగుతుంది. కానీ రాజమండ్రి, పోలవరం, పట్టెసీమ, దేవీపట్నం ఇలా చాలా ప్రాంతాల్లో చిత్రించాం. గడప లోపల ఒక ఊరు, గడప దాటితే మరో ఊరు. ఇలా చాలా ప్రాంతాల్లో షూటింగ్ జరిపాం. ఇందులో హీరో, హీరోయిన్ మొదటిసారి కలిసినప్పుడు తీసిన సీన్ కోసం మాత్రం చాలా శ్రమపడ్డాం. ఉదయం పూట కీర్తన నదికి నీళ్లకోసం వచ్చినప్పుడు కాశీ పడవలో పడుకుని ఉంటాడు. అందెల శబ్దం విని లేచి మొదట ఆకాశంలో పక్షులను చూస్తాడు. తరువాత కీర్తనను చూస్తాడు. అలవోకగా ఒక కవిత చెబుతాడు. ఈ సీన్లో పక్షులు, నది, అవసరమైన క్లోజప్స్, ఇంటర్‌కట్స్ తీసిన తరువాత కీర్తన సజెషన్లో కాశీ, అతడి సజెషన్లో కీర్తన షాట్స్, వాళ్లిద్దరి వైడ్ షాట్స్ తీయాలి. అందుకు స్థానికంగా ఉన్న జాలరిని పిలిచి, బోట్ ఏ యాంగిల్లో ఉంచాలని చెబుతున్నప్పుడు అర్థం కాక, అతను కొంత అసహనం వ్యక్తం చేశాడు. దాంతో ఆర్టిస్టులు కూడా అసౌకర్యానికి గురయ్యారు. దాంతో ఆ సీన్ వాయిదా వేశాం. షూటింగ్ పూర్తయ్యేలోపు ఆ సీన్ తీయాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏదో ఒక అవాంతరం వచ్చేది. చివరికి మద్రాస్ దగ్గర ఎన్నూర్ టూరిస్ట్ ప్లేస్‌లో బ్యాక్‌వాటర్‌లో ఈ సీన్ తీశాం. అది పూర్తయ్యేసరికి ఇంకో సినిమా తీసినంత పనయింది. ఇలా ఎన్నో చోట్ల షూటింగ్ చేసినా అంతా ఒకే దగ్గర తీసినట్టు అనిపించడానికి కారణం, స్క్రిప్ట్ దశలోనే ఎడిటింగ్ మీద అవగాహన ఉండటం. ఈ సినిమాకు ముఖ్యంగా చెప్పుకోవలసింది ఇళయరాజా సంగీతం గురించి. తను ఒకరోజు పదిహేను ట్యూన్స్ ఇచ్చాడు. నాకు మరీ అంత సంప్రదాయకంగా కాదు, సెమీ క్లాసికల్ కావాలన్నాను. తరువాత తను ముప్ఫై తొమ్మిది ట్యూన్స్ ఇచ్చాడు. అందులోంచి తొమ్మిది సెలక్ట్ చేసుకుని, ఆత్రేయ, సి.నారాయణరెడ్డి, వేటూరితో పాటలు రాయించాను. తనికెళ్ల భరణి కథను అర్థం చేసుకుని అందుకు తగినట్టుగా మాటలు రాశారు. సినిమా చూసిన నాగేశ్వరరావుగారు చాలా బాగా తీశావు కానీ, ఈ సినిమా ప్రేక్షకులు నచ్చకపోతే మళ్లీ భవిష్యత్తులో మంచి సినిమాలు తీసే ప్రయత్నం చేయకు అన్నారు. సినిమా చూసిన సెన్సార్‌వాళ్లు టైటిల్స్ చూడకపోతే, ఇది విశ్వనాథ సినిమా అనుకోవచ్చు అన్నారు. నేనది కాంప్లిమెంట్‌లా ఫీలయ్యాను. కొన్ని రోజులు ఆ ఆనందంలో తేలియాడాను. ఒకరోజు ఇళయరాజాగారు నాతో నువ్వు, వంశీ విశ్వనాథ్‌లా తీస్తారన్న పేరు తెచ్చుకుంటే ఏం ఉపయోగం. నీదైన మార్క్ కోసం ప్రయత్నించు అన్నారు. ఆ మాట నాపై తీవ్ర ప్రభావం చూపించి, నా సినిమా శైలిని, ఆలోచనా విధానాన్నీ మార్చేసింది. సినిమాలో పాట అనేది సంభాషణలా ఉండాలనేది నా ఫీలింగ్. అదే పద్ధతిలో సంకీర్తన పాటల రూపకల్పన జరిగింది. ఈ సినిమాలో ప్రతి మాటా ఒక చిన్న పాటలా కవితాత్మకంగా ఉంటుంది. - కె.క్రాంతికుమార్‌రెడ్డి -
మైండ్ బ్లోయింగ్..!
వారం క్రితం తనికెళ్ల భరణికి చెన్నై నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘‘నేను బాలచందర్ని మాట్లాడుతున్నా’’ అనగానే, ఇటు భరణి షాక్. ‘‘మీరు డెరైక్ట్ చేసిన ‘మిథునం’ సినిమాని కొంత యూట్యూబ్‌లో చూశాను. చాలా బాగా డెరైక్ట్ చేశారు. ఫుల్ క్వాలిటీతో సినిమా చూడాలని ఉంది’’ అనడిగారు బాలచందర్. వెంటనే భరణి ఆయనకు డీవీడీ పంపించేశారు. అది చూశాక బాలచందర్ మళ్లీ భరణికి ఫోన్ చేసి ‘మైండ్ బ్లోయింగ్ మూవీ’ అని అభినందించారు. అలాగే ‘మిథునం’లో హీరోగా చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ప్రత్యేకంగా ఓ ఉత్తరం రాశారు. ‘‘120 నిమిషాల వీడియో పొయిట్రీలా ఉంది. వెయిటింగ్ ఫర్ ది నేషనల్ అవార్డ్’’ అని ఆ లేఖలో వ్యాఖ్యానించారు. శనివారం ‘మిథునం’ చిత్రాన్ని చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా చెన్నై వెళ్లిన భరణి, ప్రత్యేకంగా బాలచందర్ ఇంటికి వెళ్లి కలిశారు. ‘‘బాలచందర్‌గారు నాలాంటి వారెందరికో అభిమాన దర్శకుడు. అంతటి గొప్ప వ్యక్తి ప్రశంసలు పొందినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని భరణి సంతోషం వెలిబుచ్చారు. -
తొలియత్నం: ఈ సినిమాకి స్క్రీన్‌ప్లేనే బలం!
‘షో’... చిన్న సినిమానా, పెద్ద సినిమానా? ఆర్ట్ సినిమానా, కమర్షియల్ సినిమానా? రొటీన్ సినిమానా, డిఫరెంట్ సినిమానా? ఏదైతేనేం... థియేటర్ల నుంచి ఫిలిం ఫెస్టివల్స్ దాకా ప్రశంసలు అందుకుంది. నేషనల్ అవార్డునూ గెలుచుకుంది. నీలకంఠ లాంటి ఓ అద్భుతమైన దర్శకుడుని సినీ ప్రపంచానికి పరిచయం చేసిన ఆ ‘షో’ తాలూకు వెలుగు నీడలివి... నేను డెరైక్టర్ కావడానికి ప్రేరణ బాలచందర్‌గారు. ఆయన తన సినిమాల్లోని పాత్రల తాలూకు అంతరంగాన్ని అద్భుతంగా చిత్రిస్తారు. నేనూ ఆయనలానే సినిమాలు తీయాలన్న ఉద్దేశంతో చిత్రరంగంలోకి అడుగుపెట్టాను. మరోవైపు సత్యజిత్ రే, బసు ఛటర్జీ, హృషికేశ్ ముఖర్జీ, శ్యామ్ బెనగళ్, బిమల్రాయ్ల సినిమాలు... దర్శకత్వం పట్ల నా అవగాహనను మరింత మెరుగుపరిచాయి. కళాత్మక విలువలతో నిండిన బాపు, విశ్వనాథ్, బాలచందర్ సినిమాలు కమర్షియల్‌గా కూడా పెద్ద సక్సెస్ అయ్యాయి. కానీ ప్రేక్షకులు మాత్రం సినిమాలను ఆర్ట్, కమర్షియల్ సినిమాలుగా ఎందుకు విడదీసి చూస్తారో అని ఆశ్చర్యపోయేవాడిని. ఇలాంటి ఆలోచనలతో సినిమా రంగంలోకి ప్రవేశించి కొన్ని సినిమాలకు అసిస్టెంట్‌గా పనిచేశాను. ఆ తర్వాత సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి నిర్మాతగా నేనే సినిమాలు తీయాలనుకున్నాను. మొదట కృష్ణగారు హీరోగా భారతీరాజాతో ‘జమదగ్ని’ సినిమాను నిర్మించాను. కానీ ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. నిర్మాతగా నన్ను నిరుత్సాహపరిచిన ఆ సినిమా... నిర్మాణాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు మాత్రం సహకరించింది. కొంత గ్యాప్ తరువాత తమిళంలో రేవతి హీరోయిన్గా ప్రియాంక సినిమాకు దర్శకత్వం వహించాను. హిందీ దామినికి రీమేక్‌గా తీసిన ప్రియాంక ఒక మాదిరిగా నడిచింది. కానీ రేవతికి ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డ్ దక్కింది. తరువాత చాలామంది దాన్ని రీమేక్ చేయమని అడిగారు. కానీ రీమేక్ సినిమా డెరైక్టర్‌గా మిగిలిపోవడం నాకిష్టం లేదు. దాంతో చేయలేదు. అలా అన్ని అవకాశాలనూ కాదనుకున్నందుకు దాదాపు ఏడేళ్ల గ్యాప్ వచ్చింది. ఈసారి తెలుగులో నా అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నాను. నాదైన సొంత కథతో, విభిన్నంగా, వినూత్నంగా ఉండాలని ముందే నిర్ణయించుకున్నాను. అలా ఆలోచిస్తున్నప్పుడు ఒక సందర్భంలో పరమహంస యోగానంద ఆత్మకథ చదివాను. అందులో ఆయన లైఫ్ ఈజ్ ఎ డ్రామా అనే విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. అది చదివి చాలా ఉత్సుకతకు లోనయ్యాను. ఆయన ఆలోచనల నుంచి ఒక రకమైన స్ఫూర్తి పొందాను. ఆ తరువాత సినిమా కథ గురించి ఆలోచిస్తున్న క్రమంలో కేవలం రెండు పాత్రలతో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాను. ఒకరోజు మంజులను కలిసినప్పుడు తను ఒక లో-బడ్జెట్ సినిమా చేయాలనుకుంటున్నానని చెప్పారు. అప్పటికే ఆవిడ టీవీ సీరియల్స్ ప్రొడక్షన్లో ఉన్నారు. ‘షో’ ఐడియా చెప్పగానే తనకు బాగా నచ్చి, సినిమా చేద్దామని ముందుకొచ్చింది. అప్పుడు స్క్రిప్ట్ మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించాను. కథ మొదట ఒక మర్డర్ మిస్టరీలా, థ్రిల్లర్ మాదిరిగా తయారైంది. దానివల్ల కొన్ని లిమిటేషన్స్ ఏర్పడ్డాయి. అప్పుడు నాకది రెగ్యులర్ ఫిలిమ్‌లా అనిపించింది. తరువాత కథను సోషల్ డ్రామాలా మార్చాను. దానివల్ల పాత్రలకు ఒక బ్యాక్‌గ్రౌండ్ వచ్చింది. స్క్రిప్ట్‌లో చాలా లేయర్స్ కనిపించేట్టు జాగ్రత్త తీసుకున్నాను. ఈ స్క్రిప్ట్ ప్రత్యేకత ఏమిటంటే... సినిమాని, రంగస్థలాన్ని ఒకే దగ్గరకు తీసుకురావడం. ఈ ప్రక్రియ నాకు తెలిసి అంతవరకూ ఎక్కడా లేదు. కథ విన్న ఒకరిద్దరు మిత్రులు రెండు పాత్రలతో సినిమా అంటే ఇరవై నిమిషాల తరువాత బోర్ కొడుతుంది అన్నారు. నేను రెండు గంటల సేపు బోర్ కొట్టకుండా తీయగలనని, అదొక ఎమోషనల్ ట్రావెల్లా ఉంటుందని చెప్పాను. తరువాత అధ్యాయం ఆర్టిస్టుల అన్వేషణ. స్క్రిప్ట్‌కు న్యాయం జరగాలంటే దానికి తగిన ఆర్టిస్టులు దొరకాలి. అప్పుడే మన స్వప్నం నిజమవుతుంది. మంజులకు కథ చెబుతున్నప్పుడు రిధిమ పాత్రకు తను హండ్రెడ్ పర్సంట్ ఫిట్ అవుతుందనిపించింది. మాధవ్ పాత్రకు కొత్త ముఖాన్ని తీసుకోవాలని ఆలోచించాను. ఆ క్రమంలో సూర్య నటించిన ఒక సినిమా చూసి తనే ఆ పాత్రకు న్యాయం చేయగలడనిపించింది. ఎందుకంటే మాధవ్ పాత్ర మొదట మంచి మనిషిగా, తరువాత ఒక సైకోగా, అటు నుంచి ఒక ఫ్రస్ట్రేటెడ్ మ్యాన్‌గా... మూడు షేడ్స్‌లో కనిపించాలి. అలాంటి విభిన్నమైన పాత్రకు పర్ఫార్మెన్స్తో పాటు లుక్ కూడా ఉండాలి. విచిత్రమేమిటంటే ఈ సినిమాకు నేననుకున్న ప్రతిదీ ఏదో అదృశ్య శక్తి సమకూర్చినట్టుగానే జరిగిపోయేది. స్క్రిప్ట్ ఒక లొకేషన్లో అనుకున్నాను. ఒక ఇల్లు, అందులో తోట, కొలను, ఇంటి మధ్యలో మెట్లు... ఇలా ఉంటే బాగుంటుందని రాసుకున్నాను. అలాంటి లొకేషన్ కోసం హైదరాబాద్‌లో వెదకసాగాను. అంతలో నా మిత్రుడు మదనపల్లిలో ఒక లొకేషన్ చెప్పాడు. నేనా ఇల్లు చూసి నిజంగా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఒక క్యారెక్టర్ జర్మనీలో పనిచేసి రిటైరై, ఇండియాకు వచ్చిన ప్రొఫెసర్ అని రాసుకున్నాను. నేను కథలో రాసుకున్న క్యారెక్టర్ వచ్చి నా కళ్ల ముందు నిలబడ్డట్టు జర్మనీలో పనిచేసి వచ్చిన సైంటిస్ట్ రాజారెడ్డి ఇల్లు నాకు మదనపల్లిలో దొరికింది. ఇక సినిమా జరిగేటప్పుడు ప్రొడ్యూసర్‌గా, నటిగా మంజుల ఇచ్చిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. ఆవిడ సహకారం వల్లే లొకేషన్లో నాకు ఎలాంటి సమస్యా ఎదురుకాలేదు. కథ ప్రకారం సినిమా ఉదయం నుంచి సాయంత్రం దాకా జరుగుతుంది. స్క్రిప్ట్‌లో రాసుకున్నట్టే సీన్స్ ఒక ఆర్డర్ ప్రకారం షూట్ చేశాను. అది షూటింగ్‌కు సంబంధించిన బెస్ట్ పార్ట్. కొలను దగ్గర తీయాల్సిన కొన్ని సీన్స్ ‘తడ’ ఫారెస్ట్‌లో చేశాను. సినిమా మొత్తం 22 రోజుల్లో 26 లక్షల బడ్జెట్‌తో పూర్తి చేశాం. సినిమా చేస్తున్నప్పుడు ఎవరో ‘యాదే’ చూశావా, అందులో సినిమా అంతా ఒకే పాత్రతో నడుస్తుంది అని అన్నారు. వాస్తవంగా నేనా సినిమా చూడలేదు. సినిమా చేస్తున్నప్పుడు కొంతమంది కొన్ని సందేహాలు వ్యక్తం చేసినా నేను మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. మంజుల పర్ఫార్మెన్స్ చాలా సహజంగా, వాస్తవికతకు దగ్గరగా ఉంది. మంజుల, సూర్య బ్యాలన్స్డ్గా నటించారు. ఇది ఈ సినిమాకు ప్రధాన బలం. సినిమాలో మరో రెండు క్యారెక్టర్స్ ఉంటాయి. ప్రొఫెసర్, అతని అసిస్టెంట్ ఒక సీన్లో కన్పిస్తారు. కానీ సినిమా తొంభై తొమ్మిది శాతం రెండు క్యారెక్టర్స్ మధ్యే నడవడం వల్ల రెండు క్యారెక్టర్స్‌తోనే సినిమా అని అందరూ ఫీలయ్యారు. కెమెరామెన్ రవియాదవ్... నా ఆలోచనల్ని అర్థం చేసుకుని సినిమాటోగ్రఫీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నేషనల్ బెస్ట్ ఎడిటర్‌గా అవార్డ్ తీసుకున్న అనిల్ మల్నాడ్ ఈ సినిమాకు పనిచేశారు. ఆయన అనుభవం సినిమాను మరింత ఆసక్తిగా మలచడానికి తోడ్పడింది. కృష్ణగారి కుటుంబమంతా సినిమా చూసి సంతోషం వ్యక్తం చేసి నన్ను అభినందించారు. ఇక ‘షో’ అనే టైటిల్ పెట్టడం వెనుక కారణం ఏమిటంటే, మామూలుగా సినిమా ఫస్ట్ షో, సెకండ్ షో అంటుంటాం. అందులో ఒక్క ‘షో’ అన్న మాటను తీసి టైటిల్‌గా పెడితే ఎలా ఉంటుందా అని ఆలోచించాను. చాలామంది మిత్రులు బాగుందనడంతో దానికి ఫిక్సయ్యాను. ఈ సినిమాకు నేను స్క్రిప్ట్‌లో రాసుకున్నట్టే అన్నీ అమరడంతో ముందు టైటిల్స్‌లో సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్తకు ఈ ‘షో’ అంకితం అని వేశాను. సినిమా చివరిలో ‘ఆ జగన్నాటక సూత్రధారి, కేవలం మన వినోదం కోసం సృష్టించిన అద్భుత నాటకమే... ఈ జీవితం’ అని నాకు స్ఫూర్తినిచ్చిన పరమహంస యోగానంద వాక్యం పెట్టాను. ఎన్నో ఆలోచనల పొరలు దాటుకుని రూపం దాల్చిన ‘షో’ సినిమా 2002లో తెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానే కాక, బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్‌గా నాకు పేరు తెచ్చిపెట్టింది. అవార్డులనూ అందుకుంది. ఇప్పుడు ఎప్పుడైనా ‘షో’ సినిమా చూస్తుంటూ... స్టైలింగ్‌లో ఇంకో పది శాతం మార్పులు చేస్తే సినిమా ఇంకొంచెం బెటర్‌గా ఉండేదేమో అనిపిస్తూ ఉంటుంది! - కె.క్రాంతికుమార్‌రెడ్డి