Kishore Kumar
-
దేశం పాడిన గాయకుడు
కిశోర్ కుమార్ మీద సంజయ్ గాంధీ కినుక వహించాడు. ‘ఇరవై సూత్రాల పథకం’ ప్రచారం కోసం దూరదర్శన్ లో మొదలెట్టిన ‘గీతోం భరీ షామ్’లో పాడమని కిశోర్‌ని సంజయ్ గాంధీ ఆదేశించాడు. డబ్బులు లేకుండా కిశోర్ పాడడు. ఆదేశిస్తే అసలు పాడడు. దాంతో కిశోర్ గొంతుకు రేడియోలో తాళం పడింది. సినిమాల్లో పాడిస్తే ఏం గొడవోనని నిర్మాతలు వెనక్కి తగ్గారు. ‘ఆరాధన’ సూపర్ హిట్ తర్వాత కిశోర్‌కు వచ్చిన తిప్పలు ఇవి. అప్పుడు కొంతమంది రఫీ దగ్గరకు వచ్చి ‘కిశోర్‌కు శాస్తి జరిగింది. ఈ కాలాన్ని ఉపయోగించుకోండి’ అన్నారు. రఫీ ఏం మాట్లాడలేదు. ఢిల్లీ వెళ్లి సంజయ్‌ను కలిశాడు. ‘మీరు కిశోర్ మీద బ్యాన్ ఎత్తేయండి. అందుకు బదులుగా ఒకటి కాదు పది ప్రోగ్రామ్‌లు చేసిస్తాను’ అన్నాడు. ఆ వెంటనే నౌషాద్‌ను వెంటబెట్టుకుని దూరదర్శన్‌లో ప్రోగ్రామ్ ఇచ్చాడు. కిశోర్ బ్యాన్ పోయింది.పత్రికలు కూడా కిలాడీవి. రాజేష్ ఖన్నా స్టార్డమ్తో కిశోర్ గొంతు గిరాకీలోకి రాగానే ‘రఫీ పని అయిపోయింది’ అని రాయడం మొదలెట్టారు. రికార్డింగులు లేక రఫీ గోళ్లు గిల్లుకుంటున్నాడని రాశారు. కిశోర్ తైనాతీలు ఇవన్నీ తెచ్చి కిశోర్‌కి చూపించారు. కిశోర్ సంతోషించాడా? ప్రెస్‌మీట్ పెట్టి ‘ఇలాంటి వెధవ రాతలు మానండి. ఆయనంటే నాకు చాలా గౌరవం. మీరు ఎవర్ని గెలిపించి ఎవర్ని ఓడిస్తారు?’ అన్నాడు. ఈ ఇద్దరిని కొంతమంది ఫలానా మతం అనుకుంటారు. ఈ ఇద్దరు మాత్రం ఈ దేశవాసులు. రామ్, రహీమ్‌ల సన్మతి ఎరిగినవారు.రంజాను మాసంలో రికార్డింగుకు వచ్చి ‘హుక్కే మే ధువా’ (హుక్కా పొగ) అనే పదం చూసి పాడనన్నాడు రఫీ ఉపవాసానికి భంగమని. మతం అంటే అంత నిష్ఠ. సాటి మతం పట్ల? అంతే నిష్ఠ. ‘మన్ తర్పత్ హరి దర్శన్ కో ఆజ్’.... ‘బైజూ బావరా’లో రఫీ పాడితే కన్నీరు ఆగదు వినేవారికి. ఆ కాలంలో అనేక ఆలయాల్లో ఇది ప్రభాతగీతం. దీనిని పాడింది, రాసింది, స్వరం కట్టింది... రఫీ, షకీల్ బదాయునీ, నౌషాద్. ‘నా గొంతు రొటీన్ అవుతోంది. నాకు భజనలు పాడాలని ఉంది’ అని రఫీ వస్తే ఖయ్యాం ఆ కోరిక మన్నించి భజనలు పాడించి అపురూపమైన రికార్డు విడుదల చేశాడు. ‘రఫీ గొంతులో దేవుడు ఉన్నాడు’ అని అందరూ అనేవారే. ఆ దేవుడు అల్లాయా, ఈశ్వరుడా వెతకడం అల్పుల పని.1950–70ల మధ్య మన దేశ సినీ సంగీతం దాదాపు అన్ని భాషల్లో స్వర్ణయుగం చూసింది. సినిమా – దేశవాసులను కలిపే కొత్త మతం అయ్యింది. కళాకారులు వినోద ఉల్లాసాలకే కాదు సామ రస్య, సౌభ్రాతృత్వాలకు ప్రవక్తలుగా మారారు. దేశ విభజన చేదు నుంచి జనాన్ని బయట పడేయడానికి గుర్తెరిగి బాధ్యతగా నడుచుకున్నవారే అందరూ! ‘తూ హిందు బనేగా నా ముసల్మాన్ బనేగా ఇన్సాన్ కీ ఔలాద్ హై ఔలాద్ బనేగా’... (నువ్వు హిందువువి కావద్దు, ముసల్మానువి కావద్దు, మనిషిగా పుట్టినందున మనిషిగా మిగులు) అని సాహిర్ రాయగా రఫీ పాడి చిరస్మరణీయం చేశాడు. మదన్ మోహన్ ట్యూన్ చేసిన ‘కర్‌చలే హమ్ ఫిదా’... రఫీ పాడితే నేటికీ సరిహద్దు సైనికులకు తేజోగీతమే. గాంధీజీని బలిగొన్నారన్న వార్త తెలియగానే సంగీత దర్శకులు హన్స్‌లాల్–భగత్రామ్, గీతకర్త రాజేంద్ర కిషన్ కలిసి ఆయనకు నివాళిగా ‘సునో సునో అయ్ దునియావాలో బాపు కీ ఏ అమర్ కహానీ’ రూపొందిస్తే ఇంకెవరు పాడతారు రఫీ తప్ప! బాపు పాదాల ఎదుట పారిజాతాల కుప్ప గదా ఈ పాట.సరళత్వము, తీయదనము, స్వచ్ఛత... వీటిని ప్రదర్శించడం ద్వారా ముప్పై ఏళ్ల పాటు పాడి కోట్ల మంది అభిమానులను పొందిన అమృత గాయకుడు రఫీ. ‘సుహానీ రాత్ ఢల్ చుకీ, ‘చౌద్వీ కా చాంద్ హో’, ‘బహారో ఫూల్ బర్సావో’, ‘ఓ దునియా కే రఖ్వాలే’, ‘ఖోయా ఖోయా చాంద్’, ‘దీవానా హువా బాదల్’, ‘క్యా హువా తేరా వాదా’... ఈ పాటలకు అంతూ పొంతూ ఉందా? కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు... ఏ ప్రాంతమో ఏ భాషో... అందరూ రఫీ అభిమానులు. రోజువారీ పనిలో, కాయకష్టంలో, సేద తీరే వేళ, వేడుకల్లో రఫీ.. రఫీ... రఫీ! కూతురిని అత్తారింటికి సాగనంపేటప్పుడు ప్రతి తండ్రి తలుచుకుని ఉద్వేగాశ్రువులు రాల్చే పాట ‘బాబుల్ కి దువాయే లేతీ జా’... షంషాద్ బేగం, గీతాదత్, లతా, ఆశా... అందరూ రఫీకి జోడీలే. దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్, షమ్మీ కపూర్, అమితాబ్... అందరూ అభినయకర్తలే. రఫీ పాడటంతో సగం నటన. మిగిలిన సగమే వీరు చేయాల్సి వచ్చేది.55 ఏళ్లకు మరణించాడు రఫీ. రేపటి డిసెంబర్ 24కు శత జయంతి. అయినా ఇన్నాళ్లకూ కాసింత కూడా మరపునకురాని సుర గాయకుడు. పాటనూ, ప్రేమనూ పంచి అందరి చేత ‘రఫీ సాబ్’ అనిపించుకున్నవాడు. ఆయన మృతదేహం ఆస్పత్రిలో ఉంటే ‘భూపిందర్ సింగ్ – రఫీ తమ్ముడు’ అని సంతకం పెట్టి ఇంటికి చేర్చిన గాయకుడు భూపిందర్ది ఏ మతం? చనిపోయిన అన్న రఫీది ఏ మతం? ఆ రోజు ఆకాశం నుంచి ఆగని వర్షం. ఇసుక వేస్తే రాలని జనం. గాంధీ గారు మరణించినప్పుడు ఇంత జనం వచ్చారట. రఫీ శత జయంతి ముగియనున్న ఈ వేళ అందరం వెలికి తీయవలసింది, జాగృత పరచవలసినది ఆయన పంచిన ఈ ప్రేమనే, ప్రేమమయ గీతాలనే! విద్వేష గీతాన్ని ఎవరు ఆలపించాలనుకున్నా కావలించుకుని వినిపిద్దాం రఫీ గీతం – జిందాబాద్ జిందాబాద్ అయ్ మొహబ్బత్ జిందాబాద్. జీతే రహో రఫీ సాబ్! అభీనా జావో ఛోడ్కర్ కె దిల్ అభీ భరా నహీ... -
కిశోర్‌కుమార్ బయోపిక్‌లో..?
ప్రముఖ దివంగత గాయకుడు– నటుడు కిశోర్ కుమార్ బయోపిక్ కోసం హిందీ చిత్ర పరిశ్రమలో కొంతకాలంగా సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కిశోర్ కుమార్‌గా ఎవరు నటిస్తారనే విషయంపై స్పష్టత రావడం లేదు. పైగా ఎప్పటికప్పుడు పేర్లు మారుతున్నాయి. తొలుత అక్షయ్ కుమార్ పేరు వినిపించింది. ఆ తర్వాత రణ్‌బీర్ కపూర్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆమిర్ ఖాన్ పేరు బీ టౌన్లో గట్టిగా వినిపిస్తోంది. కిశోర్ కుమార్ బయోపిక్కు అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తారని, భూషణ్ కుమార్ నిర్మిస్తారని ఎప్పట్నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ బయోపిక్ గురించి ఇటీవల ఆమిర్ ఖాన్ – అనురాగ్ బసుల మధ్య చర్చలు జరిగాయని, త్వరలోనే ఈ ్ర΄ాజెక్ట్ గురించి ఓ అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉందని భోగట్టా. మరోవైపు ‘చార్ దిన్ కీ జిందగీ, గజిని 2, ఉజ్వల్ నికమ్ బయోపిక్, ఓ సూపర్ హీరో ఫిల్మ్ (దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో) చిత్రాలు కూడా ఆమిర్ ఖాన్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. మరి... ఆమిర్ ఖాన్ నెక్ట్స్ ్ర΄ాజెక్ట్ ఏంటి? అనే ప్రశ్నకు సమాధానం కావాలంటే కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఇక ఆమిర్ నటించిన ‘సితారే జమీన్ పర్’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
చిరు, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడు ఆవేదన
'కేరాఫ్ కంచరపాలెం' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు.. చిరంజీవి, పవన్ కల్యాణ్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీటి వల్ల తనకు అన్యాయం జరిగిందని పరోక్షంగా ఆవేదన వ్యక్తం చేశాడు. షూటింగ్ జరిగిన తర్వాత కూడా తన సీన్స్ ఎందుకు తీసేశారో అర్థం కాలేదని అన్నాడు. ఈ విషయంలో చాలా బాధపడ్డానని కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారిపోయాయి.(ఇదీ చదవండి: వీడియో: గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్)వైజాగ్‌కి చెందిన కిశోర్ కుమార్.. 'కేరాఫ్ కంచరపాలెం'తో నటుడిగా మారాడు. ఈ సినిమాలో వినాయకుడి బొమ్మలు చేసే మూగవాడిగా నటించింది ఇతడే. ఈ చిత్రం తర్వాత పలు చిత్రాల్లో సహాయ పాత్రలు చేశాడు. రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'లో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. అయితే చిరు 'ఆచార్య', పవన్ 'భీమ్లా నాయక్' చిత్రాల విషయంలో తనకు అన్యాయం జరిగిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 'ఆచార్య సినిమా కోసం 20 రోజులు షూటింగ్లో పాల్గొన్నాను. బాగా చేశానని చిరంజీవి కూడా మెచ్చుకున్నారు. భుజంపై చేయివేసి మరీ మాట్లాడేవారు. తీరా మూవీ విడుదలయ్యాక నా సీన్స్ కనిపించలేదు. ఎడిటింగ్‌లో తీసేశారు. 'భీమ్లా నాయక్' కోసం ఓ రోజు షూటింగ్‌కి వెళ్లాను. మధ్య గ్యాప్ వచ్చింది. తర్వాత నా బదులు వేరే నటుడిని ఆ పాత్ర కోసం తీసుకున్నారు. ఎందుకలా చేశారో అర్థం కాలేదు. ఈ విషయాల్లో చాలా బాధపడ్డాను' అని నటుడు కిశోర్ కుమార్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: పవన్ విద్యార్హతపై పూటకో మాట.. పిఠాపురం నామినేషన్లో తేటతెల్లం) -
50 ఏళ్లు ఏం చేయనోళ్లు.. ఇప్పుడేం చేస్తారు?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘యాభై ఏళ్లు అధికారం ఇస్తే ఏమీ చేయనోళ్లు ఇప్పుడొచ్చి ఏం చేస్తారు? వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దు’ అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఓటేసి ఆయన్ని మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో గురువారం పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌కుమార్ అధ్యక్షతన జరిగిన తుంగతుర్తి నియోజకవర్గ ప్రగతి నివేదన సభలో ప్రసంగించారు. కేసీఆర్‌ను దించాలనే వాళ్ల దగ్గర జవాబేదీ? ‘కేసీఆర్‌ను దించడమే లక్ష్యమని ఒకరు.. కేసీఆర్‌ను జైల్లో పెట్టాలని మరొకరు మాట్లాడుతున్నారు. ఎందుకు దించాలో, ఎందుకు జైల్లో పెట్టాలో అడిగితే ఒక్కరి దగ్గరా సమాధానం లేదు. అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నందుకు, 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నందుకు, లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నందుకు, నేడు పోడు భూములకు పట్టాలు ఇస్తున్నందుకు కేసీఆర్‌ను జైల్లో పెట్టాలా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. గత 9 ఏళ్ల కాలంలో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. తెలంగాణ యావత్ దేశానికే ధాన్య భాండాగారం అయితే తెలంగాణలో నల్లగొండ ఉమ్మడి జిల్లా ధాన్య భాండాగారంగా మారిందన్నారు. పదిసార్లు అవకాశం ఇస్తే ఏం చేశారు? ‘2014కు ముందు కరెంటు ఉంటే వార్త. నేడు కరెంటు పోతే వార్తలా మారింది. దేశంలో ఎక్కడా లేనట్లుగా రైతుబంధు, రైతుబీమాతోపాటు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తూ అదనంగా రూ. 12 వేల కోట్ల భారం ప్రభుత్వం భరిస్తోంది. 50 ఏళ్లు అధికారంలో ఉండి ఫ్లోరైడ్‌ను రూపుమాపలేని కాంగ్రెస్ దద్దమ్మలు నేడు కేసీఆర్ దిగిపోవాలని మాట్లాడుతున్నారు.. చూస్తూ ఊరుకుందామా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. 67 ఏళ్ల పాలనలో 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజలను పట్టించుకోలేదని, అలాంటి వారు వచ్చి నేడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. పదిసార్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్ నేతలు ఏం చేశారని... గుడ్డి గుర్రానికి పళ్లు తోమారా అంటూ కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. సంక్షేమ పథకాలు పొందుతున్న ప్రజలంతా ఆలోచించాలన్నారు. ‘కర్ణాటక, గుజరాత్ల నుంచి కాంగ్రెసోళ్లు, బీజేపోళ్లు డబ్బులు తెచ్చి ఇస్తారు. తీసుకొని జేబులో పెట్టుకోండి. కానీ ఓటు మాత్రం కిషోర్ కారు గుర్తుకే వేయాలని, సీఎం కేసీఆర్‌ను మూడోసారి అధికారంలోకి తీసుకురావాలని కేటీఆర్ కోరారు. కాంగ్రెస్ తీరుపై కేటీఆర్ పిట్టకథ.. ‘ఒక ఊర్లో ఓ 15 ఏళ్ల పిల్లాడు చెడు అలవాట్లకు బానిసై తాగుబోతు, తిరుగుబోతు అయ్యాడు. ఓ రోజు మత్తులో తండ్రి జేబులోంచి డబ్బు కొట్టేస్తుండగా తల్లి చూసి ఇంట్లోనే దొంగతనం చేస్తావా అంటూ కొడుతుంది. మత్తులో ఉన్న పిల్లాడు రోకలిబండతో తల్లిని కొట్టి చంపుతాడు. అది చూసిన తండ్రి పిల్లాడిని కొడితే తండ్రిని కూడా రోకలిబండతో కొట్టి చంపేస్తాడు. పోలీసులు ఆ బాలుడిని జడ్జి ముందుకు తీసుకెళ్లగా జడ్జి స్పందిస్తూ నేను ఎందరో లుచ్ఛాలను, లంగాలను, చివరకు రేవంత్‌రెడ్డిని కూడా చూశాను. కానీ నీ అంత గలీజ్గాడిని చూడలేదు. తల్లిదండ్రులను చంపిన నీకు ఏం శిక్ష వేయాలో అర్థం కావట్లేదు... నువ్వే చెప్పు అని అడగ్గా ఆ పిల్లాడు నేను తల్లిదండ్రులు లేని అనాథను.. నన్ను విడిచిపెట్టండి సార్ అన్నాడంట.. కాంగ్రెసోళ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. నిరూపిస్తే క్షమాపణలకు సిద్ధం: మంత్రి జగదీశ్‌రెడ్డి నల్లగొండ జిల్లాలో అభివృద్ధి జరగలేదని నిరూపించగలిగితే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. జరిగిన ప్రగతిని నిరూపిస్తే కాంగ్రెస్ నాయకులు తుంగతుర్తి నుంచి ఢిల్లీ వరకు ముక్కులు నేలకు రాస్తారా? అని సవాల్ విసిరారు. -
కేజీయఫ్ ఓ చెత్త సినిమా: ‘కాంతార’ నటుడు సంచలన కామెంట్స్
కేజీయఫ్ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కేజీయఫ్ చాప్టర్ 1 ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది. దీనికి సీక్వెల్‌గా గతేడాది విడుదలైన కేజీయఫ్ చాప్టర్ 2 కలెక్షన్ల సునామీ సృష్టించింది. చెప్పాలంటే కన్నడ చిత్ర పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ఇది. వరల్డ్ వైడ్ దాదాపు రూ. 12 50 కోట్లు పైగా వసూళు చేసింది. ఈ చిత్రంతో హోంబాలే ఫిలింస్ నిర్మాణ సంస్థ మంచి గుర్తింపు వచ్చింది. చదవండి: రూ. 100 కోట్ల క్లబ్‌లోకి ధమాకా.. రవితేజ కెరీర్లోనే తొలి రికార్డు! ఇక ఇదే బ్యానర్లో వచ్చి మరో సంచలనం సృష్టించిన సినిమా కాంతార. ఓ ప్రాంతీయ చిత్రంగా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చిచుకుంది. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈచిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 400 కోట్లు సాధించింది. తాజాగా ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన నటుడు కిశోర్ కుమార్ కేజీయఫ్ మూవీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేజీయఫ్ ఓ చెత్త సినిమా అని పేర్కొన్నాడు. రీసెంట్గా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో అతడు మాట్లాడుతూ.. కేజీయఫ్ చిత్రంపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. చదవండి: అందుకే నా ట్విటర్ అకౌంట్‌ను నిలిపివేశారు: నటుడు కాంతారతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు కేజీయఫ్ మూవీపై ప్రశ్న ఎందురైంది. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘కేజీయఫ్ మూవీ నేను ఇంతవరకు చూడలేదు. ఇది సరైన పోలికో కాదో తెలియదు. అది నా టైప్ సినిమా కాదు. ఇది నా వ్యక్తిగత విషయం. ఇలాంటి ఓ చెత్త సినిమా కంటే పెద్దగా సక్సెస్ కానీ సీరియస్ అంశాన్ని డీల్ చేసే ఓ చిన్న సినిమా చూస్తాను ’ అంటూ తన అభిప్రాయం చెప్పుకొచ్చాడు. కాగా తెలుగులో ‘హ్యాపీ’, నాని ‘భీమిలి కబడ్డీ జట్టు’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కిశోర్ కుమార్ రీసెంట్గా పొన్నియన్ సెల్వన్, కాంతార, షీ వెబ్ సిరీస్ సీజన్ 2లో నటించాడు. ప్రస్తుతం ‘రెడ్ కాలర్’ అనే హిందీ సినిమా చేస్తున్నాడు. -
అందుకే నా ట్విటర్ అకౌంట్‌ను నిలిపివేశారు: నటుడు
‘కాంతార’ నటుడు కిశోర్ కుమార్ ట్విటర్ ఖాతాను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీనిపై నెటిజన్లు నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తన పోస్టుల కారణంగానే ట్విటర్ అతడి ఖాతాను సస్సెండ్ చేశారని కొందరు అంటుంటే, ట్విటర్ నిబంధనలు ఉల్లంఘించడమే కారణమని మరికొందరు అభిప్రాయం పడుతున్నాయి. ఇలా తన ట్విటర్ ఖాతా సస్పెండ్ కావడంపై తీవ్ర చర్చ జరుగుతున్న క్రమంలో తాజాగా కిషోర్ కూమార్ స్పందించాడు. చదవండి: ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పుడు నేను అనుకుంది చేయలేకపోయా: ప్రభాస్ తన ట్విటర్ అకౌంట్‌ను నిలిపివేయడానికి కారణమేంటో వివరిస్తూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ షేర్ చేశాడు. ‘నా అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారు. అందువల్లే నా ట్విటర్ నా అకౌంట్‌ను తొలగించింది. అంతేకాని నేను పెట్టిన పోస్ట్‌ల వల్ల కాదు. నా ట్విటర్ సస్పెన్షన్‌పై ఇప్పటికైన అనవసరమైన వాదనలను ఆపండి. నా పోస్ట్‌ల వల్ల దానిని నిలిపివేయలేదు. డిసెంబర్20న నా అకౌంట్ హ్యాక్ అయింది. దానికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని ట్విటర్ నాకు హామీ ఇచ్చింది’ అంటూ రాసుకొచ్చాడు. అలాగే ట్విటర్ తనతో జరిపిన సంప్రదింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను కూడా ఈ సందర్భంగా ఆయన షేర్ చేశాడు. చదవండి: సోనూసూద్.. తప్పుడు సందేశాలివ్వొద్దు!: నార్త్ రైల్వే ఆగ్రహం View this post on Instagram A post shared by Kishore Kumar Huli (@actorkishore) -
కాంతార నటుడికి షాకిచ్చిన ట్విటర్!
‘కాంతార’ నటుడు కిశోర్ కుమార్‌కి ట్విటర్ భారీ షాకిచ్చింది. నిబంధనలు ఉల్లంఘించారంటూ అతని ఖాతాను సస్పెండ్ చేసింది. అతని ఖాతాని ఓపెన్ చేయగా..‘నిబంధనలు ఉల్లంఘించిన ఖాతాను ట్వీటర్ సస్పెండ్ చేస్తుంది’అనే మెసేజ్ డిస్ప్లే అవుతోంది. అయితే కిశోర్ ఖాతాను నిలివివేయడానికి గల కారణాలు మాత్రం ఇప్పటికీ తెలియదు. కిశోర్‌కి ట్విటర్‌తో పాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ఖాతాలు కూడా ఉన్నాయి. ఇన్‌స్టాలో 43 వేల మంది, ఫేస్బుక్లో 66 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రాజకీయాలతో పాటు పలు అంశాలపై సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటాడు. ఇటీవల ‘కాంతార’దేవుడిని అవమానించిన ఓ వ్యక్తి మరణించారనే వార్త బాగా వైరల్ అయింది. దీనిపై కిశోర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘దేవుడు లేదా దెయ్యం అనేది మన నమ్మకం మాత్రమే. మీరు నమ్మితే, ఉంది, మీరు నమ్మకపోతే, లేదు. ఇలా కష్టకాలంలో ధైర్యాన్నిచ్చే నమ్మకాలను అవమానించాల్సిన పనిలేదు. అక్రమార్కులను శిక్షించేందుకు చట్టం ఉంది. వారి విశ్వాసం వారిది. విశ్వాసం కలిగి ఉండండి, మూఢనమ్మకం కాదు’అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే మీడియా సంస్థ ఎన్డీటీవీని అదానీ గ్రూప్ దక్కించుకోవడాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వ్యతిరేకించాడు. -
కిషోర్ కుమార్ 'బంగ్లా'లో రెస్టారెంట్ ప్రారంభించనున్న కోహ్లి!
ఆసియా కప్ 2022లో బిజీగా ఉన్న టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి త్వరలోనే రెస్టారెంట్ ప్రారంభించనున్నట్లు సమాచారం. ముంబై ప్రాంతంలో బాలీవుడ్ లెజెండరీ సింగర్ కిషోర్ కుమార్‌కు చెందిన బంగ్లాలో ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. కిషోర్ కుమార్‌కు చెందిన బంగ్లాలోని 'గౌరీ కుంజ్' పోర్షన్‌ను విరుష్క దంపతులు ఐదేళ్ల పాటు లీజుకు తీసుకోనున్నారు. కాగా విరాట్ కోహ్లి తన జెర్సీ నెంబర్ 18ను వన్8 కమ్యూన్ పేరిట తన స్వస్థలం ఢిల్లీతో పాటు కోల్‌కతా, పుణేలో రెస్ట్రోబార్స్ ఏర్పాటు చేశాడు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో.. ''జుహు, ముంబై.. కమింగ్ సూన్'' అంటూ హ్యాష్‌ట్యాగ్ జత చేశాడు. రెస్టారెంట్ ఏర్పాటుకు సంబంధించి లీజు, ఇతర పనులను కోహ్లి లీగల్ అథారిటీ సెల్ దగ్గరుండి పర్యవేక్షించనుంది. కోహ్లి ప్రారంభించబోయే రెస్టారెంట్‌పై త్వరలోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది. స్వతహగా వ్యాపార రంగంపై ఆసక్తి కనబరిచే కోహ్లి.. 'వన్8' బ్రాండ్ పేరిట ఇప్పటికే క్లాత్, షూస్, హాస్పిటాలిటీ రంగాలలో పెట్టుబడులు పెట్టి మంచి లాభాలు కూడా అందుకుంటున్నాడు. ఇటీవలే ''వ్రాంగ్'' బ్రాండెడ్ కంపెనీకి చెందిన ''క్లోతింగ్ అండ్ యాక్ససరీస్లకు'' సంబంధించిన పలు బ్రాండ్లలో కోహ్లి ఇన్వెస్ట్ చేశాడు. కిషోర్ కుమార్ బంగ్లాలో రెస్టారెంట్ ప్రారంభించాలన్న కోహ్లి ఆలోచనను కొంతమంది ప్రసంశించారు. ఇప్పటికే ఈ బంగ్లాకు ''ఐకానిక్ బంగ్లా'' అని పేరు ఉంది. దిగ్గజం కిషోర్ కుమార్ ఇక్కడున్న చెట్లకు పలు పేర్లు పెట్టినట్లు ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆయన వాడిన వింటేజ్ కార్లు, వస్తువులు ఇక్కడి మ్యూజియంలో పెట్టారు. కాగా కిషోర్ కుమార్ చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు అమిత్ కుమార్ తన కుటుంబంతో కలిసి ఇదే బంగ్లాలో నివసిస్తుండడం విశేషం. ఇక ప్రస్తుతం ఆసియాకప్‌లో బిజీగా ఉన్న కోహ్లి టీమిండియా తరపున మంచి ప్రదర్శనే కనబరుస్తున్నాడు. సెంచరీ చేయకపోయినా పాకిస్తాన్, హాంకాంగ్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. పాక్‌తో మ్యాచ్‌లో 35 పరుగులు చేసి ఔటైన కోహ్లి.. హాంకాంగ్‌తో మ్యాచ్‌లో 59 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. చదవండి: IND Vs AFG: టీమిండియాతో అఫ్గానిస్తాన్ మ్యాచ్.. కళ్లన్నీ ఆ యువతిపైనే! -
మతి చెడగొడుతున్న సెల్‌ఫోన్
సాక్షి, అమరావతి: ‘‘దేశవ్యాప్తంగా మానసిక జబ్బుల తీవ్రత పెరుగుతోంది. ఇది వర్తమానానికే కాదు భవిష్యత్‌కూ పెద్ద ప్రమాదమే. సెల్‌ఫోన్ పుణ్యమా అని మెదడు ఉచ్చులో ఇరుక్కుంది. సెల్ఫోన్లో ఏది కనిపిస్తోందో అదే నిజమనుకుంటున్నారు. దీంతో యువత ఆలోచనలు ఎదగకుండా ఆగిపోతున్నాయి. ఎప్పుడైతే భవిష్యత్ ఆగిపోయిందని తెలుసుకున్నారో.. అక్కడ్నుంచే మానసిక ఆందోళనలు మొదలవుతున్నాయి. ఇవి క్రమంగా మానసిక జబ్బులుగా మారి జీవితాన్ని కుచించుకుపోయేలా చేస్తున్నాయి’’ అని అంటున్నారు.. ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, నిమ్హాన్స్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్–బెంగళూరు) మాజీ ప్రొఫెసర్, కేంద్ర ప్రభుత్వంలో పాతికేళ్లపాటు మానసిక జబ్బులపై సేవలందించిన డా.కె.వి.కిషోర్ కుమార్. విజయవాడ వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మానసిక జబ్బులకు కారణాలనేకం.. 15 నుంచి 45 ఏళ్లలోపు వారు ఎక్కువగా మానసిక జబ్బుల బారిన పడుతున్నారు. వంశపారంపర్యం, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, మద్యం అలవాటే వీటికి కారణం. ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తిస్తే 90 శాతం మందిని సాధారణ స్థితికి తేవచ్చు. ఉమ్మడి కుటుంబాలన్నీ చిన్న కుటుంబాలుగా మారి మానసిక ప్రగతికి బ్రేకులు వేశాయి. చిన్న కుటుంబాల్లో పిల్లలకు తల్లిదండ్రులు ప్రేరణ కావడం లేదు. తోటి స్నేహితులే ప్రేరణగా నిలుస్తున్నారు. వారు మంచివారైతే వీరూ మంచివారవుతున్నారు.. లేదంటే చెడిపోతున్నారు. ఏటా లక్షల్లో పెరుగుతున్నారు.. ప్రపంచవ్యాప్తంగా వ్యాధులకు చేస్తున్న వ్యయంలో 12.5 శాతం మానసిక జబ్బులకే అవుతోంది. మన దేశంలో మానసిక రోగుల కోసం 20 వేల పడకలుంటే.. అందులో 5 వేల మంది పాతికేళ్ల నుంచి అక్కడే ఉంటున్నారు. ఏటా లక్షల్లో రోగులు పెరుగుతున్నారు. చిన్నతనం నుంచే పిల్లల పెరుగుదల, పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తన, వాతావరణం ఇవన్నీ కీలకం. నాలుగేళ్ల వయసులోనే సెల్‌ఫోన్ వాడకం గురించి తెలుసుకున్న పిల్లలను చూసి తల్లిదండ్రులు.. మా పిల్లలు చాలా గొప్ప అనుకుంటే ఎవరూ ఏమీ చేయలేరు. సెల్ఫోన్ల బారిన 25 ఏళ్ల లోపు యువత వయసు, మనసు, కెరీర్‌పరంగా ఎదిగే క్రమంలో సరిగ్గా 25 ఏళ్లలోపు యువతను సెల్ఫోన్లు నాశనం చేస్తున్నాయి. వారి విలువైన సమయాన్ని హరిస్తున్నాయి. ఆలోచించే సమయాన్ని లాగేసుకుంటున్నాయి. చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప వీటి నుంచి బయటపడటం కష్టం. దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా 13.5 శాతం మంది వివిధ మానసిక జబ్బులతో బాధపడుతున్నారు. వీరిలో వెయ్యికి 10 మంది తీవ్ర మానసిక జబ్బులతో కుంగిపోతున్నారు. దీంతో ఒక్కో రోగి వల్ల వారింట్లో నలుగురు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఏ రాష్ట్రంలోనూ ఇంత గొప్పగా లేదు మానసిక జబ్బులతో బాధపడుతూ ఇంట్లో లేకుండా ఆస్పత్రుల్లోనూ, వీధుల్లోనూ ఉంటున్న చాలామందికి చికిత్స చేసి తిరిగి ఇంటికి తేవడమే.. హోం అగైన్. దీనికోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత గొప్పగా మానసిక వ్యాధుల నియంత్రణకు కృషి చేస్తున్నారు. ఈ క్రతువులో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నేను కూడా బనియాన్ ఎన్జీవో సంస్థ ద్వారా కృషి చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఆస్పత్రుల నెట్వర్క్ చాలా బాగుంది. ఐదేళ్లు కష్టపడితే రాష్ట్రంలో 90 శాతం వ్యాధులను నియంత్రించొచ్చు. దీనివల్ల ఆర్థిక భారమూ తగ్గుతుంది. చదవండి: టీచర్ అవతారమెత్తిన కలెక్టర్ నివాస్ చిన్నారులను చెరబట్టాడు.. కోరిక తీర్చుకుని.. -
హోంగార్డుల జీతాలు పెంపు
-
హోంగార్డుల జీతాలు పెంపు
సాక్షి, అమరావతి : హోంగార్డుల జీతాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్ఎం కిషోర్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తాము అధికారంలోకి వచ్చాక హోంగార్డుల వేతనాలు పెంచుతామని వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయమై జూన్ 10వ తేదీన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో హోంగార్డుల వేతనం పెంపు నిర్ణయాన్ని ఆమోదించారు. ఈ నిర్ణయాన్ని అమలులోకి తెస్తూ ప్రస్తుతం ఉన్న రోజువారీ వేతనం రూ.600 నుంచి రూ.710కి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హోంగార్డుల నెలసరి జీతం రూ.18 వేల నుంచి రూ.21,300కు పెరుగుతుంది. పెంచిన వేతనం ఈ నెల 1వ తేదీ నుంచి అమలు కానుంది. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం డీజీపీకి ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హోంగార్డుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. 16,616 మంది హోంగార్డులకు మేలు కలుగుతుంది. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆంధ్రప్రదేశ్ హోంగార్డుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.గోవిందు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మేలును ఎప్పటికీ మరిచిపోలేమని చెప్పారు. -
ఏ జో హై జిందగీ..ఫ్యామిలీ సర్కస్
కోడలిని వేధించే అత్త ఉండదు.భర్తకు విషం కలిపి పెట్టే భార్య ఉండదు.ఆడపడుచును ఎలా వేధించాలా అని ఆలోచించే వదిన ఉండదు.అందమైన జీవితం ఉంటుంది. వాస్తవమైన సరదాల గిల్లికజ్జాల మధ్యతరగతి సంసారం ఉంటుంది. స్నేహం ఉంటుంది. సరదా ఉంటుంది.నిజంగా ఆ రోజులే వేరు. దూరదర్శన్ సీరియళ్ల రోజులే వేరు. ‘ఏ జో హై జిందగీ’ లాంటి సీరియల్స్ ఇప్పుడు లేవు నిప్పుల మీద ఉప్పు వేసినట్టు ఎప్పుడూ చిటపటలాడుతూ ఉండే దంపతులు మన ఇరుగింట్లోనో, పొరుగింట్లోనూ కనిపిస్తూనే ఉంటారు. వారిమధ్య నిత్యం ఏవో చిన్నా పెద్ద సమస్యలు, కాసింత గందరగోళం, కూసిన్ని సరదాలు, తగినంత ప్రేమ.. తోకటపాసుల్లా టప్ టప్మని పేలుతుంటాయి. రోజూ ఏదో ఒక సందర్భం కథలా నడుస్తూనే ఉంటుంది. దీనిని 35 ఏళ్ల క్రితమే బేస్‌గా తీసుకుంది దూరదర్శన్. అలా బుల్లితెర ఆలూమగలుగా రేణు–రంజిత్‌లు వీక్షకులకు పరిచయం అయ్యారు. దశాబ్దాలు దాటిపోతున్నా ఆ జంట వేసిన నవ్వుల పందిరి ఇంకా కళ్లను దాటిపోలేదు. వారిద్దరి మధ్య రకరకాల గందరగోళ సమస్యలు, సరదా సన్నివేశాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. దూరదర్శన్‌లో సీరియళ్లు మొదలైన తొలినాళ్లు అవి. అలాంటి రోజుల్లో మధ్యతరగతి భార్యాభర్తల జీవితంలోని సరదా సన్నివేశాలతో మొట్టమొదటి కామెడీ సిరియల్‌గా అందించింది బుల్లితెర. నటీ నటులు.. షరీప్ ఇనామ్దార్, స్వరూప్ సంపత్, రాకేష్ బేడి, సతీష్ షా , రచయిత షరాద్ జోషి, దర్శకులు కుందన్‌షా, మంజుల్ సిన్హా, రామన్ కుమార్‌లు కలిసి చే సిన హంగామా ఫన్ సీరియల్ ఏ జో హై జిందగీ. 1984లో ప్రతీ శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రేక్షకులను అలరించే ఈ సీరియల్‌కి టైటిల్ ట్రాక్ అందించినవారు కిశోర్‌కుమార్. దంపతులైన రంజిత్ వర్మ, రేణువర్మ ఆమె నిరుద్యోగి తమ్ముడు రాజా ఒక ఇంట్లో ఉంటారు. ఆలూ మగల ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దామా..! ఒకనాడు.. తమ పెళ్లిరోజును భర్త రంజిత్ గుర్తుపెట్టుకున్నాడో లేదో టెస్ట్ చేయాలనుకుంటుంది భార్య రేణు. రంజిత్ తమ పెళ్లిరోజును మరిచిపోయినట్లు నటిస్తాడు. రేణుకి కోపం వచ్చి లాయర్ని కలుస్తుంది విడాకుల కోసం. ఆ లాయర్‌కి అది మొదటి కేసు. ఒక అబద్ధపు విడాకుల పత్రాన్ని రంజిత్‌కి పంపించి బెదిరించాలనుకుంటుంది. తీరా సాయంత్రానికి రంజిత్ గిఫ్ట్‌తో రేణుని సర్ప్రైజ్ చేయడంతో ఇద్దరూ కలిసిపోతారు. ఇదో విడాకుల కహాని. మర్నాడు.. రేణు, రంజిత్ల ఇంటికి ఒక కొత్త సోఫాను తీసుకొస్తాడు సేల్స్‌మ్యాన్. పొరుగింట్లో ఇవ్వాల్సిన డెలివరీని సేల్స్‌మ్యాన్ పొరపాటున వీళ్ల ఇంట్లో ఇచ్చి వెళ్లిపోతాడు. అతిథులు వచ్చి సోఫాలో కూర్చుంటారు. ఆ సమయంలోనే పొరుగింటివాళ్లు వచ్చి అసలు విషయం చెప్పి, సోఫా తీసుకెళ్తామంటారు. అతిథుల ముందు పరువు పోగొట్టుకోలేక, పొరుగింటి వాళ్లను మేనేజ్ చేయడానికి రేణు, రంజిత్‌లు పడే పాట్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఒకరోజు.. పొరుగింటివాళ్లు రంజిత్, రేణుల ఇంటికి వచ్చి ‘మా అమ్మాయి కవితకి పెళ్లి చూపులు. మా ఇంట్లో సరైన స్థలం లేదు మీ ఇంట్లో ఏర్పాటు చేస్తాం చూపులు’ అంటే ‘సరే’ అంటారు. వరుడు, అతని తరపు వాళ్లు వచ్చాక పొరపాటున రేణుని వధువుగా పరిచయం చేస్తారు. వాళ్లూ రేణుయే పెళ్లికూతురు అనుకుంటారు. అయితే వరుడు కవితను ఇష్టపడతాడు. ఈ విషయం తెలియక తల్లిదండ్రులు తమ రెండో అబ్బాయికి కవితను ఇచ్చి చేయాలనుకుంటారు. ఇరుకుటుంబాల మధ్య పెద్ద గందరగోళం. చివరకు సమస్య పరిష్కారం అవడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. మరో రోజు.. రంజిత్ రొటీన్ మెడికల్ చెకప్‌కి డాక్టర్ వద్దకు వెళతాడు. మెడికల్ రిపోర్టులు చూసిన డాక్టర్ రంజిత్‌కు క్యాన్సర్ ఉందని, ఐదు రోజులకన్నా బతకడని బాధగా చెబుతాడు. రంజిత్ డిప్రెషన్‌కి గురవుతాడు. రేణుకి ఆమె తమ్ముడు రాజాకి ఈ విషయం చెప్పవద్దని నిర్ణయించుకుంటాడు. అయితే, వింతగా నటించడం మొదలుపెడతాడు. చివరకు నర్సు పొరపాటు కారణంగా రిపోర్టులు మారిపోయాయని డాక్టర్ ద్వారా నిజం తెలుస్తుంది. ఇంకోరోజు.. పొరుగింటి కవిత తాను తల్లిని కాబోతున్నాననే విషయం చెప్పి, పుట్టబోయే బిడ్డకు సాక్స్ అల్లి ఇవ్వమని అడుగుతుంది రేణుని. అలాగే అని చెప్పిన రేణు సాక్సులు అల్లుతుంటుంది. ఇది చూసిన రంజిత్ రేణు గర్భవతి అనుకుంటాడు. రంజిత్ తమ ఇంట్లోకి రాబోయే కొత్త ప్రాణి గురించి మాట్లాడుతుంటాడు. రేణు కొత్తగా వచ్చే కుక్క పిల్ల గురించి ఆలోచించి తనూ అదేవిధంగా మాట్లాడుతుంది. ఈ గందరగోళం చివరికెప్పటికో క్లియర్ అవుతుంది. ఇలాగే మొత్తం 67 వారాలు. సరదా సరదా సన్నివేశాలతో 67 ఎపిసోడ్లలో ప్రతీవారం అరగంటపాటు బుల్లితెర నిండుగా నవ్వుల జల్లులు కురిశాయి. ఈ షో విజయవంతం అవడం, ఆ తర్వాత కొన్నికారణాల వల్ల రంజిత్ పాత్రధారి ఇనామ్దార్ బయటకు వెళ్లిపోవడంతో సెకండ్ అటెమ్ట్గా రేణు తమ్ముడు రాజాతో కథను నడిపించారు. రంజిత్–రేణులు విదేశాలకు వెళ్లినట్టు, రాజా రంజిత్ బంధువులింట్లో ఉన్నట్టు, వారి కూతురు రశ్మి, పనిమనిషి, రాజా ప్రేమించే నివేదిత .. వీళ్లందరి మధ్య సాగే కథనాన్ని ఇందులో చూపించారు. రంజిత్–రేణులు 45 ఎపిసోడ్ల వరకు ఉండగా, ఆ తర్వాత ఎపిసోడ్లలో రాజా స్టోరీ ఉంటుంది. మూడు సీజన్స్‌గా 67 ఎపిసోడ్లతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మొట్టమొదటి కామెడీ సీరియల్ ‘ఏ జో హై జిందగీ.’ -
మూడు దశాబ్దాల కథ
కిశోర్‌కుమార్, యగ్నా శెట్టి జంటగా తమిళంలో రూపొందిన ఓ చిత్రం ‘రణరంగం’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఏఆర్ మూవీ ప్యారడైజ్ పతాకంపై ఎ. రామమూర్తి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఎ.రామమూర్తి మాట్లాడుతూ– ‘‘మూడు దశాబ్దాల కథతో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. తమిళంలో ఘనవిజయం సాధించింది. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా ఇచ్చిన పాటలు ఓ హైలైట్. తమిళంలోలానే తెలుగులోనూ ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. శరణ్. కె. అద్వైతన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సులీలే కుమార్, మిధున్ కుమార్, రజినీ మహదేవయ్య, అజయ్ రత్నం, ధీరజ్ రత్నం తదితరులు ఇతర పాత్రలు పోషించారు. -
వెంటాడే పాట
-
కిషోర్ కుమార్‌ను వదల్లేదు
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఎమర్జెన్సీ’కి వ్యతిరేకంగా పోరాడిన వారిని ప్రశంసిస్తూ...వారికి కృతజ్ఞతలు తెలపడం కోసం మంగళవారం ముంబైలో ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 1975 నాటి రోజులను గుర్తు చేస్తూ ఎమర్జేన్సీ కాలంలో కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కుటుంబం జయప్రకాశ్ నారాయణ్ , వాజ్‌పేయ్, అద్వాణీ వంటి ప్రముఖ నాయకులనే కాక మీడియాను కూడా తీవ్రంగా అణచి వేసిందని విమర్శించారు. ఎమర్జేన్సీని సాకుగా ఉపయోగించుకుని అలనాటి ప్రఖ్యాత గాయకుడు కిషోర్ కుమార్‌ను కూడా బ్లాక్ లిస్ట్‌లో చేర్చిందని మోదీ తెలిపారు. ఈ విషయం గురించి ‘ఎమర్జేన్సీ కాలంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఒక ర్యాలీ కోసం కిషోర్ కుమార్‌ను పాట పాడమని కోరారు. కానీ ఆయన అందుకు అంగీకరించలేదు. అదే ఆయన చేసిన పెద్ద నేరం. దాంతో టీవీల్లో, రేడియోల్లో ఆయనను కనిపించకుండా, వినిపించకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాక ఆ సమయంలో ఆయన నేపధ్య గాయకుడిగా రూపొందించిన ‘ఆంధీ’(గుల్జార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా తెరకెక్కిన పొలిటికల్ డ్రామా) చిత్రాన్ని విడుదల కాకుండా నిషేధించింది. ఇది ఆ పార్టీ మనస్తత్వం’ అంటూ మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. 1976 - 77 ఎమర్జేన్సీ కాలంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా ఉన్న వీసీ శుక్లా కిషోర్ కుమార్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చారు. వీసీ శుక్లా అప్పట్లో ఇందిర గాంధీ చిన్న కొడుకు సంజయ్ గాంధీకి చాలా సన్నిహితంగా ఉండేవాడు. -
తెలంగాణ పోలీస్ దేశంలోనే ఫస్ట్
మోత్కూరు (తుంగతుర్తి) : సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో తెలంగాణ పోలీస్ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. శనివారం స్థానిక సుమంగళి çఫంక్షన్‌హాల్‌లోఏర్పాటు చేసిన మోత్కూరు, అడ్డగూడూర్ మండలాల సామూహిక సీసీ టీవీ కెమెరాను డీసీపీ రామచంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. తనకోటా నిధులు రూ.7.50 లక్షలతో సీసీ కెమెరాల ఏర్పాటు చేశారని మరిన్ని కెమెరాల ఏర్పాటుకు మోత్కూరుకు రూ.3 లక్షలు , అడ్డగూడూర్‌కు రూ.5లక్షలు కేటాయిం చనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. డీసీపీ కె.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటులో జిల్లా రాష్ట్రం లోనే ముందంజలో ఉందన్నారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఏసీపీ శ్రీరామోజు, రమేష్, రామన్నపేట సీఐ ఎన్. శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేంద్రనాథ్, ఎంపీపీ ఓర్సులక్ష్మి, జెడ్పీటీసీ వలక్ష్మీ, స్థానిక సర్పంచ్ పిచ్చయ్య, సింగిల్‌విండో చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎంపీటీసీ జయశ్రీ, ప్రమీళ, శ్రీను, ఎస్ఐలు యాదగిరి, శివనాగప్రసాద్ తదితరులు ఉన్నారు. గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియో చెక్కుల పంపిణీ మోత్కూరు, అడ్డగూడూర్ మండలాల పరిధిలోని 16 మంది కల్లుగీత కార్మికులకు రూ. 4.86 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులను ఎమ్మెల్యే గాదరికిషోర్‌కుమార్, ఎక్సైజ్ సూపరిండెంటెంట్ కృష్ణప్రియ పంపిణీ చేశారు. -
ఏం చేసినా... ఎన్ని చేసినా నా బతుకు నా ఇష్టం!
దారి తప్పిన కొడుకు ఎలా ఉంటాడు? ‘రౌడీ’ సినిమాలో ‘అన్న’ పెద్దకొడుకులా! దుష్టుడికి బంధాలతో పనేమిటి? నాన్న అయినా, తమ్ముడైనా సరే! అందుకే కుట్రదారుల మాటలను శ్రద్ధగా వింటాడు. నాన్న మీద కోపాన్ని పెంచుకుంటాడు. ఒక సందర్భంలో కుట్రదారుడు ఇలా అంటాడు.. ‘మీ అమ్మానాన్నలు నిన్నే కనాలని డిసైడే కనలేదు.నువ్వు యాక్సిడెంటల్‌గా పుట్టావు. అంచేత మీ నాన్న గురించి బ్యాడ్‌గా అనుకోవడానికి నీవేమీ ఫీల్ కానక్కర్లేదు. పితృదెయ్యమో భవ’ తన నాన్నపై విషం కుమ్మరిస్తున్నందుకు... ఈ పెద్దకొడుకు కళ్లు ఎర్రబడాలి. ఇప్పుడు కూడా పడ్డాయి... అయితే కుట్రదారుడి మీద కోపం కాదు... తండ్రి మీద కోపంతో! ‘నా బతుకు... నాకు ఇష్టం వచ్చినట్లు బతుకుతాను’ అనుకునే దుర్మార్గపు క్యారెక్టర్లో ‘రౌడీ’ సినిమాలో కనిపిస్తాడు కిశోర్‌కుమార్. అప్పుడెప్పుడో ఎసీపి రత్నంగా తెలుగు ప్రేక్షకులకు కనిపించిన కిశోర్ డబ్బింగ్ సినిమాలతో చేరువయ్యాడు. తెలుగు సినిమాలతో మరింత చేరువయ్యాడు. సాధనతోనే నటన పండుతుందని నమ్మేవాళ్లు కొందరు. సాధనకు దూరంగా ఉంటూనే... నటనలో సహజత్వాన్ని పండించేవాళ్లు కొందరు. కిశోర్ కుమార్ రెండో కోవకు చెందిన నటుడు. ‘‘అది ఏ పాత్ర అయిన సరే... నేను ప్రిపేర్ కావడం అంటూ ఉండదు’’ అంటూ తనను తాను ‘లేజీ యాక్టర్’గా ప్రకటించుకుంటాడు కిశోర్. అయితే ఆ ‘బద్ధకం’ అనేది మాటల వరకు మాత్రమే పరిమితమేమో అనిపిస్తుంది. ఎందుకంటే... కిశోర్ నటన చూస్తే... ‘ఇతడి నటనలో సాధన లోపించింది’ అనిపించదు. సహజంగా ఉంటుంది. ఆకట్టుకునేలా ఉంటుంది. మొన్న మొన్నటి వరకు... కిశోర్ అంటే... ఒక కన్నడ నటుడు మాత్రమే. ఇప్పుడు మాత్రం కిశోర్ తన పరిధిని విస్తరించాడు. తమిళ్, తెలుగు సినిమాల్లో సరికొత్త విలన్‌గా ఆకట్టుకుంటున్నాడు. ‘అట్టహాస’ అనే కన్నడ సినిమాలో కిశోర్ చేసిన ‘వీరప్పన్’ పాత్రకు ఎంతో పేరు వచ్చింది. ఇది తమిళంలో ‘వన యుద్ధం’గా డబ్ కావడంతో కిశోర్ నటన మరింత మంది ప్రేక్షకులకు చేరువయింది.‘‘నాకూ వీరప్పన్‌కు ముఖ కవళికల్లో కొన్ని పోలికలు కనిపిస్తాయి’’ అని కిశోర్ అంటాడుగానీ... కేవలం ‘కొన్ని పోలికలు’ మాత్రమే వీరప్పన్‌ను తెర మీదికి తీసుకురాగలవా? కానే కాదు. ముఖ కవళికలు అనేవి ఎంతో కొంత ప్లస్ అయితే కావచ్చుగానీ... ‘వీరప్పన్’ రాక్షసత్వాన్ని వీర లెవెల్లో పండించడంలో కిశోర్‌లోని అసలు సిసలు నటుడికే ఎక్కువ మార్కులు పడతాయి. వీరప్పన్‌గా నటించే నటుడికి చూపులు ముఖ్యం. అవి జిత్తుల మారి నక్క చూపుల్లా ఉండాలి. కానీ పులిలా రక్తం కళ్ల చూడాలి. ఉన్మాదంతో రాక్షసంగా ప్రవర్తించే పులి చూపులా ఉండాలి. కానీ, జిత్తులతో ప్రత్యర్థిని... చిత్తు చేయడానికి లంఘించాలి. కిశోర్ లోతైన కళ్లకు ఆ చూపులను పట్టుకోవడం కష్టమేమీ కాలేదు. వీరప్పన్‌లాంటి నరహంతకుడి పాత్రే కాదు... ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, రాజకీయనాయకుడు, డ్రిల్ మాస్టారు... ఏ పాత్రనయినా అవలీలగా పోషిస్తూ కన్నడంలోనే కాదు తమిళ, తెలుగు, మలయాళ సినిమాలలో రాణిస్తున్నాడు కిశోర్. బసవనగుడి(కర్నాటక)లోని ‘నేషనల్ కాలేజి’లో చదువుకున్న కిశోర్... విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే ‘సామ్రాట్ అశోకా’లాంటి నాటకాల్లో నటించేవాడు. బెంగుళూరు యూనివర్శిటీలో కన్నడ సాహిత్యాన్ని చదువుకున్న కిశోర్ ఆ తరువాత ‘శారద కాలేజీ’లో రెండు సంవత్సరాల పాటు లెక్చరర్‌గా పనిచేశాడు. ‘సాహిత్యాన్ని బోధించకూడదు. అందరూ కలిసి చర్చించుకోవాలి’ అనేది లెక్చరర్‌గా కిశోర్ సిద్ధాంతం. అయితే కాలేజీ యాజమాన్యానికి మాత్రం కిశోర్ సిద్ధాంతం నచ్చేది కాదు. ‘‘వాళ్లు నన్ను కాలేజీ నుంచి గెంటక ముందే నేను తప్పుకున్నాను’’ అని నవ్వుల మధ్య చెబుతాడు కిశోర్. ఆ సమయంలోనే కిశోర్‌కు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ‘కంఠీ’ ‘రాక్షస’ సినిమాలతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్’గా అవార్డ్ అందుకున్నాడు. ఏసీపి రత్నంగా ‘హ్యాపీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కిశోర్ ‘భీమిలీ కబడ్డీ జట్టు’ ‘దమ్ము’ ‘క్రిష్ణం వందే జగద్గురుం’ ‘దళం’ ‘రౌడీ’ ‘చందమామ కథలు’ ‘చీకటి రాజ్యం’... మొదలైన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ‘‘విలన్‌గా నటించడం ఈజీ’’ అంటాడు కిశోర్. అయితే ఇది ఆత్మవిశ్వాసమే తప్ప అతి విశ్వాసం కాదని అతని విలనిజాన్ని చూస్తే తేలిగ్గా అర్థమవుతుంది. అందుకే కన్నడ కిశోర్‌కుమార్ మన ‘ఉత్తమ విలన్’ అయ్యాడు.కాలేజీ లెక్చరర్ కాస్తా ‘కరుకైన విలన్’గా అలరిస్తున్నాడు. -
పోలీసుల అదుపులో బ్లాక్మెయిల్ నిందితులు
శనివారం నగరంలోని అమీర్‌పేట్‌లో రియల్టర్‌ను తుపాకీతో బెదిరించిన ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్ఎస్ బ్రదర్స్ సమీపంలో నిన్న రియల్టర్ కిషోర్‌కుమార్ ను కొందరు దుండగులు తుపాకీతో బెదిరించారు. దీంతో భయబ్రాంతులకు గురైన కిషోర్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ సంఘటనతో సంబంధం ఉన్న కిషోర్ కుమార్ వ్యాపార భాగస్వాములు సృజన్, రాఘవేంద్రలతో పాటు మరో వ్యక్తిని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. -
రియల్ వ్యాపారికి తుపాకీతో బెదిరింపులు
-
రియల్ వ్యాపారికి తుపాకీతో బెదిరింపులు
హైదరాబాద్: నగరంలో మరోసారి తుపాకి కలకలం రేపింది. అమీర్‌పేట్ ఆర్ఎస్ బ్రదర్స్ సమీపంలో కిశోర్‌కుమార్ అనే రియల్ వ్యాపారిని శనివారం మధ్యాహ్నం గుర్తు తెలియని దుండగులు తుపాకీతో బెదిరించారు. అకస్మాత్తుగా జరిగిన చర్యతో భయబ్రాంతులకు గురైన కిషోర్‌కుమార్ అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఈ ఘటనపై బాధితుడు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమీర్ పేటలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఓమ్ని వ్యాను-లారీ ఢీ.. ఒకరి మృతి
కాశీపేట(ఆదిలాబాద్ జిల్లా): కాశీపేట మండలం సుబ్బారావుపల్లి గ్రామం వద్ద ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఓమ్ని వ్యానును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంచిర్యాల పట్టణానికి చెందిన మాలి పేర రాంజీ(50) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. మాలి కిశోర్‌కుమార్ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఓమ్ని వ్యాను మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వైపు వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఘటన అనంతరం అదే లారీ మంచిర్యాలలో మరొకరిని ఢీకొట్టినట్లు తెలిసింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. -
ఎంఎన్సీ ఉద్యోగులు పోలీసు అధికారుల వేషంలో వెళ్లి ...
పోలీసు అధికారుల వేషంలో దొంగతనం నిందితులిద్దరూ ప్రముఖ కంపెనీ ఉద్యోగులు 12 గంటల వ్యవధిలో నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు బెంగళూరు : వారిద్దరూ మంచి స్నేహితులు. మంచి కంపెనీల్లో పని చేస్తూ... వేలాది రూపాయల జీతం అందుకుంటున్నారు. అయితే విలాసవంతమైన జీవనం కోసం పెడదారి పట్టారు. సీనియర్ పోలీసు అధికారుల వేషంలో జ్యువెలరీ దుకాణంలోకి వెళ్లి రూ. 40 వేల విలువైన బంగారు చైన్ చోరీ చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు 12 గంటల వ్యవధిలో నిందితులను అరెస్ట్ చేశారు. వివరాలు... దేవసంద్రకు చెందిన కిశోర్‌కుమార్ ఓ బహుళ జాతి సంస్థలో హెచ్ఆర్గా విధులు నిర్వహిస్తున్నాడు.పాండవపుర తాలుకా బీరశెట్టిహళ్లికి చెందిన కవిత ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తుంది. స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ సారక్కి మెయిన్‌రోడ్డులో ఉన్న విమల్ జ్యువెలర్స్ షాపులోకి సోమవారం మధ్యాహ్నం సీనియర్ పోలీస్ అధికారుల వేషంలో వెళ్లారు. ఆభరణాలు కొనుగోలు చేసే నెపంతో బంగారు చైన్ చూసి రూ. 40 వేల విలువ చేసే 16 గ్రాముల బంగారు చైన్ అపహరించి ఉడాయించారు. ఆ విషయాన్ని గమనించిన షాపు యజమాని జేపీ నగర పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అందులోభాగంగా సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించి... నిందితుల ఆనవాళ్లను గుర్తించారు. డీసీపీ లోకేశ్ కుమార్ నేతృత్వంలో ఏసీపీ కాంతరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు 12 గంటల పాటు గాలించి... ఇద్దరిని అరెస్ట్ చేశారు. బంగారు చైన్, నకిలీ పోలీస్ గుర్తింపు కార్డు, పోలీస్ అధికారి యూనిఫామ్‌లో ఉన్న వారి ఫొటోలు, సెల్ ఫోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
లక్కీ స్టార్ యోగితా బాలి...
యోగితా బాలి యాక్ట్ చేసిన హిట్ సినిమా ఏది? ఎవరికీ గుర్తు ఉండదు. కాని ఆమె అందరికీ తెలుసు. ముందు నుంచి కూడా ఆమె న్యూస్‌లో ఉంది. అలనాటి నటీమణి, షమ్మీ కపూర్ భార్య గీతా బాలి చెల్లెలి కూతురైన యోగితా బాలి 1970లలో హీరోయిన్గా రంగ ప్రవేశం చేసింది. ఆయితే కిశోర్ కుమార్ మూడో భార్యగానే ఎక్కువ వార్తల్లోకి ఎక్కింది. రెండో భార్య మధుబాల మరణించాక కిశోర్ కొంచెం వైరాగ్యంలోకి వెళ్లాడు. ఆ సమయంలో కామన్ ఫ్రెండైన డాక్టర్ ఒకాయన యాంటి డిప్రెషన్ మందులను యోగితా బాలి చేత కిశోర్ కుమార్ ఇంటికి పంపేవాడు. అప్పటికే కిశోర్ స్టార్డమ్లో ఉండటంతో యోగితా ఆయనను కలవడం సరదాగా భావించింది. అది కాస్త పెళ్లిలాగా మారింది. ఇది యోగితా బాలి తల్లికి ఇష్టం లేదు. హీరోయిన్గా మంచి కెరీర్ ఉండగా ఇలా మూడో భార్యగా యోగితా బాలి జీవితం ముగిసిపోవడం భరించలేకపోయింది. పైగా ఎక్కడ గర్భం దాలుస్తుందో దాని వల్ల యాక్టింగ్‌కి శాశ్వతంగా ఎక్కడ దూరమవుతుందోనని కిశోర్‌కు, యోగితాకు దూరం పెంచింది. దాంతో ఆ పెళ్లి నిలవలేదు. ఆ సమయంలోనే మిథున్ ఊపు మీద ఉండటం అతడు కూడా ఆమెను ఇష్టపడటంతో ఇద్దరి పెళ్లి జరిగిపోయింది. వాళ్లది విజయవంతమైన దాంపత్యం అనే చెప్పాలి. అయితే మధ్యలో శ్రీదేవితో మిథున్ పెళ్లి వరకూ వెళ్లాడని అప్పుడు యోగితా అపర కాళి అవతారం ఎత్తితే నిర్ణయం మార్చుకున్నాడని అంటారు. ఏమైనా మిథున్ తన సంపాదనతో సృష్టించిన సామ్రాజ్యానికి యోగితా తిరుగులేని మహరాణిగా కొనసాగుతూ ఉంది. -
పుకారు తెచ్చిన ప్రమాదం...
ప్లేబ్యాక్ సింగర్ కిశోర్ కుమార్ మంచి ఊపు మీద ఉన్నప్పుడు కొత్త తరంగంలా వచ్చినవాడు శైలేంద్ర సింగ్. తన కొడుకు రిషి కపూర్‌ని ఇంట్రడ్యూస్ చేస్తూ కొత్త గొంతును పరిచయం చేయాలని రాజ్‌కపూర్ అనుకున్నప్పుడు శైలేంద్ర సింగ్ తారసపడ్డాడు. ‘బాబీ’ పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత రిషి కపూర్ నటించిన చాలా సినిమాలకు శైలేంద్ర సింగ్ పాడాడు. రవీంద్రజైన్ వంటి సంగీతకారులు కూడా మంచి మంచి పాటలు ఇచ్చారు. కాని ఒకసారి డయాబిటిస్ వల్ల రెండు మూడు రోజులు శైలేంద్ర సింగ్ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. దాంతో ప్రత్యర్థులు ముంబైలో పుకార్లు పుట్టించారు. శైలేంద్రకు హార్ట్ ప్రాబ్లమ్ ఉందని ఇక మీదట రికార్డింగులు చేయలేడని పాడలేడనీ.... అలా అలా అతడికి అవకాశాలు తగ్గిపోయాయి. పుకార్లను పట్టించుకోకుండా తేలిగ్గా తీసుకున్నందుకు తగిన మూల్యం చెల్లించాను అంటుంటాడు ఈ మంచిపాటగాడు. -
ఆ అందగత్తె చివరి రోజులు...
లాస్ట్ డేస్ / మధుబాల సావిత్రి కొంచెం అదృష్టవంతురాలు. కనీసం 46 ఏళ్ల వరకైనా జీవించింది. కాని మధుబాల అంత ఆయువు చూడలేదు. 36 ఏళ్లకే (1969) కన్ను మూసింది. కిశోర్ కుమార్‌ను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు గుండె జబ్బు ఉందని తెలుసు. గుండెలో రంధ్రం ఉండటం వల్ల ఆ కాలంలో దానికి వైద్యం లేకపోవడం వల్ల ఆమె వైవాహిక జీవితం అంతంత మాత్రమే అని తెలిసినా కిశోర్‌కుమార్ ఆమెను చేసుకున్నాడు. ఆమె కిశోర్‌ను పెళ్లాడింది. ఇద్దరికీ కారణాలు ఉన్నాయి. కిశోర్ అప్పటికే తన మొదటి భార్య రుమాతో విడాకులు తీసుకున్నాడు. మధుబాల తన బాయ్‌ఫ్రెండ్ దిలీప్ కుమార్‌తో తెగదెంపులు చేసుకుంది. వీరి ప్రేమకథకు మధుబాల తండ్రి అతావుల్లా ఖాన్ విలన్‌గా మారాడు. అతడిది పాకిస్తాన్. చాలా కష్టాలు పడి ముంబైకు చేరుకున్నాడు. పేదరికం వల్ల పుట్టిన నలుగురు పిల్లలు పోయారు. మధుబాల కాకుండా ఇంకా నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. పోషించే ఆధారం లేదు. మధుబాల స్టార్డమ్కు చేరుకున్నాక ఆమెకు అతడు కంచెలాగా మారాడు. మధుబాల మనసు దిలీప్ కుమార్ మీద ఉంది. దిలీప్ కుమార్‌కు మధుబాల అంటే ప్రేమ ఉంది. కాని ఈ లోపునే ఒక తగాదా వచ్చింది. బి.ఆర్.చోప్రా తన దర్శకత్వంలో దిలీప్ కుమార్, మధుబాలను పెట్టి ‘నయాదౌర్’ (1957) సినిమా తీయాలనుకున్నాడు. కథ రీత్యా అది ఔట్ డోర్లో తీయాలి. కాని ఇది దిలీప్‌ను మధుబాలను ఏకం చేయడానికి బి.ఆర్.చోప్రా పన్నిన పన్నాగం అని అతావుల్లా అనుమానించాడు. కొంత షూటింగ్ అయ్యాక మధుబాలను ఔట్‌డోర్ పంపడానికి నిరాకరించాడు. బి.ఆర్.చోప్రాకు నష్టం జరిగింది. కేసు కోర్టుకెక్కింది. దిలీప్ కుమార్ తన ప్రియురాలైన మధుబాల పక్షం వహించకుండా ఆమెదే తప్పు అని ఆమె తండ్రి నష్టపరిహారం చెల్లించాలని సాక్ష్యం చెప్పాడు. దీంతో అగాథం పెరిగిపోయింది. అయితే ఇంత జరిగినా పర్వాలేదు నా తండ్రిని క్షమాపణ అడుగు పెళ్లి చేసుకుందాం అని మధుబాల అడిగినట్టుగా కథనాలు ఉన్నాయి. కాని దిలీప్ కుమార్ అడగలేదు. దాంతో వాళ్లు విడిపోయారు. ఆ విషాదంలో ఉన్న మధుబాల అప్పటికే గాయకుడిగా, నటుడిగా చలాకీగా ఉన్న కిశోర్ కుమార్లో తోడును వెతుక్కుంది. ఇందుకు వీళ్లిద్దరూ కలిసి నటించిన ‘చల్తీకా నామ్ గాడీ’ (1958) సహకరించింది. ఈ సినిమాలో కిశోర్ సరసన మధుబాల నటించిన ‘హాల్ కైసా హై జనాబ్ కా’, ‘ఏక్ లడ్కీ భీగీ భాగీసీ’ వంటి పాటలు చాలా హిట్. అయితే వాళ్ల కాపురం అంత సజావుగా సాగలేదు. కిశోర్ కుమార్ గాయకుడిగా బిజీ అయ్యాడు. అంతే కాకుండా ఆమె అనారోగ్యం వల్ల వైవాహిక జీవితంలోగాని సంతానం కలగడంలోగాని ఒక అసంతృప్తి అతణ్ణి వెంటాడింది. అతడు ఆమెను నిర్లక్ష్యం చేశాడని కొందరంటారు. కంటికి రెప్పలా చూసుకున్నాడని మరికొందరంటారు. కాని మధుబాల పెళ్లయిన నాటి నుంచే (1960) మంచానికి అతుక్కుపోయిందని చెప్పాలి. ఆమె శరీరంలో రక్తం ఎక్కువగా వృద్ధి అయ్యేది. అది ముక్కు గుండా నోటి గుండా బయటకు రాకుండా డాక్టరు తరచూ వచ్చి రక్తం తీయాల్సి వచ్చేది. అలాగే ఆమెకు శ్వాస సంబంధమైన సమస్య తలెత్తింది. ప్రతి ఆరు గంటలకూ ఆక్సిజన్ పెట్టకపోతే ఊపిరి అందక బాధపడేది. కిశోర్ కుమార్ లండన్‌లో వైద్యం చేయిద్దామని ప్రయత్నించాడు. లాభించలేదు. మధుబాల దేశంలోనే అత్యద్భుతమైన అందమైన నటిగా పొందిన గుర్తింపు సామాన్యమైనది కాదు. ‘మహల్’, ‘మిస్టర్ అండ్ మిసెస్ 55’, ‘బర్సాత్ కీ రాత్’, ‘హౌరా బ్రిడ్జ్’ వంటి సినిమాలు ఆమెను లక్షాలాది మంది ఆరాధ్య దేవతగా మార్చాయి. హాలీవుడ్‌లోలా దేశంలో తొలి పోస్టర్ గర్ల్‌గా మధుబాల మారింది. ఇప్పటికీ ఆమె పోస్టర్లు విస్తృతంగా అమ్ముడు పోతుంటాయి. వీటన్నింటికీ మించి ‘మొఘల్- ఏ- ఆజమ్’ (1960)లో ఆమె పోషించిన అనార్కలి పాత్ర ఆమె ఉత్త అందాల బొమ్మ కాదనీ నటన తెలిసిన గొప్ప నటి అని నిరూపించింది. విశేషం ఏమిటంటే ఈ సినిమా నిర్మాణ సమయంలో దిలీప్ కుమార్‌కు మధుబాలకు మాటల్లేవు. కాని తెర మీద వారి వ్యక్తిగత స్పర్థ కనిపించకుండా అమర ప్రేమికులుగా మెప్పించడంలో ఇద్దరూ సఫలమయ్యారు. ఇంత పేరూ డబ్బూ ఉన్నా అనారోగ్యం ఆమెను పూర్తిగా ఓడించింది. చివరి రోజుల్లో ఆమె ఎంతో నైరాశ్యంలోకి వెళ్లిపోయింది. ఆమెకు డైరీ రాసే అలవాటు ఉండేది. అందులో ఆమె ఎన్నో వ్యక్తిగత విషయాలు రాసుకునేది. చనిపోయాక ఆమెను ఆమె డైరీతో పాటు ముంబై శాంటాక్రజ్ ముస్లిం శ్మశానవాటికలో ఖననం చేశారు. కుటుంబం ఆమె సమాధిని పాలరాయితో కట్టించింది. కాని 2010లో దానిని స్థలాభావం రీత్యా కూల్చేశారు. మధుబాల ఫిబ్రవరి 14న జన్మించింది. కోట్లాది మంది యువకులకు కలల రాకుమారిగా వర్థిల్లింది. తరాలు మారినా ఇప్పటికీ ఆమె ప్రేమదేవతగానే ఉంది. ప్యార్ కియాతో డర్నా క్యా అని యువతరానికి ధైర్యం చెబుతూనే ఉంది. -
రెండు జడలు.. ఉంగరాల జుత్తు..
బొంబాయి లోకల్ ట్రైన్. ఓ సీట్లో రెండు జళ్లమ్మాయి కూర్చుని ఉంది. ఆ వెనక సీట్లోనే ఉంగరాల జుట్టున్న ఓ కుర్రాడు కూర్చున్నాడు. తుంటరి పిల్లాడికి చిరునామాలా ఉన్న అతని ముఖం చిలిపి నవ్వులు నవ్వుతూనే ఉంది. పద్ధతికి మారుపేరుగా ఉన్న ఆ రెండుజళ్లమ్మాయి ఇతగాడి చూపులను ఓ కంట కనిపెడుతూనే ఉంది. ఎందుకొచ్చిన గొడవ అనుకుని మిన్నకుండిపోయింది. రైలు ఆగింది. ఆ అమ్మాయి దిగింది. ఆ అబ్బాయి దిగాడు. స్టేషన్ బయటకు వచ్చిన ఆ యువతి ఓ టాంగా ఎక్కింది. ఇతగాడూ మరో టాంగా ఎక్కాడు. సేమ్ సీన్... ఆ టాంగా వెనకాలే ఇదీ ఫాలో అవుతూ వెళ్తోంది. ఈసారి ఆ అమ్మాయి ముఖంలో కంగారు మొదలైంది. ఆవిడగారి టాంగా బాంబేటాకీస్ స్టూడియో గేట్దగ్గర ఆగింది. వెనకాలే వచ్చిన టాంగా కూడా అక్కడే ఆగింది. అంతే అతగాడి వంక చురచుర చూసి చరచరా స్టూడియోలోకి వెళ్లిపోయింది ఆమె. ఇవేమీ పట్టనట్టు ఈయనగారు కూడా ఆమె బాటలోనే సాగిపోయాడు. కట్ చేస్తే.. ఇద్దరూ ఓ పెద్దాయన ఎదుట నిల్చున్నారు. అప్పటిదాకా అణుచుకున్న కోపాన్నంతా కూడదీసుకుని గయ్యిన లేచింది. ‘ఇతనెవరో.. అప్పట్నుంచి నన్ను ఫాలో అవుతున్నా’డ ని కంప్లైంట్ చేసింది. దానికా పెద్దాయన ఓ నవ్వు న వ్వాడు. మళ్లీ కట్ చేస్తే.. అక్కడున్నవాళ్లంతా నవ్వుకున్నారు. అసలు విషయం ఏంటంటే.. ఆ రెండు జళ్లమ్మాయి గానకోకిల లతామంగేష్కర్, ఉంగరాల జుత్తువాడు గాయకుడు కిషోర్ కుమార్. ఇద్దరూ ఇండస్ట్రీకి వచ్చిన కొత్త రోజులవి. ముఖపరిచయాలు కూడా లేవు. ఇద్దరూ ఓ పాట రికార్డింగ్ కోసం బాంబే టాకీస్ స్టూడియోకు వెళ్లాల్సివచ్చింది. దీంతో కి షోర్దా తనను ఫాలో అవుతున్నాడని లతాజీ భావించారు. లతా అనుమానానికి తెరదించిన వారు మ్యూజిక్ డెరైక్టర్ క్షేమ్చంద్రప్రసాద్. కిషోర్ కుమార్ అశోక్‌కుమార్ తమ్ముడనీ, మంచి గాయకుడనీ పరిచయం చేశారు. ఇలా డిఫరెంట్‌గా పరిచయమైన ఈ ద్విగళాలు.. తర్వాత ఎన్నో యుగళగీతాల్లో పోటాపోటీగా గాత్రదానం చేశాయి. -
షారుఖ్-ఐశ్వర్యలతో...
కిశోర్‌కుమార్ నటించిన అలనాటి సూపర్‌హిట్ చిత్రం ‘చల్తీకా నామ్ గాడీ’ రీమేక్‌కు దర్శకుడు రోహిత్ శెట్టి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇందులో షారుఖ్ ఖాన్, ఐశ్వర్యారాయ్ హీరో హీరోయిన్లుగా నటించనున్నట్లు బాలీవుడ్ భోగట్టా. తొలుత ఇందులో షారుఖ్ సరసన కాజోల్‌ను హీరోయిన్గా అనుకున్నా, ఆ అవకాశం ఐశ్వర్యను వరించినట్లు తాజా సమాచారం. మళ్లీ సినిమాల్లో నటించనున్నట్లు ప్రకటించిన వెంటనే ఐశ్వర్యకు వరుసగా అవకాశాలు వెల్లువెత్తుతుండటం విశేషం. -
నిద్రపోనివ్వని స్వరం...
సందర్భం: కిశోర్ కుమార్ జయంతి ప్రముఖ రచయిత ఆర్.కె. నారాయణ్ రాసిన ‘ది గైడ్’ నవలను దేవానంద్ ‘గైడ్’ పేరుతో సినిమాగా తీశారు. అందులో ‘గాతారహే... మేరా దిల్... తూహీ మేరీ... మంజిల్’ పాట వినగానే నాకు మతిపోయింది. ఎంతంటే కిశోర్ కుమార్ కథాకమామీషు తెలుసుకునేంత వరకూ.... ఆ స్వరం నన్ను నిద్రపోనివ్వలేదు. సినీ ప్రపంచంలో కొన్ని కాంబినేషన్లుంటాయి. రాజ్ కపూర్-ముఖేశ్, షమ్మీకపూర్-రఫీ, ధర్మేంద్ర-మహేంద్ర కపూర్. అయితే అన్ని కాంబినేషన్లూ అన్నిసార్లూ అద్భుతాల్ని సృష్టించలేవు. కాంబినేషన్ల పరిధి దాటి ఆకాశపు అంచుల్ని తాకిన గళాల్లో రఫీకీ-కిశోర్‌కీ పోలికలున్నాయి. రఫీ హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతుడు. కిశోర్ అసలు సంగీత సాధనే చెయ్యలేదు. ఎవరి దగ్గరా కుదురుగా నేర్చుకోలేదు. కిశోర్‌కి తెలిసింది ఒక్కటే... పాటను చిత్తశుద్ధితో పాడడం, పాటకు ప్రాణం పోయడం.హిందీ చలనచిత్రసీమలో 24 శాఖల గురించీ అద్భుతమైన అవగాహన ఉన్న వ్యక్తి ఎవరూ అని ప్రశ్నిస్తే, వెంటనే వచ్చే మొదటి జవాబు కిశోర్ కుమార్ గంగూలీ అని. కిశోర్ నటుడు, దర్శకుడు, నృత్య దర్శకుడు, రచయిత, నిర్మాత, సంగీత దర్శకుడు, ఛాయాగ్రాహకుడు, స్క్రిప్ట్ రైటర్ కూడా. విషాదాన్ని పలికించడంలో కిశోర్‌ని మించినవారు లేరంటారు. అది వాస్తవం కూడా. కిశోర్ తన స్వీయ దర్శకత్వంలో పాడిన, ‘కోయీ లౌటారే మేరే బీతే హుయె దిన్..’ పాట వింటే కళ్లలోంచి జలజలా అశ్రువులు రాలతాయి. ఆ సినిమా పేరు ‘దూర్ గగన్ కీ ఛావోం మే’. ‘ఝుమ్రూ’ సినిమాలో ‘కోయీ హమ్ దమ్... నా రహా... కోటీ సహారా... నా రహా...’ పాట వింటుంటే గుండె మౌనంతో నిండిపోతుంది. మళ్లీ అదే కిశోర్‌దా ‘ఏజో, ముహిచ్చిత్ హై’ అని పాట ఎత్తుకుంటే జనాలు వెర్రెత్తిపోరూ..! కిశోర్ పాడిన ‘మేరే సప్నోంకీ రాణీ కబ్ ఆయేగీ తూ...’ పాట దేశాన్ని మత్తులో ముంచేసింది. ‘రూప్ తేరా మస్తానా’ ఓ సునామీ. ‘మేరే సావ్ునేవాలీ ఖిడ్కీ మే’ (పడోసన్), ‘ఏకో చతుర్ నార్ బడీ హోషియార్’ పాటల్ని కిశోర్ అభినయిస్తూ పాడుతుంటే ప్రేక్షకులు మరో లోకంలో అడుగెట్టి అటు చెవుల తుప్పూ, ఇటు మనసుల తుప్పూ వదిలించుకున్నారన్నది ముమ్మాటికీ నిజం. కాంబినేషన్‌కి అతీతంగా ఎదిగిన అత్యంత సహజ గాయకుడు కిశోర్. ఆయనగొంతు మీద ఎస్.డి. బర్మన్కి కొండంత నమ్మకం. ఏదో ఓనాడు కిశోర్ అన్ని రికార్డుల్నీ బ్రేక్ చేస్తాడని ఆయనకి తెలుసు. అందుకే తన రెగ్యులర్ కంపెనీ ‘నవ్‌కేతన్’లోనే కాక తను సంగీత దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలోనూ ఒక్క పాటైనా ఇచ్చేవారు. మొదట్లో కిశోర్ ఎక్కువగా పాడింది దేవ్ సాబ్‌కి. ఇక ఎస్.డి. బర్మన్, కిశోర్‌ల కాంబినేషన్ ఎన్ని అద్భుత గీతాలు సృష్టించిందంటే, ఆ పాటలు అమరత్వాన్ని పొందేంత. ఇక, కిశోర్ - రాజేష్ ఖన్నాల కాంబినేషన్ తుపాను సృష్టించింది. ‘ఏ షామ్ మస్తానీ మద్‌హోష్ కీయేజా’ పాట యువతని వెర్రెక్కించింది. ‘జిందగీ ఏక్ సఫర్ హై సూరానా’ (అందాజ్)... ఇలా అన్నీ అద్భుతాలే!అప్పటి వరకూ ఉత్తర హిందుస్థాన్‌లో ఎక్కడ, ఎప్పుడు పెళ్లి జరిగినా ‘రాజాకీ ఆయీ హై బరాత్.... రంగేలీ హోగీ రాత్’ (తెలుగులో ‘పందిట్లో పెళ్లవుతున్నదీ... కనువిందవుతున్నదీ’) పాట వినిపించేది. ‘సచ్చాఝాటా’ సినిమా విడుదలయ్యాక ‘మేరీ ప్యారీ బెహనియా బనేగీ దుల్హనియా’ పాట ఒక ట్రెడిషన్‌గా, ‘బారాతీ’ పాటగా మారింది. ప్రతి అన్నా తమ్ముడూ తన సోదరి పెళ్లిలో ఈ పాటే పాడుకున్నారు. అది ‘బేండ్ బాజా’ సాంగ్‌గా ఎంత ప్రసిద్ధి చెందిందంటే, పెళ్లి వాళ్లు, బేండ్ వాళ్ళను ముందే అడిగేవారట, ఆ పాట వాయించడం వాళ్లకు ‘వచ్చా, రాదా’ అని. కిశోర్ జీవితం ఓ సాగే ప్రవాహం లాంటిది. ఓ కల లాంటిది. కిశోర్ ఎవరికీ అర్థం కాడు. అర్థమయ్యేలా ఏనాడూ ప్రవర్తించలేదు. కొన్ని రహస్యంగా తన మనసులోనే సృష్టించుకున్నాడు. కిశోర్‌లోని అసలు వ్యక్తిని అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి అశోక్ కుమార్... అంటే కిశోర్ పెద్దన్న. ఆయన కిశోర్‌ని తమ్ముడిలా చూడలా... ఒక ‘బిడ్డ’లా అందునా ‘పసిబిడ్డ’లా చూశాడు. అందుకే కిశోర్ ఎంత అల్లరి చేసినా చిరునవ్వుతో భరించేవాడు. ఆయనకి తెలుసు... కిశోర్ లొంగేది ఒక్క ‘ప్రేమ’కి మాత్రమేనని! ఆ ప్రేమ నిజ జీవితంలో దొరికిందో లేదో కిశోర్కే తెలియాలి. కిశోర్ తన గళంతో ఓ ప్రభంజాన్ని సృష్టించాడు. తన అల్లరి చేష్టలతో అందరికీ ప్రియమయ్యాడు. కిశోర్ గురించి లతా అన్నది ‘‘నేను థియేటర్‌కి పాడటానికి వెళ్లగానే కిశోర్ దా ఏదో ఓ అల్లరి చెయ్యడానికి సిద్ధంగా ఉంటాడని తెలుసు... అందుకే అనేదాన్ని ‘పెహలేగానా... బాద్ మే హస్నా’ (ముందు పాట... తర్వాతే అల్లరి) అని. హిందీ చలనచిత్రసీమలో ‘సంగీత విభజన’ చెయ్యాలంటే, ఒకే ఒక్క విధంగా చెయ్యాలి. ‘కిశోర్‌కు ముందు - కిశోర్‌కి తరువాతా’ అని. కిశోర్‌కు ముందు రఫీ లాంటి చరిత్ర సృష్టించిన గాయకులున్నారు. మరి, కిశోర్ తరవాత? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్. దీనికి జవాబు బహుశా కొన్ని దశాబ్దాల తరవాత దొరకొచ్చు... దొరక్కపోనూవచ్చు. సినీ సంగీతానికీ, గీతానికీ సహజత్వాన్ని అద్దిన అమరశిల్పి కిశోర్! - భువనచంద్ర (సినీ గీత రచయిత) -
ఆఫ్‌లైన్‌లో పోకర్ గేమ్
పంజగుట్ట: ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్లో ఆడే పోకర్ గేమ్ (మూడు ముక్కలాట)ను నిబంధనలకు విరుద్ధంగా ఆఫ్‌లైన్‌లో ఆడుతున్న 15 మంది జూదరులను పశ్చిమ మండలం టాస్క్ఫోర్సు పోలీసులు అరెస్టు చేసి, పంజగుట్ట పోలీసులకు అప్పగించారు. పంజగుట్ట ఏసీపీ వెంటేశ్వర్లు కథనం ప్రకారం... బేగంబజార్‌కు చెందిన కిషోర్‌కుమార్‌కు సోమాజిగూడ పార్క్ హోటల్లో మెంబర్షిప్ ఉంది. ఇతను సోమవారం సాయంత్రం పార్క్ హోటల్లోని 5వ అంత స్తులో ఒక రూమ్ తీసుకున్నాడు. నగరంలో వివిధ ప్రాంతాల్లో వ్యాపారం చేసుకొనే ఇతని స్నేహితులు 14 మందిని తీసుకొచ్చాడు. వీరిలో 8 మంది సొంత అన్నదమ్ములే. గదిలోకి వెళ్లిన వెంటనే డోర్ వేసుకున్నారు. ఆన్లైన్లో పోకర్ బంగా, వెస్బుక్లో పోకార్ జింగా వెబ్సైట్లో పోకార్ గ్రాండ్ పేర్లతో ఆడే స్కిల్ గేమ్‌ను వీరు ఆఫ్‌లైన్ (నేరుగా) ఆడుతున్నారు. డబ్బులు బయటకు కనిపించకుండా రూ.25 నుంచి రూ. 25 వేల వరకు విలువచేసే వివిధ కాయిన్స్ సహాయంతో గేమ్ ఆడుతున్నారు. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి గేమ్ ఆడుతున్న అందరినీ అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి లక్షా 87 వేల, 500 రూపాయల నగదు, నానో కారు, 15 సెల్ఫోన్లు, పోకర్ గేమ్‌సెట్, 54 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, వీరికి సహకరించిన పార్క్ హోటల్ లాబీ మేనేజర్ అయూబ్ పరారీలో ఉండగా.. రాత్రివేళ హౌస్‌కీపింగ్ పని చేస్తున్న రవికుమార్‌ను అరెస్టు చేశారు. నిందితులపై ఏపీగేమ్ యాక్ట్ 3,4,9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. కాగా, పార్క్ హోటల్లో తెల్లవార్లూ పబ్ తెరిచే ఉంచడంతో పాటు జూదం, వ్యభిచారం కొనసాగుతున్నట్టు ఫిర్యాదులందాయని ఏసీపీ తెలిపారు. పార్క్ హోటల్ యాజమాన్యానికి నోటీసులు అందజేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో పోలీస్ అధికారితో పార్క్ హోటల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించినట్టు సమాచారం ఉందని, వారిని ఉపేక్షించేది లేదన్నారు. -
కృష్ణావతారంలోకి కల్యాణ్!
ఈ యుగంలో దేవుడొస్తే, ఆయన ఆహార్యం ఎలా ఉంటుంది? నీలమేఘశ్యాముడు, పీతాంబరధారుడైన రాముడిలానా? లేక మురళిని చేతబూని, వక్షస్థలంపై కౌస్తుభంతో ఆనందరూపుడైన కృష్ణునిలానా? రెండూ కాక చరిత్రకారులు చెబుతున్నట్లు ఖడ్గాన్ని చేబూని, గుర్రంపై కల్కిలానా? ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కటే. ఏ యుగంలోనైనా అప్పటి ప్రజలకు తగ్గట్టుగానే దేవుని రూపాలున్నాయి. దీన్ని బట్టి దేవుడు ఇప్పుడొస్తే.. మనలో ఒకడిగానే వస్తాడు. మనుషుల్లో మనిషిగా మసలుతాడు. ఆ మాటకొస్తే ట్రెండీగా జీన్స్, టీ షర్ట్ వేసుకొని యువతరానికి ప్రతీకలా కనిపిస్తాడు. పైగా.. ‘నా లేటెస్ట్ గెటప్ ఇదే.. ఫేస్బుక్లో పోస్ట్ చేసుకో’ అంటాడు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇందులో నిజం లేకపోలేదు. ‘గోపాల గోపాల’ సినిమాలో పవన్‌కల్యాణ్ పాత్రను డిజైన్ చేసింది ఈ రీతిగానే. పవర్‌స్టార్ ‘లేటెస్ట్ గాడ్’ పాత్ర చిత్రానికే హైలైట్ అవుతుందని ఆయన సెట్‌కి రాకముందే యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. స్క్రిప్ట్‌లో ఆయన పాత్రను తీర్చిదిద్దిన తీరు అలా ఉంది. మొన్నటివరకూ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడపడం వల్ల పవర్‌స్టార్ కాస్త ఛాయ తగ్గారు. దేవుని పాత్ర అంటే.. తేజస్సు అవసరం. అందుకే.. ‘గోపాల గోపాల’ షూటింగ్ మొదలై రోజులు గడుస్తున్నా.. పవన్ మాత్రం సెట్‌కి రాలేదు. మునుపటి రూపం కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి, హాండ్సమ్గా తయారయ్యారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే... నేడే పవర్‌స్టార్ ‘గోపాల గోపాల’ సెట్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ పాత్ర నిడివి 20 నిమిషాలే ఉంటుందని బయట ప్రచారం జరుగుతోంది. కానీ మాతృక ‘ఓ మైగాడ్’లో అక్షయ్‌కుమార్ పాత్ర నిడివి కంటే.. ‘గోపాల గోపాల’లో పవన్‌కల్యాణ్ పాత్ర నిడివి ఎక్కువ ఉంటుందనేది విశ్వసనీయ సమాచారం. పైగా ఇందులో వెంకటేశ్, పవన్ మధ్య సాగే సంభాషణలు సినీ ప్రియుల్ని ఉర్రూతలూగిస్తాయట. దర్శకుడు కిషోర్‌కుమార్ పార్థసాని మాతృకను మరిపించేలా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ వెంకటేశ్, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాల తీశారు. శ్రీయ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, కెమెరా: జయనన్ విన్సెంట్, సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాతలు: డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్. -
‘ఓ మైగాడ్’లో నయన?
కథానాయికలు డేట్స్ ఇవ్వడం, అనివార్య కారణాల వల్ల సినిమా ఆలస్యమైతే... సదరు నిర్మాతలు ఆ డేట్స్‌ని వేరే సినిమాకు ఉపయోగించుకోవడం అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. ఇటీవల నయనతార విషయంలో అదే జరిగిందట. వివరాల్లోకెళితే.. వెంకటేశ్-మారుతి కాంబినేషన్లో రూపొందాల్సిన ‘రాధ' చిత్రంలో నయనతార కథానాయికగా నటించాల్సి ఉంది. కానీ... కొన్ని కారణాల వల్ల ‘రాధ' సెట్స్‌పైకి వెళ్లలేదు. దాంతో నయన డేట్స్‌ని వృధా చేయలేని నిర్మాత డీవీవీ దానయ్య... వెంకటేశ్ హీరోగా రూపొందనున్న ‘ఓ మై గాడ్’ రీమేక్‌కి ఆ డేట్స్‌ని ఇచ్చేశారట. ఇది సినీవర్గాల్లో వినిపిస్తున్న తాజా వార్త. కిషోర్‌కుమార్(డాలీ) దర్శకత్వంలో డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్ కలిసి నిర్మించనున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్ ప్రత్యేక పాత్ర పోషించనున్న విషయం తెలిసిందే. మాతృక పరంగా చూస్తే.. ఈ భారీ మల్టీస్టారర్‌కి కథానాయికతో పనిలేదు. అయితే... కథలో జనరంజకమైన కొన్ని మార్పులు చేసి వెంకటేశ్‌కి జోడీగా నయనతారను నటింపజేస్తున్నారట దర్శకుడు డాలీ. ఇందులో నయన పాత్రను భిన్నంగా డిజైన్ చేస్తున్నట్లు తెలిసింది. నటిగా ఆమెను మరో స్థాయిలో కూర్చోబెట్టేలా ఈ పాత్ర ఉంటుందని వినికిడి. ‘రాధ' మిస్సయినా.. ‘ఓ మైగాడ్’తో అద్భుతమైన ఛాన్స్ కొట్టేసి నయనతార లక్కీ హీరోయిన్ అనిపించుకున్నారన్నది ఫిలింనగర్ టాక్. -
శోకసంద్రం
హిరమండలం, గొట్టాబ్యారేజీ వద్ద స్నానానికి దిగి గల్లంతైన విద్యార్థులు మృత్యువాతపడ్డారు. మృతదేహాలను శుక్రవారం వెలికి తీశారు. గల్లంతైన విద్యార్థుల కోసం వచ్చిన వారి మృతుల బంధువులు, స్నేహితులతో గొట్టాబ్యారేజీ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మృతదేహాలను చూసిన వారి రోదనలు ఆ ప్రాంతంలో మిన్నంటాయి. విశాఖపట్నం జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు గిరిజాల కిశోర్‌కుమార్, గందేసు అప్పలరెడ్డి, బర్రి అజయ్ కుమార్ గురువారం సాయంత్రం హిరమండలం సమీపంలో గల గొట్టాబ్యారేజీ వద్ద వంశధార నదిలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. ఈ సమాచారం తెలియడంతో వారి మృతదేహాల కోసం పోలీసులు, కొత్తూరు అగ్నిమాపక సిబ్బంది రాత్రంతా గాలించారు. ఫలితం లేకపోయింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి పది గంటల వరకు 30 మంది గజ ఈతగాళ్లు తీవ్రంగా గాలించి మృతదేహాలను వెలికితీశారు. కుటుంబానికి ఆసరాగా ఉంటారనుకుంటే.... కుటుంబానికి ఆసరాగా ఉంటారనుకుంటే ఇలా అర్దంతరంగా తనువు చాలించారని మృతుల బంధువులు రోదించారు. ముగ్గురూ మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు. కిశోర్ రాజు తండ్రి వెంకటరావు లారీ డ్రైవర్‌గా, అజయ్ కుమార్ తండ్రి గుర్నాథరావు కార్పెంటర్‌గా, అప్పలరెడ్డి తండ్రి ముసలయ్య స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్నారు. ముసలయ్య, భూలోకమ్మల ఏకైకసంతానం అప్పలరెడ్డి. ఒక్క కుమారుడు వంశధారకు బలవడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. అజయ్‌కుమార్ తండ్రి గుర్నాథరావు రెండు రోజుల కిందట షిప్‌యార్డులో కూలీగా వెళ్లారు. కన్నకొడుకు మృతదేహాన్ని చూసేందుకు కూడా రాలేకపోయాడని అతని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. అజయ్‌కుమార్ మృతదేహాన్ని చూసిన అతని పెదనాన్న బర్రి అప్పలరాజు సంఘటన స్థలంలో బిగ్గరగా రోదిస్తుంటే వారించేందుకు పలువురు ప్రయత్నించారు. కిశోర్‌కుమార్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు వెంకటరావు, ప్రభావతి తట్టుకోలేకపోయారు. హృద్రోగి అయిన ప్రభావతి విలపిస్తూ భావోద్వేగంతో కుప్పకూలిపోయారు. దీంతో ఆమెను అక్కడి నుంచి బంధువులు దూరంగా తీసుకువెళ్లారు. ఎక్కడో పుట్టి.. ] ఎక్కడో పుట్టి ఇక్కడ తనువు చాలించారని సంఘటన స్థలంలో పలువురు విచారం వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన వారు విజయనగరంలో చదువుకుంటూ శ్రీముఖలింగేశ్వరుని దర్శించుకునేందుకు జలుమూరు మండలం మర్రివలసలోని మిత్రుడు ప్రవీణ్‌కుమార్ ఇంటికి వచ్చారు. ఆలయంలో రద్దీగా ఉందని నది వద్దకు వెళ్లారని, శ్రీముఖలింగేశ్వరుడి సన్నిధిలో ఉంటే మృత్యువాత పడేవారు కారని కొందరు అన్నారు. జనసంద్రమైన గొట్టా బ్యారేజీ ప్రమాదానికి గురైన విద్యార్థుల గురించి తెలియడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, స్థానికులు తరలి రావడంతో గొట్టాబ్యారేజీ జనసంద్రమైంది. సంఘటన స్థలికి విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని అవంతి సెయింట్ థెరిసా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్య ప్రతినిధులు శ్రీధర్, మహేష్ వచ్చారు. మృతదేహాలను చూసి అక్కడ ఉన్నవారంతా కన్నీరు పెట్టారు. మృతదేహాలను పోసుమ్టమార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మధ్యాహ్నం మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి గొట్టాబ్యారేజి వద్ద హెచ్చరిక బోర్డులు పెద్దవి ఏర్పాటు చేయాలని కలెక్టర్ సౌరభ్‌గౌర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వంశధార అధికారులతో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన చిన్న బోర్డులను తొలగించి పెద్ద బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఆ బోర్డులపై ఇప్పటివరకు జరిగిన ప్రమాదాల వివరాలు పొందుపర్చాలని చెప్పారు. సందర్శకులు ఎక్కువ మంది ఉంటే ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులకు తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్ల గురించి పలు సూచనలు చేశారు. -
పోలియో నిర్మూలనకు సహకరించాలి
బెలగాం, న్యూస్‌లైన్:పోలియో నిర్మూలనకు ప్రజలు సహకరించాలని వ్యాధి నిరోధక, టీకాల జిల్లా అధికారి డాక్టర్ ఎం. కిశోర్‌కుమార్ కోరారు. గురువారం స్థానిక ఏరియా ఆస్పత్రిలో పార్వతీపురం డివిజన్లో గల ‘పల్స్‌పోలియో’ రూట్ సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈనెల 19న బూత్కేంద్రాల వద్ద 20, 21తేదీలలో ఇంటింటికీ వెళ్లి 0-5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్నారు. సిబ్బంది ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. రెండు లక్షల 22 వేల మంది చిన్నారులకు చుక్కల మందు జిల్లా వ్యాప్తంగా 2,22,572 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రతి ఒక్క చిన్నారికీ చుక్కల మందు వేయాలని, ఈ విషయంలో ప్రజలు కూడా సిబ్బందికి సహకరించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా 1600 బూత్‌లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే 160 మంది సూపర్వైజర్లు, రూట్ ఆఫీసర్లు, గ్రామాల్లో 3,200 బృందాలు, మెడికల్ ఆఫీసర్లతో 66 మొబైల్ టీమ్‌లు, మెడికల్, విద్యాశాఖ, ఐసీడీఎస్, ఆశ, తదితర విభాగాల నుంచి 6,400 మంది సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతంలో 38,832 మంది పిల్లలు లక్ష్యం కాగా 497 బూత్‌లు 994 టీమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో సీహెచ్ఎన్సీ ఎస్పీహెచ్ఓ డాక్టర్ ఎం.నారాయణ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ చొక్కాపు రామారావు, హెల్త్ ఎడ్యుకేటర్ ఎ.లక్ష్మణమూర్తి, ఆరోగ్య పర్యవేక్షకులు ఎన్. కృష్ణమోహన్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
కిశోర్‌కుమార్‌తో లాహిరి లాహిరి