కొత్త టైటిల్... ‘కడప కింగ్’? | Pawan Kalyan's next titled 'Kadapa King'? | Sakshi
Sakshi News home page

కొత్త టైటిల్... ‘కడప కింగ్’?

Published Sat, Jun 18 2016 10:30 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

కొత్త టైటిల్... ‘కడప కింగ్’? - Sakshi

కొత్త టైటిల్... ‘కడప కింగ్’?

 ‘‘ ‘గాంధీ’ సినిమా ఇండియాలో వంద రోజులు ఆడదు. అదే ‘కడప కింగ్’ అని తీయండి.. టు హండ్రెడ్ సెంటర్స్... హండ్రెడ్ డేస్’’ అంటూ ‘పోకిరి’ చిత్రంలో షాయాజీ షిండే చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయింది. ఇప్పుడా ప్రస్తావన ఎందుకు అనుకుంటున్నారా? మరేం లేదు. పవన్‌కల్యాణ్ హీరోగా ఎస్‌జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రానికి ‘కడప కింగ్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది.
 
  నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రంలో పవన్ ఫ్యాక్షన్ లీడర్‌గా కనిపించ నున్నారనేది కృష్ణానగర్ వర్గాల భోగట్టా. తొలుత ఈ చిత్రానికి ‘సేనాపతి’ టైటిల్ పెట్టనున్నారనే పుకార్లు వినిపించాయి.
 
 ఆ తర్వాత  ‘హుషారు’ టైటిల్ షికారు చేసింది. ఇప్పుడేమో ‘కడప కింగ్’ టైటిల్‌ని రిజిస్టర్ చేయించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాయల సీమ ఫ్యాక్షన్ నేపథ్యం కావడంతో ఈ టైటిల్ పెట్టాలను కున్నారట. ఈ పుకార్ల మాటెలా ఉన్నా, అధికారికంగా అసలు టైటిల్ ఏదో తెలియాలంటే ఓపిక పట్టాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement