
‘‘ఆండవన్ కట్టలై’ అనే తమిళ సినిమాను ‘లండన్ బాబులు’గా రీమేక్ చేశాం. చాలా రోజుల క్రితమే సినిమా పూర్తయ్యింది. అయితే, మంచి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేశాం. నవంబర్ 10న సినిమాను రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాత మారుతి. రక్షిత్, స్వాతి జంటగా చిన్నికృష్ణ దర్శకత్వంలో ఏవీఎస్ స్టూడియో సమర్పణలో మారుతి నిర్మించిన సినిమా ‘లండన్ బాబులు’. మారుతి మాట్లాడుతూ– ‘‘చక్కని వినోదంతో రూపొందిన సినిమా ఇది. చూసిన వారందరూ బాగుందని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా నచ్చి, ఓ ప్రముఖ టీవీ వారు శాటిలైట్ హక్కులు సొంతం చేసుకున్నారు. అన్ని వర్గాలవారూ చూసేలా తీసిన ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు.
‘‘సినిమాలకు దూరంగా వైజాగ్‌లో ఉన్న నన్ను పిలిచి మరీ మారుతిగారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. లండన్ వెళ్లాలనుకున్న ఓ యువకుడి కథే ఈ సినిమా. అతడు లండన్ వెళతాడా? లేదా? అనేది సినిమాలో చూడాల్సిందే. నవంబర్ 4న ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహిస్తాం’’ అన్నారు చిన్నికృష్ణ. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె. నాయుడు, సంగీతం: కె, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: కిరణ్ తలసిల, దాసరి వెంకట సతీష్.
Comments
Please login to add a commentAdd a comment