‘కాంతార’ నటుడు కిశోర్ కుమార్‌కి ట్విటర్ భారీ షాకిచ్చింది. నిబంధనలు ఉల్లంఘించారంటూ అతని ఖాతాను సస్పెండ్ చేసింది. అతని ఖాతాని ఓపెన్ చేయగా..‘నిబంధనలు ఉల్లంఘించిన ఖాతాను ట్వీటర్ సస్పెండ్ చేస్తుంది’అనే మెసేజ్ డిస్‌ప్లే అవుతోంది. అయితే కిశోర్ ఖాతాను నిలివివేయడానికి గల కారణాలు మాత్రం ఇప్పటికీ తెలియదు.
కిశోర్‌కి ట్విటర్‌తో పాటు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ఖాతాలు కూడా ఉన్నాయి. ఇన్‌స్టాలో 43 వేల మంది, ఫేస్‌బుక్‌లో 66 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రాజకీయాలతో పాటు పలు అంశాలపై సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటాడు.
ఇటీవల ‘కాంతార’దేవుడిని అవమానించిన ఓ వ్యక్తి మరణించారనే వార్త బాగా వైరల్ అయింది. దీనిపై కిశోర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘దేవుడు లేదా దెయ్యం అనేది మన నమ్మకం మాత్రమే. మీరు నమ్మితే, ఉంది, మీరు నమ్మకపోతే, లేదు. ఇలా కష్టకాలంలో ధైర్యాన్నిచ్చే నమ్మకాలను అవమానించాల్సిన పనిలేదు. అక్రమార్కులను శిక్షించేందుకు చట్టం ఉంది. వారి విశ్వాసం వారిది. విశ్వాసం కలిగి ఉండండి, మూఢనమ్మకం కాదు’అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే మీడియా సంస్థ ఎన్డీటీవీని అదానీ గ్రూప్ దక్కించుకోవడాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వ్యతిరేకించాడు.
Comments
Please login to add a commentAdd a comment