మైండ్ బ్లోయింగ్..!
మైండ్ బ్లోయింగ్..!
Published Sun, Dec 15 2013 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
వారం క్రితం తనికెళ్ల భరణికి చెన్నై నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. ‘‘నేను బాలచందర్‌ని మాట్లాడుతున్నా’’ అనగానే, ఇటు భరణి షాక్. ‘‘మీరు డెరైక్ట్ చేసిన ‘మిథునం’ సినిమాని కొంత యూట్యూబ్‌లో చూశాను. చాలా బాగా డెరైక్ట్ చేశారు. ఫుల్ క్వాలిటీతో సినిమా చూడాలని ఉంది’’ అనడిగారు బాలచందర్. వెంటనే భరణి ఆయనకు డీవీడీ పంపించేశారు. అది చూశాక బాలచందర్ మళ్లీ భరణికి ఫోన్ చేసి ‘మైండ్ బ్లోయింగ్ మూవీ’ అని అభినందించారు.
అలాగే ‘మిథునం’లో హీరోగా చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ప్రత్యేకంగా ఓ ఉత్తరం రాశారు. ‘‘120 నిమిషాల వీడియో పొయిట్రీలా ఉంది. వెయిటింగ్ ఫర్ ది నేషనల్ అవార్డ్’’ అని ఆ లేఖలో వ్యాఖ్యానించారు. శనివారం ‘మిథునం’ చిత్రాన్ని చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా చెన్నై వెళ్లిన భరణి, ప్రత్యేకంగా బాలచందర్ ఇంటికి వెళ్లి కలిశారు. ‘‘బాలచందర్‌గారు నాలాంటి వారెందరికో అభిమాన దర్శకుడు. అంతటి గొప్ప వ్యక్తి ప్రశంసలు పొందినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని భరణి సంతోషం వెలిబుచ్చారు.
Advertisement