‘అలిపిరికి అల్లంత దూరంలో'.. టీజర్‌ విడుదల | Raavan Reddy Sri Nikitha Alipiriki Allantha Dooramlo Teaser Released | Sakshi
Sakshi News home page

Alipiriki Allantha Dooramlo : ‘అలిపిరికి అల్లంత దూరంలో'.. టీజర్‌ విడుదల

Published Sun, Nov 13 2022 12:31 PM | Last Updated on Sun, Nov 13 2022 12:32 PM

Raavan Reddy Sri Nikitha Alipiriki Allantha Dooramlo Teaser Released - Sakshi

రావణ్‌ నిట్టూరు, శ్రీ నిఖిత హీరో హీరోయిన్లుగా నటించిన రాబరీ థ్రిల్లర్‌ ‘అలిపిరికి అల్లంత దూరంలో..’. జె. ఆనంద్‌ దర్శకత్వంలో రమేష్‌ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి. నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదలకానుంది. శనివారం దర్శకుడు మారుతి ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రావణ్‌ మాట్లాడుతూ– ‘‘నాటక రంగంలో అనుభవం ఉన్న నాకు యాక్టర్‌గా వెండితెరపై ఇది తొలి చిత్రం’’ అన్నారు.

‘‘తిరుమలలో షాపు సంపాదించుకోవాలనుకునే ఓ యువకుడి జీవితంలో జరిగిన సంఘటనల సవహారమే ఈ చిత్రం. ఈ చిత్రంలోని ప్రతి సీన్‌లో వెంకటేశ్వరస్వామి రిఫరెన్స్‌ ఉంటుంది’’ అన్నారు ఆనంద్‌. జె. ‘‘డివైన్‌ ఎలిమెంట్స్‌తో థ్రిల్లింగ్‌గా సాగే రాబరీ డ్రామా ఈ చిత్రం’’ అన్నారు నిర్మాతలు రమేష్, రాజేంద్ర.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement