కమల్ తదుపరి సినిమాలో బాలచందర్ | Kamal Haasan ropes in his mentor Balachander for next movie | Sakshi
Sakshi News home page

కమల్ తదుపరి సినిమాలో బాలచందర్

Published Fri, Jan 17 2014 3:05 PM | Last Updated on Sat, Sep 2 2017 2:43 AM

కమల్ తదుపరి సినిమాలో బాలచందర్

కమల్ తదుపరి సినిమాలో బాలచందర్

ఒకాయన మెగాఫోన్ పట్టుకున్నారంటే.. తిరుగులేదు బ్రహ్మాండమైన హిట్లే. మరొకాయన నటిస్తున్నారంటే అదో అద్భుత చిత్రరాజం అన్నట్లే. అలాంటి వాళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే... ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు కదూ. అవును, అద్భుత చిత్రాల సృష్టికర్త కె.బాలచందర్తో కలిసి నవరస నటనా సార్వభౌముడు కమల్ హాసన్ నటించబోతున్నాడు. విశ్వరూపం-2 విడుదలైన తర్వాత షూటింగ్ చేసుకోబోయే తమిళ కామెడీ చిత్రం 'ఉత్తమ విలన్'లో ప్రముఖ దర్శకుడు బాలచందర్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటించబోతున్నారు.

కమల్ కెరీర్ను తీర్చిదిద్దిన బాలచందర్, 1973 నుంచి దాదాపు 30 సినిమాలు ఆయనతో తీశారు. అలాంటిది కమల్తో కలిసి నటించడం కోసం ఆయన గెడ్డం కూడా పెంచుతున్నారు. కమల్ వ్యక్తిగతంగా కోరడంతోనే ఈ ప్రాజెక్టు చేయడానికి ఆయన అంగీకరించారు. ఆయన నిజజీవిత పాత్రకు ఆ సినిమాలో పాత్ర చాలా దగ్గరగా ఉంటుందట. 'ఉత్తమ విలన్' సినిమాకు కమల్ స్నేహితుడు, బాలచందర్ శిష్యుడైన రమేష్ అరవింద్ దర్శకత్వం వహించబోతున్నారు. వయసు మీరిపోతున్న ఓ సూపర్స్టార్ పాత్రలో కమల్ ఆ చిత్రంలో నటిస్తారు. క్రేజీ మోహన్ ఈ చిత్రానికి డైలాగులు రాస్తారు. గతంలో కమల్ నటించిన మైఖేల్ మదన కామరాజు, విచిత్ర సోదరులు, భామనే సత్యభామనే, పంచతంత్రం లాంటి కామెడీ హిట్ సినిమాలకు క్రేజీ మోహనే సంభాషణలు అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement