ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో బూతు డైలాగ్స్‌కు ఎలాంటి కొదవ లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా టీజర్,ట్రైలర్‌లోనే కొన్ని డైలాగ్స్‌తో సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వచ్చిన 'డ్రింకర్ సాయి' సినిమా టీజర్ కూడా అదే కోవకు చెందినట్లు కనిపిస్తుంది. ధర్మ, ఐశ్వర్య శర్మ జంటగా కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్‌లు ‘డ్రింకర్ సాయి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్ కూడా ఉంచారు. ఈ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్‌ను డైరెక్టర్ మారుతి లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
యూత్‌ను ప్రధానంగా టార్గెట్ చేస్తూ డ్రింకర్ సాయి చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. టీజర్‌లో ఎక్కువగా బోల్డ్ డైలాగ్స్‌తో పాటు ధర్మ , ఐశ్వర్య శర్మ లవ్ స్టోరీ హైలెట్‌గా కనిపిస్తుంది. వారిద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ యూత్‌ను ఆకట్టుకుంటాయి.
ముఖ్యంగా హీరోయిన్ ఐశ్వర్య శర్మకు యూత్ ఫిదా అవుతున్నారు. షోషల్ మీడియాలో ఆమె డైలాగ్స్ తెగ షేర్ చేస్తున్నారు. ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రమ్, బిగ్ బాస్ ఫేమ్ కిర్రాక్ సీత, రీతూ చౌదరి, ఫన్ బకెట్ రాజేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment