
హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా శ్రీని జోస్యుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిస్సింగ్’. భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరి రావు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు మారుతి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా బడ్జెట్ చిన్నదా? పెద్దదా? అని కాదు. ఓ క్వాలిటీ ఫిల్మ్ చేశారని చెప్పగలను. టైటిల్ ‘మిస్సింగ్’.
కానీ ఈ చిత్రాన్ని ఎవరూ మిస్ కారని అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘మిస్సింగ్’ ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయ్యాను’’ అన్నారు ‘బన్నీ’ వాసు. ‘‘మా కలను నిజం చేసిన మా నాన్న భాస్కర్, హీరో ఫాదర్ శేషగిరి రావులకు రుణపడి ఉంటాను’’ అన్నారు శ్రీని. ‘‘యాక్షన్.. లవ్.. ఎమోషన్ అన్నీ ఉన్న సినిమా ఇది’’ అన్నారు హీరో హర్ష.
Comments
Please login to add a commentAdd a comment