
గోపిచంద్, రాశీఖన్నా జంట మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్-యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీవాసు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ఇటీవల అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్‌లో గోపిచంద్ సినిమా అనగానే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో దీపావళి సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను వదిలారు మేకర్స్.
ఈ సందర్భంగా నవంబర్ 8న టీజర్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం విడుదల పక్కా కమర్షియల్ ఫస్ట్ గ్లీంప్స్‌కు యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. 2 మిలియన్ల వ్యూస్‌ను ఈ ఫస్ట్ గ్లింప్స్ దూసుకుపోతోంది. కాగా ఈ సినిమాకు జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తుండగా.. కరమ్ చావ్లా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీని సెట్స్‌పై తీసుకెళ్లనున్నట్లు ఇటీవల చిత్ర బృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment