
తొందరపడ్డ రాంగోపాల్ వర్మ..
దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఈసారి ఆయన బతికి ఉన్నవాళ్లను తొందరపడి మరి 'ట్విట్'తో చంపేశారు. ప్రముఖ దర్శకుడు బాలచందర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే... చనిపోయినట్లు ...అందుకు ఆయనకు సంతాపం తెలుపుతూ ట్విట్ చేశారు. అయితే జరిగిన పొరపాటును గ్రహించి నాలిక కరుచుకున్న వర్మ ...కొద్దిసేపట్లోనే తాను చేసిన ట్విట్ను తొలగించేశారు
రాంగోపాల్ వర్మ ఎక్కడుంటే వివాదాలు అక్కడే ఉంటాయని నానుడి ఉంది. దేవుడు నుంచి దెయ్యాన్ని కూడా వదలని ఆయన..తన కామెంట్లతో తరచు మీడియాలో నానే విషయం తెలిసిందే. మరోవైపు బతికున్నవాళ్లు చనిపోయారని అవగాహనారాహిత్యంతో స్పందించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఏది ఏమైనా ఇలాంటి సున్నిత విషయాల్లో విజ్ఞత పాటించటం ఎంత ఉత్తమమో ఈ ఉదంతం చెప్పకనే చెబుతుంది. కాగా బతికున్నవారు చనిపోయినట్లుగా ప్రచారం జరిగితే వారికి ఆయుషు పెరుగుతుందనే నమ్మకం ఉంది. అలాగే వర్మ కూడా తన ట్విట్తో బాలచందర్కు దిష్టి తీసి ఉంటారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.