ఈ కాలమే.. మంచి ఫీల్ గుడ్ పాటలాగా ఉంది: మారుతి | Director Maruthi Unveils Ee Kaalame Song From Nachinavadu Movie - Sakshi
Sakshi News home page

ఈ కాలమే.. మంచి ఫీల్ గుడ్ పాటలాగా ఉంది: మారుతి

Published Wed, Aug 30 2023 7:47 PM | Last Updated on Wed, Aug 30 2023 8:18 PM

Director Maruthi Unveils Ee Kaalame Song From Nachinavadu - Sakshi

లక్ష్మణ్ చిన్నా హీరోగా నటిస్తూ  స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘నచ్చినవాడు’.  కావ్య రమేష్, కె. దర్శన్, నాగేంద్ర అరుసు, లలిత నాయక్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం 'ఈ కాలమే' పాటను దర్శకుడు మారుతి విడుదల చేశారు. ఈ చిత్రానికి యువ రచయిత హర్షవర్ధన్ రెడ్డి లిరిక్స్‌ అందించగా, ప్రముఖ గాయకుడు జావేద్ అలీ అద్భుతంగా ఆలపించాడు.

పాట విడుదల సందర్భంగా దర్శకుడు మారుతి మాట్లాడుతూ "మలయాళ సంగీత దర్శకుడు మిజో జోసెఫ్ స్వరపరిచిన 'ఈ కాలమే' పాటను ఇప్పుడు విన్నాను, పాట మంచి ఫీల్ గుడ్ పాటలాగా చాలా బాగుంది. ఈ చిత్రం ట్రైలర్ కూడా చూశాను, చాలా బాగుంది. హీరో, దర్శకుడు, నిర్మాత అయిన లక్ష్మణ్ చిన్న గారికి ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుంది అని భావిస్తున్నాను’ అన్నారు. ‘ఈ పాట మా చిత్రానికి ప్రాణం లాంటిది.  మిజో జోసెఫ్ చాలా అద్భుతమైన స్వరాలు అందించాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటిస్తాం’అని హీరో, దర్శక నిర్మాత లక్ష్మణ్ చిన్నా అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement