మూడు దశాబ్దాల కథ | Tamil Kalathur Gramam is Ranarangam in Telugu | Sakshi
Sakshi News home page

మూడు దశాబ్దాల కథ

Published Sat, Nov 17 2018 3:47 AM | Last Updated on Sat, Nov 17 2018 3:47 AM

Tamil Kalathur Gramam is Ranarangam in Telugu - Sakshi

కిశోర్‌కుమార్

కిశోర్‌కుమార్, యగ్నా శెట్టి జంటగా తమిళంలో రూపొందిన ఓ చిత్రం ‘రణరంగం’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఏఆర్‌ మూవీ ప్యారడైజ్‌ పతాకంపై ఎ. రామమూర్తి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి.  త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఎ.రామమూర్తి మాట్లాడుతూ– ‘‘మూడు దశాబ్దాల కథతో పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది.

దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. తమిళంలో ఘనవిజయం సాధించింది. మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయరాజా ఇచ్చిన పాటలు ఓ హైలైట్‌.  తమిళంలోలానే తెలుగులోనూ ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. శరణ్‌. కె. అద్వైతన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సులీలే కుమార్, మిధున్‌ కుమార్, రజినీ మహదేవయ్య, అజయ్‌ రత్నం, ధీరజ్‌ రత్నం తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement