
సొలమన్ జడ్సన్, రాజ్ బాలా, మనో చిత్ర, అనన్య మణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "రామ్ వర్సెస్ రావణ్". ఈ చిత్రంలో సప్తగిరి మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. కె శుక్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. షాన ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ ఏఎస్ జడ్సన్ "రామ్ వర్సెస్ రావణ్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు. "రామ్ వర్సెస్ రావణ్" సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. దర్శకుడు మారుతి, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి అతిథులుగా హాజరై చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు.
ఈ సందర్భంగా దర్శకుడు కె.శుక్రన్ మాట్లాడుతూ.. రామ్ వర్సెస్ రావణ్.. ఒక పల్లెటూరిలో జరిగే కథ. ఆ ఊరి మంచి కోసం ఇద్దరు యువకులు ఎలా పోరాటం చేశారు అనేది సినిమాలో చూపిస్తున్నాం. యాక్షన్ తో పాటు ఎంటర్ టైన్ మెంట్ కథలో కలిసి ఉంటుంది. కథ మీద పూర్తి నమ్మకంతో సినిమా ప్రారంభించాం. కపటధారి లాంటి పెద్ద చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన నా మిత్రుడు రాజామతి ఈ కథ విని బాగా నచ్చి ముందు ఈ సినిమా కంప్లీట్ చేద్దామన్నారు. ఏంజెల్ సినిమాను మించిన విజయం రామ్ వర్సెస్ రావణ్ సాధిస్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నాం. అన్నారు. ఈ సినిమాలో ఎమోషనల్ ఎలిమెంట్స్తో పాటు మంచి కామెడీ కూడా ఉంటుంది అన్నారు హీరో సొలమన్ జడ్సన్. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : రాజామతి, సంగీతం : వికాస్ బాడిశ, స్టంట్స్ : రామ్ లక్ష్మణ్, బి జె శ్రీధర్.
Comments
Please login to add a commentAdd a comment