అలా అనుకున్న రోజు దుకాణం కట్టేయాల్సిందే! | Maruti's birthday celebrates 'clean chit' with success | Sakshi
Sakshi News home page

అలా అనుకున్న రోజు దుకాణం కట్టేయాల్సిందే!

Published Sun, Oct 8 2017 12:22 AM | Last Updated on Sun, Oct 8 2017 8:14 AM

Maruti's birthday celebrates 'clean chit' with success

‘‘త్రివిక్రమ్‌గారి సినిమా చూసినప్పుడు ఎలా అనిపిస్తుందో? శేఖర్‌ కమ్ములగారి సినిమా చూసినప్పుడు ఎలా అనిపిస్తుందో? నేను తీసిన సినిమాను ప్రేక్షకులు చూసి ‘ఇది మారుతి సినిమా’ అన్నప్పుడు హ్యాపీగా ఫీలవుతాను. ఎందుకంటే... అదే మనకు గుర్తింపు. వంద మంది డైరెక్టర్లలో మనల్ని ప్రేక్షకులు గుర్తించగలిగితే అంతకు మించిన అదృష్టం ఉండదు’’ అన్నారు దర్శకుడు మారుతి. ‘భలే భలే మగాడివోయ్‌’, ‘మహానుభావుడు’... ఇలా వరుస విజయాలతో ‘క్లీన్‌ చిట్‌’ తెచ్చుకున్న మారుతి బర్త్‌డే ఈ రోజు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు..

► ఈ బర్త్‌డే స్పెషల్‌ ‘మహానుభావుడు’ సక్సెస్‌. ఈ సినిమాతో నా బాధ్యత మరింత పెరిగింది. ఒక మనిషిలో ఉన్న రెండు క్యారెక్టర్ల సంఘర్షణే ఈ సినిమా. ‘‘భలే భలే మగాడివోయ్‌’లో నానికి మతిమరుపు. ‘మహానుభావుడు’లో శర్వానంద్‌కి ఓసీడీ (అతిశుభ్రత). సినిమాల్లో మీ హీరోలకు ఏదో ఒక డిసార్డర్‌ పెట్టారు కదా.. రియల్‌ లైఫ్‌లో మీకేదైనా డిసార్డర్‌ ఉందా? అనడిగితే– ‘‘లేదు. ఆ రెండు సినిమాల్లో హీరోల క్యారెక్టర్స్‌ రియల్‌ లైఫ్‌లో నేను చూసినవే. నాకు ఒక్క ఐడియా వస్తే నా సన్నిహితులతో షేర్‌ చేసుకుంటా. వాళ్లందరూ బాగుందంటే... ప్రేక్షకులకు కూడా బాగుంటుందనిపించి తీస్తా’’ అన్నారు నవ్వుతూ.

► మారుతి అంటే... కొత్త కాన్సెప్ట్‌కు ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడించి ఒక మంచి మాట చెబుతాడని నమ్మవచ్చు. కొంతమంది మాఫియా మూవీస్, కొందరు హారర్‌ మూవీస్‌ చేస్తారు. నేను నా జోనర్‌ (ఎంటర్‌టైన్‌మెంట్‌)లోనే వెళ్లాలనుకుంటున్నా. అయితే, వాటిని నెక్ట్స్‌ లెవల్లో తెరకెక్కించాలని ఉంది.

► నాకు కొత్తా పాతా,  చిన్నా పెద్దా అనే తేడాలు లేవు. కథ కుదిరితే ఎవరితోనైనా సినిమా చేస్తాను. ముఖ్యంగా స్టార్స్‌ అందరితో సినిమాలు చేయాలని ఉంది. సీక్వెల్స్, రీమేక్‌ మూవీస్‌ చేయడానికి ఇష్టపడను.

► క్లీన్‌గా సినిమా తీయాలనుకుంటే తీయలేం. స్వతహాగా మనసులో ఉండాలి. నాలో ఒరిజనల్‌గా ఆ డైరెక్టరే ఉన్నాడు. వాడు ఇప్పుడు బయటకు వచ్చాడు... అంతే.

► టెక్నాలజీతో ఇవాళ లైఫ్‌ చాలా షార్ట్‌ అయిపోయింది. టీ20 మ్యాచ్‌లు, షార్ట్‌ ఫిల్మ్స్, వెబ్‌ సిరీస్‌లు వచ్చిన తర్వాత రెండున్నర గంటలు థియేటర్లో కూర్చోడానికి ఆడియన్స్‌ ఇంట్రస్ట్‌ చూపించకపోవచ్చు. వాళ్లను థియేటర్లో కూర్చోబెట్టగలిగే డైరెక్టర్లే సక్సెస్‌ అవుతున్నారు

► ప్రేక్షకుడు ఎక్కడో ఉండడు నాలోనే ఉంటాడని అనుకుంటాను. ప్రతి శుక్రవారం ఒక కామన్‌ ఆడియన్‌లానే నేను సినిమాలను ఎంజాయ్‌ చేస్తాను. నచ్చితే... బాగున్నాయని ట్వీట్‌ చేస్తా. సినిమాను సినిమాలానే చూస్తా. ‘అరే.. ఆ సీన్‌ బాగా తీశారు. మనం కూడా ఇంత బాగా తీయా’లని ఎగై్జట్‌ అవుతుంటా. ఆ ఎగై్జట్‌మెంట్‌ పోయి, మనం తీసిందే సినిమా అనుకున్న రోజు... దుకాణం కట్టేసుకుని, పార్కుల్లో కాలక్షేపం చేసుకోవాలి.

► నాగచైతన్యతో తీయబోయేది టీనేజ్‌ యంగ్‌ లవ్‌స్టోరీ మూవీ. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. ప్రభాస్, బన్నీగార్లతో సినిమాలు చేయడం ఇష్టం. కథ కుదిరి, వారికి నచ్చితే తప్పకుండా చేస్తాను.

► ప్రొడక్షన్‌ విషయానికొస్తే... ప్రస్తుతం నిర్మిస్తున్న ‘లండన్‌బాబులు’ను నవంబర్‌లో రిలీజ్‌ చేస్తాం. ఆ తర్వాత రెండు సినిమాలు మొదలుపెడతాం. ఒక సినిమాకు కథ ఇచ్చాను. ఇంకో సినిమాకు కాన్సెప్ట్‌ ఇచ్చాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement