పవన్‌తో మళ్లీ... | Shruti Haasan to romance Pawan Kalyan in SJ Suryah's film? | Sakshi
Sakshi News home page

పవన్‌తో మళ్లీ...

Published Sat, May 14 2016 11:56 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్‌తో మళ్లీ... - Sakshi

పవన్‌తో మళ్లీ...

 ‘ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే..’ అంటూ ‘గబ్బర్‌సింగ్’లో శ్రుతీహాసన్‌ని ఉద్దేశించి పవన్ కల్యాణ్ పాడటం, ఆ పాటకు ఈ బ్యూటీ అందంగా అభినయించడం అందర్నీ ఆకట్టుకుంది. ఈ జంటకు మంచి మార్కులు పడ్డాయి కూడా. మరోసారి ఈ ఇద్దరూ తెరపై కనిపించనున్నారు. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎస్.జె. సూర్య దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా శరత్ మరార్ నిర్మిస్తున్న చిత్రం ఇటీవల ఆరంభమైన విషయం తెలిసిందే. ఇందులో కథానాయికగా శ్రుతీహాసన్‌ని ఎంపిక చేశారు. ఈ చిత్రానికి కథ-మాటలు: ఆకుల శివ, సినిమాటోగ్రఫీ: సౌందరరాజన్, సంగీతం: అనూప్ రూబెన్స్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement