పవన్ సినిమా టైటిల్ 'కాటమరాయుడు'..? | Pawan Kalyan Next movie title Karama ratudu | Sakshi
Sakshi News home page

పవన్ సినిమా టైటిల్ 'కాటమరాయుడు'..?

Published Tue, Aug 30 2016 12:31 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్ సినిమా టైటిల్ 'కాటమరాయుడు'..? - Sakshi

పవన్ సినిమా టైటిల్ 'కాటమరాయుడు'..?

సర్థార్ గబ్బర్సింగ్ సినిమాతో నిరాశపరిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్వరలో ఓ మాస్ యాక్షన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ముందుగా ఈ సినిమాను తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కించాలని భావించినా.. సూర్య నటుడిగా బిజీ కావటంతో డాలీని దర్శకుడిగా తీసుకున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా తమిళ సూపర్ హిట్ వీరంకు రీమేక్గా రూపొందనుందన్న టాక్ వినిపిస్తుంది. అయితే కేవలం మూల కథను తీసుకొని పవన్ ఇమేజ్కు, తెలుగు నేటివిటికీ తగ్గట్టు మార్పులు చేశారట. ఇన్నాళ్లు ఈ సినిమాకు కడప కింగ్ అనే టైటిల్ను పరిశీలించిన చిత్రయూనిట్. తాజాగా కాటమరాయుడు అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట.

పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా అత్తారింటికి దారేదిలో పవన్ స్వయంగా పాటిన కాటమ రాయుడా పాట నుంచి తీసుకున్న ఈ టైటిల్ ఆడియన్స్ కు త్వరగా చేరువయ్యే ఛాన్స్ ఉందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. త్వరలోనే ఈసినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement