Sarath Marar
-
The Ghost: నాగ్ కోసమే కథ రాశా.. రొమాన్స్ ఉంటుంది: ప్రవీణ్ సత్తారు
‘‘నా దృష్టిలో సినిమా తీయడం అంటే సినిమా చరిత్రలో ఓ పేజీ రాయడంలా భావిస్తాను. అలా ఆ చరిత్రలో ‘ది ఘోస్ట్’ ఓ పేజీ. వెయ్యి సంత్సరాల తర్వాతే కాదు.. మనం చనిపోయిన తర్వాత కూడా సినిమా చరిత్రలో ఆ పేజీ ఉంటుంది. అందుకే ఈ పేజీని చాలా జాగ్రత్తగా రాయలన్న భయం, బాధ్యత ఉంటే ప్రతి సినిమా బాగుంటుంది’’ అన్నారు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ది ఘోస్ట్’. సునీల్ నారంగ్, శరత్ మరార్, రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ప్రవీణ్ సత్తారు చెప్పిన విశేషాలు. ► నాగార్జునగారి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ‘ది ఘోస్ట్’ కథ రాశాను.. నాగార్జునగారు అద్భుతంగా చేశారు. ఇంటర్‌పోల్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయిన ఆఫీసర్ విక్రమ్ పాత్ర చేశారు నాగార్జునగారు. ఈ చిత్రంలో 12 యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. ఎమోషన్స్ కూడా ఉన్నాయి. సినిమాలోని చెల్లి, మేనకోడలు సెంటిమెంట్ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. రొమాన్సూ ఉంది. ► నాకు ‘గరుడవేగ’ సినిమా ఫ్లస్ అయ్యిందనే భావిస్తున్నాను. ఈ విషయంలో జీవితా రాజశేఖర్గార్లకు ధన్యవాదాలు. నేను మూడు సినిమాలు నిర్మించాను. సినిమాలో మంచి కంటెంట్ ఉన్నప్పటికీ దాన్ని ఆడియన్స్‌కు రీచ్ అయ్యేలా చేయడం అనేది కొంచెం కష్టమే. నిర్మాతల కష్టాలు నాకు తెలుసు. నా తర్వాతి చిత్రం వరుణ్ తేజ్‌తో ఉంది. ఈ నెల 10న యూకేలో ఆ సినిమా షూటింగ్ ఆరంభిస్తాం. అలాగే ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాను. ► పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్‌ను చూసే సినిమా చూడాలా? వద్దా అని ఆడియన్స్ డిసైడ్ చేసుకుంటున్న రోజులువి. సినిమా స్టాండర్డ్స్ విషయంలో తెలుగు ప్రేక్షకుల ఆలోచనలు మారాయి. ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం అంటే ఎంటర్టైన్ చేయడమే. థియేటర్స్‌లో ఆడియన్స్ సినిమా చూస్తున్నప్పుడు వారు తమ మొబైల్ ఫోన్స్ మెసేజ్‌లను చెక్ చేసుకోనంత వరకు స్క్రీన్ పై ఏ జానర్ సినిమా ఉన్నా అప్పుడు అది హిట్టే. హిందీలో రిలీజ్ చేస్తాం – సునీల్ నారంగ్ ‘ది ఘోస్ట్’ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నాం. ఈ నెల 7న రిలీజ్ అవుతుంది. ముందుగా హిందీ రిలీజ్ ప్లాన్ చేయలేదు. ఆ తర్వాత చేశాం. నాగార్జునగారు చాలా బాగా నటించారు. ప్రవీణ్ సత్తారు భవిష్యత్‌లో పెద్ద దర్శకుడు అవుతాడు. కోవిడ్ వల్ల అనుకున్నదాన్ని కన్నా సినిమా బడ్జెట్ కాస్త పెరిగింది. -
ఈ కిక్కే వేరప్పా!
హిట్ కాంబినేషన్లో కొత్త సినిమాకి కొబ్బరికాయ కొడితే.. సినీ ప్రముఖులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపుతారు. అందులోనూ పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఆ కిక్కే వేరు. ఇప్పటివరకూ పవన్‌కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రం రూపొందుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్న ఈ చిత్రం శనివారం ఉదయం 10 గంటల 49 నిమిషాలకు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ‘‘డిసెంబర్లో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. సినిమాలో పవన్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. త్వరలో నటీనటుల వివరాలు ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత. పవన్‌కల్యాణ్, చిత్ర దర్శక-నిర్మాతలతో పాటు నిర్మాతలు శరత్ మరార్, సూర్యదేవర నాగవంశీ, పీడీవీ ప్రసాద్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి కళ: ఎ.ఎస్.ప్రకాశ్, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమేరా: వి.మణికందన్, సంగీతం: అనిరుధ్ రవిచందర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పీడీవీ ప్రసాద్, సమర్పణ: శ్రీమతి మమత. -
పవన్ లేకుండానే షూటింగ్ స్టార్ట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఈ నెల ఆరో తేదిన పట్టాలెక్కబోతోంది. ఇప్పటికే కథ కథనాలు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం డాలీ దర్శకుడు. పవన్ సన్నిహితుడు శరత్ మరార్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వం వహించాల్సి ఉన్నా.. ఆయన నటుడిగా బిజీ కావటంతో డాలీని తీసుకున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ 6వ తేది నుంచి ప్రారంభమవుతున్నా.. ఆ షూటింగ్లో పవన్ పాల్గొనే అవకాశం లేదన్న టాక్ వినిపిస్తోంది. కారణాలేంటో తెలియకపోయినా.. మరో వారం తరువాతే పవన్ షూటింగ్‌కు హారవుతారని తెలుస్తోంది. అయితే గతంలో సర్థార్ గబ్బర్‌సింగ్ షూటింగ్ సమయంలో కూడా పవన్ తొలి షెడ్యూల్‌కు హాజరు కాలేదు. దీంతో ఇది పవన్ సెంటిమెంట్ అన్న టాక్ కూడా వినిపిస్తోంది. -
అప్పుడు రేణు...ఇప్పుడు శ్రుతి
పవన్ కల్యాణ్ పక్కన ఓ హీరోయిన్‌కి రెండో అవకాశం రావడం చాలా అరుదు. గతంలో రేణు దేశాయ్ ఒక్కరే పవన్ సరసన హీరోయిన్గా రెండు సినిమాల్లో నటించారు. ఇప్పుడు శ్రుతీహాసన్ ఆ ఫీట్ రిపీట్ చేస్తున్నారు. పవన్ హీరోగా డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మించనున్న చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా ఎంపికైన విషయం తెలిసిందే. కానీ, అంతకు ముందు చాలా తతంగమే నడిచిందట. హీరోయిన్ ఎంపికపై ఫిల్మ్ నగర్లో ఆసక్తికరమైన కథనం వినిపిస్తోంది. అదేంటంటే.. ఈ చిత్రం కోసం శ్రుతీని దర్శక-నిర్మాతలు సంప్రదించే సమయానికి ‘ప్రేమమ్’, ‘సింగం 3’, ‘శభాష్ నాయుడు’ సినిమాలతో ఆమె చాలా బిజీ. పవన్‌తో రెండోసారి జోడీ కట్టాలని మనసులో ఉన్నప్పటికీ.. ఏం చేయలేని పరిస్థితి అట. ఇంతలో కమల్‌హాసన్‌కి గాయమైంది. దాంతో ఆయన నెల రోజుల వరకూ రెస్ట్ తీసుకోవాల్సి రావడంతో ‘శభాష్ నాయుడు’ షూటింగ్ వాయిదా పడింది. ఆ చిత్రానికి ఇచ్చిన డేట్స్‌ని పవన్ సినిమాకి అడ్జస్ట్ చేశారట శ్రుతీహాసన్. -
గోవుల మధ్య గోపాలుడిలా..!
ఖాళీ సమయాల్లో పవన్ కల్యాణ్ ఏం చేసినా చేయకపోయినా నచ్చిన పుస్తకాలు చదువుతారు. లేకపోతే తన ఫామ్‌హౌస్‌కి వెళ్లి పలుగూ, పారా పట్టుకుని పొలం పని చేస్తారు. వాస్తవానికి పవన్‌కి నగర జీవితానికి దూరంగా అలా ఫామ్‌హౌస్‌లో గడపడం చాలా ఇష్టం. ఇప్పుడు కూడా పవన్ కల్యాణ్ ఫామ్మౌస్లోనే ఉన్నారు. పచ్చని చెట్ల మధ్య సేద తీరుతూ ఫామ్‌హౌస్‌లో ఉన్న ఆవుల సంరక్షణను పరిశీలించుకుంటున్నారు. అందుకే నిర్మాత శరత్ మరార్ ‘గోవుల మధ్య గోపాలుడి’లా పవన్ కల్యాణ్ ఫామ్‌హౌస్‌లో ఉన్నారని అంటున్నారు. ఇంతకీ శరత్ మరార్ ఫామ్‌హౌస్‌కి ఎందుకు వెళ్లారంటే.. పవన్ కల్యాణ్ నటించనున్న తాజా చిత్రానికి ఆయనే నిర్మాత అనే విషయం తెలిసిందే. ఈ చిత్రం గురించి చర్చించడానికే శరత్ మరార్ వెళ్లారు. ఎస్.జె. సూర్య తప్పుకున్నాక దర్శకత్వ బాధ్యతలను డాలీ స్వీకరించారు. ప్రస్తుతం కథాచర్చలు జరుగుతున్నాయి. నాలుగైదు రోజుల క్రితం ఈ చిత్రం ఆగిందనే వార్త హల్చల్ చేసింది. కానీ, రచయిత ఆకుల శివ, డాలీ తదితరులు స్టోరీ డిస్కషన్స్‌లో ఉన్నారు. ఈ నెలలోనే ఈ చిత్రం ఆరంభమయ్యే అవకాశం ఉంది. -
కొత్త టైటిల్... ‘కడప కింగ్’?
‘‘ ‘గాంధీ’ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదు. అదే ‘కడప కింగ్’ అని తీయండి.. టు హండ్రెడ్ సెంటర్స్... హండ్రెడ్ డేస్’’ అంటూ ‘పోకిరి’ చిత్రంలో షాయాజీ షిండే చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయింది. ఇప్పుడా ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నారా? మరేం లేదు. పవన్‌కల్యాణ్ హీరోగా ఎస్జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రానికి ‘కడప కింగ్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది. నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రంలో పవన్ ఫ్యాక్షన్ లీడర్‌గా కనిపించ నున్నారనేది కృష్ణానగర్ వర్గాల భోగట్టా. తొలుత ఈ చిత్రానికి ‘సేనాపతి’ టైటిల్ పెట్టనున్నారనే పుకార్లు వినిపించాయి. ఆ తర్వాత ‘హుషారు’ టైటిల్ షికారు చేసింది. ఇప్పుడేమో ‘కడప కింగ్’ టైటిల్‌ని రిజిస్టర్ చేయించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాయల సీమ ఫ్యాక్షన్ నేపథ్యం కావడంతో ఈ టైటిల్ పెట్టాలను కున్నారట. ఈ పుకార్ల మాటెలా ఉన్నా, అధికారికంగా అసలు టైటిల్ ఏదో తెలియాలంటే ఓపిక పట్టాల్సిందే. -
పవన్‌తో మళ్లీ...
‘ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే..’ అంటూ ‘గబ్బర్‌సింగ్’లో శ్రుతీహాసన్‌ని ఉద్దేశించి పవన్ కల్యాణ్ పాడటం, ఆ పాటకు ఈ బ్యూటీ అందంగా అభినయించడం అందర్నీ ఆకట్టుకుంది. ఈ జంటకు మంచి మార్కులు పడ్డాయి కూడా. మరోసారి ఈ ఇద్దరూ తెరపై కనిపించనున్నారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఎస్.జె. సూర్య దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా శరత్ మరార్ నిర్మిస్తున్న చిత్రం ఇటీవల ఆరంభమైన విషయం తెలిసిందే. ఇందులో కథానాయికగా శ్రుతీహాసన్‌ని ఎంపిక చేశారు. ఈ చిత్రానికి కథ-మాటలు: ఆకుల శివ, సినిమాటోగ్రఫీ: సౌందరరాజన్, సంగీతం: అనూప్ రూబెన్స్. -
పవన్ కల్యాణ్ అభిమానులకు శుభవార్త
పవన్ కల్యాణ్‌ను మళ్ళీ తెర మీద ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ను ‘ఉగాది’ నాడు ఏప్రిల్ 8న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర యూనిట్ అందుకోసం శరవేగంతో పనిచేస్తోంది. శరత్ మరార్, సునీల్ లుల్లాలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని కె. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, పేరున్న నటీనటులతో తయారవుతున్న ఈ చిత్రం షూటింగ్‌తో పవన్‌కల్యాణ్ ఇప్పుడు తెగ బిజీగా ఉన్నారు. ఒకపక్క హైదరాబాద్ నడిబొడ్డున వేసిన భారీ రతన్‌పూర్ సెట్లో ఎపిసోడ్, మరోపక్క శివార్లలో సంఘీ టెంపుల్ దగ్గర అటవీప్రాంతంలో జరుగుతున్న భారీ ‘గుర్రాల మేళా’ ఎపిసోడ్, చటు క్కున ఆర్.ఎఫ్.సి.లో యాక్షన్ సీక్వెన్స్ - ఇలా రోజుకోచోట విసుగూ, విరామం లేకుండా షూటింగే. పవన్ సరసన కాజల్ అగర్వాల్ నాయిక లొకేషన్లో 100 గుర్రాలు... వెయ్యిమంది యూనిట్! తాజా విశేషం ఏమిటంటే, ఈ సినిమా కోసం ‘గుర్రాల మేళా’ సీక్వెన్స్ ఒకటి చిత్రీకరించడం! ఈ సీక్వెన్స్ కోసం ఏకంగా 100 గుర్రాలు, 10 వింటేజ్ కార్లు, అనేక లగ్జరీ కార్లు తెప్పించారు. ఇక, గుర్రపు రౌతులు, ఆర్టిస్టులు కలిపి దాదాపు వెయ్యిమంది ఈ చిత్రీకరణలో పాలుపంచు కున్నారు. ప్రధాన తారాగణమైన 40 మంది ఈ సీక్వెన్స్‌లో పాల్గొన్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్ర గీతాలను మార్చి మధ్యకల్లా రిలీజ్ చేయనున్నారు. సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్న ఈ చిత్రానికి హరీశ్ పాయ్ క్రియేటివ్ హెడ్. ‘‘ఉగాది నాడు సినిమా రిలీజ్ చేయడం కోసం యూనిట్ మొత్తం దాదాపు నిద్ర లేకుండా పనిచేస్తోంది. సినిమా పూర్తయ్యే వరకు నిర్విరామంగా జరిగే ఈ షెడ్యూల్లో ప్రస్తుతం హీరోయిన్ కాజల్ అగర్వాల్, విలన్ శరద్ కేల్కర్, అలాగే బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, నర్రా శీను తదితరులందరూ పాల్గొంటున్నారు’’ అని చిత్ర వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. మొత్తం మీద, భారీ సెట్లు, యూనిట్‌తో సినిమా పండగలా ఉంటుందట! అంత పండగ వాతావరణం ఉన్న సినిమా ఉగాది పండగకిరావడం కరెక్టే! -
ఆ మాటలే నాకు కనువిప్పు : పవన్ కల్యాణ్
‘‘మేమిద్దరం కలిసి ఎప్పట్నుంచో ఓ సినిమా చేయాలనుకుంటున్నాం. ఇన్నాళ్లకు కుదిరింది. అది కూడా ఒక మంచి చిత్రం చేయడం ఇంకా ఆనందంగా ఉంది’’ అని వెంకటేశ్, పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కిశోర్‌కుమార్ పార్ధసాని దర్శకత్వంలో వెంకటేశ్, పవన్ కల్యాణ్ కాంబినేషన్లో డి. సురేశ్‌బాబు, శరత్‌మరార్ నిర్మించిన చిత్రం ‘గోపాల గోపాల’. అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ చిత్రం పాటల ఆవిష్కరణ వేడుక ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో వెంకటేశ్ మాట్లాడుతూ - ‘‘మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ఇది. ఇందులో నటించడానికి పవన్ అంగీకరించగానే చాలా సంతోషం అనిపించింది’’ అని చెప్పారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ - ‘‘ఒకప్పుడు నాకేం అవ్వాలో తెలిసేది కాదు. అమ్మ, అన్నయ్యలు అడిగితే ఏం చెప్పాలో తెలిసేది కాదు. అన్నయ్య కష్టపడి సినిమాలు చేస్తుంటే నేను యోగా, ధ్యానం చేస్తూ, వాటి గురించే అన్నయ్యకు చెప్పేవాణ్ణి. ‘కష్టపడే అన్నయ్య.., వేళకి అన్నంపెట్టే వదిన ఉంటే ఎవరైనా ఇలానే మాట్లాడతారు’ అని అన్నయ్య అన్నారు. ఆ మాటలే నాకు కనువిప్పు అయ్యాయి. దేవుణ్ణి గుండెల్లో పెట్టుకోవాలి.. అలాగని బాధ్యతలను విస్మరించకూడదని తెలుసుకున్నాను. ఆరోజు అన్నయ్యగారు చెప్పిన మాటలు జీవితాంతం గుర్తుంచుకుని, తుది శ్వాస వరకు కష్టపడతాను. ‘ఖుషీ’ టైమ్‌లో ‘అన్నా ఒక్క హిట్ ఇవ్వు అన్నా.. రోడ్ల మీద తిరగలేకపోతున్నాం. చచ్చిపోతున్నాం’ అని అభిమానులు అడిగేవాళ్లు. ఆ ప్రేమకు కదిలిపోయేవాణ్ణి. నేను నాకోసం ఆ భగవంతుణ్ణి ఎప్పుడూ ఏదీ కోరుకోలేదు. కానీ, మొట్టమొదటిసారి ‘ఒక్క హిట్ ఇవ్వు. సినిమాల నుంచి వెళ్లిపోతా’ అని కోరాను. హిట్ ఇచ్చాడు. సినిమాల నుంచి ఎప్పుడు వెళ్లిపోవాలో ఆ దేవుడు నిర్ణయిస్తాడు. ‘ఖుషి’ ప్రివ్యూ చూస్తున్నప్పుడు ఎందుకో... రానున్న రోజులన్నీ నాకు కష్టాలే అనే భావన కలిగింది. ఆ వెంటనే.. ఇంకోటి కూడా అనిపించింది. ఏం చేయాలో తెలియక, నా స్నేహితుడు ఆనంద్‌సాయితో కలిసి శ్రీశైలం పారిపోవాలనుకున్న నన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసి, ఇంతమంది అభిమానం పొందేలా చేసిన ఆ భగవంతుడు చూసుకుంటాడనుకున్నాను. జయాపజయాలు రెండూ ఆ భగవంతుడి చేతుల్లో ఉన్నాయి. నా చేతుల్లో ఉన్నది శ్రమ, కృషి. ఆ రెంటినీ బాగా చేస్తాను. సినిమాల్లోకి రాకముందే నాకు వెంకటేశ్‌గారితో మంచి అనుబంధం ఉంది. ఆయన్ను సోదరుడిలా భావిస్తాను. నేను మామూలుగా ఎవరి ఇంటికీ వెళ్లను. కానీ, వెంకటేశ్‌గారి ఇంటికే వెళతాను. సినిమాలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా నేను కలిసే వ్యక్తి వెంకటేశ్‌గారు . మేం ఇద్దరం కలిస్తే, సినిమాల గురించి తక్కువ మాట్లాడతాం. ఆధ్యాత్మికత గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. బహుశా అదే మా ఇద్దరితో ఈ సినిమా చేయించిందేమో’’ అన్నారు. ఈ వేడుకలో చిత్రబృందం కూడా పాల్గొన్నారు. -
‘ఓ మైగాడ్’లో నయన?
కథానాయికలు డేట్స్ ఇవ్వడం, అనివార్య కారణాల వల్ల సినిమా ఆలస్యమైతే... సదరు నిర్మాతలు ఆ డేట్స్‌ని వేరే సినిమాకు ఉపయోగించుకోవడం అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. ఇటీవల నయనతార విషయంలో అదే జరిగిందట. వివరాల్లోకెళితే.. వెంకటేశ్-మారుతి కాంబినేషన్లో రూపొందాల్సిన ‘రాధ' చిత్రంలో నయనతార కథానాయికగా నటించాల్సి ఉంది. కానీ... కొన్ని కారణాల వల్ల ‘రాధ' సెట్స్‌పైకి వెళ్లలేదు. దాంతో నయన డేట్స్‌ని వృధా చేయలేని నిర్మాత డీవీవీ దానయ్య... వెంకటేశ్ హీరోగా రూపొందనున్న ‘ఓ మై గాడ్’ రీమేక్‌కి ఆ డేట్స్‌ని ఇచ్చేశారట. ఇది సినీవర్గాల్లో వినిపిస్తున్న తాజా వార్త. కిషోర్‌కుమార్(డాలీ) దర్శకత్వంలో డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్ కలిసి నిర్మించనున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ ప్రత్యేక పాత్ర పోషించనున్న విషయం తెలిసిందే. మాతృక పరంగా చూస్తే.. ఈ భారీ మల్టీస్టారర్‌కి కథానాయికతో పనిలేదు. అయితే... కథలో జనరంజకమైన కొన్ని మార్పులు చేసి వెంకటేశ్‌కి జోడీగా నయనతారను నటింపజేస్తున్నారట దర్శకుడు డాలీ. ఇందులో నయన పాత్రను భిన్నంగా డిజైన్ చేస్తున్నట్లు తెలిసింది. నటిగా ఆమెను మరో స్థాయిలో కూర్చోబెట్టేలా ఈ పాత్ర ఉంటుందని వినికిడి. ‘రాధ' మిస్సయినా.. ‘ఓ మైగాడ్’తో అద్భుతమైన ఛాన్స్ కొట్టేసి నయనతార లక్కీ హీరోయిన్ అనిపించుకున్నారన్నది ఫిలింనగర్ టాక్. -
గబ్బర్‌సింగ్ మళ్లీ గుర్రం ఎక్కుతున్నాడు!
‘ఓ మైగాడ్’ తెలుగు రీమేక్‌లో పవన్‌కల్యాణ్ నటించనున్నారు. ఇటీవల ఈ వార్త వెలుగు చూసింది. అంతకు ముందే.. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారితో పవన్ భారీ డీల్ కుదుర్చుకున్నారని, ఆ సంస్థ నిర్మించబోయే చిత్రాల్లో పవన్ నటించబోతున్నారని ఓ వార్త మీడియాలో హంగామా చేసింది. పవర్‌స్టార్‌ని కేంద్రంగా చేసుకుని పుట్టుకొస్తున్న ఈ వార్తల మధ్య ‘గబ్బర్‌సింగ్-2’ నిజంగా నలిగిపోతున్నాడు. అసలు ఆ సినిమా ఉన్నట్టా? లేనట్టా? స్క్రిప్ట్ వర్క్ మొదలైంది. సంపత్‌నందిని దర్శకునిగా తీసుకున్నారు. మరి ఉన్నట్లుండి పవన్‌కి ఈ కొత్త కమిట్మెంట్లేంటి? ఇప్పుడు ఫిలింనగర్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఎట్టకేలకు ఆ చర్చకు తెర పడింది. ‘గబ్బర్‌సింగ్’ రెండోసారి గుర్రం ఎక్కేస్తున్నాడు. ఈ నెలలోనే ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి నిర్మాత శరత్ మరార్ సన్నాహాలు చేస్తున్నారు. మార్చిలో కానీ, ఏప్రిల్‌లో కానీ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. వీలైతే... ‘ఓ మైగాడ్’ తెలుగు రీమేక్‌కు సమాంతరంగా ‘గబ్బర్‌సింగ్-2’ షూటింగ్‌ను కూడా జరపాలని శరత్ మరార్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
హీరోయిన్ కోసం వెయిటింగ్!
‘అత్తారింటికి దారేది’ సినిమా మరో మూడు రోజుల్లో వంద రోజులు పూర్తి చేసుకోబోతోంది. కానీ ఇంతవరకూ పవన్ కల్యాణ్ కొత్త సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ‘రచ్చ’ ఫేమ్ సంపత్ నంది ఇప్పటికే శక్తిమంతమైన స్క్రిప్టు సిద్ధం చేశారు. ‘గబ్బర్ సింగ్’కి ఇది సీక్వెల్ అని ప్రచారం జరుగుతోంది. పవన్‌కల్యాణ్‌కి సన్నిహితుడైన శరత్ మరార్ ఈ చిత్రానికి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకునిగా, జయనన్ విన్సెంట్ ఛాయాగ్రాహకునిగా ఖరారయ్యారు. ఒక్క కథానాయిక మినహా ఇతర తారాగణం, సాంకేతిక బృందం ఎంపిక ఓ కొలిక్కి వచ్చేసింది. సరైన కథానాయిక కోసం చిత్రబృందం గత కొంతకాలంగా తలమునకలై ఉంది. మొదట్లో పాపులర్ బాలీవుడ్ కథానాయికల పేరు వినిపించింది కానీ, కొత్త హీరోయిన్ కోసమే అన్వేషిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం ముంబైలో ఆడిషన్స్ జరుగుతున్నాయి.