'కేరాఫ్ కంచరపాలెం' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు.. చిరంజీవి, పవన్ కల్యాణ్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వీటి వల్ల తనకు అన్యాయం జరిగిందని పరోక్షంగా ఆవేదన వ్యక్తం చేశాడు. షూటింగ్ జరిగిన తర్వాత కూడా తన సీన్స్ ఎందుకు తీసేశారో అర్థం కాలేదని అన్నాడు. ఈ విషయంలో చాలా బాధపడ్డానని కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారిపోయాయి.
(ఇదీ చదవండి: వీడియో: గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్)
వైజాగ్‌కి చెందిన కిశోర్ కుమార్.. 'కేరాఫ్ కంచరపాలెం'తో నటుడిగా మారాడు. ఈ సినిమాలో వినాయకుడి బొమ్మలు చేసే మూగవాడిగా నటించింది ఇతడే. ఈ చిత్రం తర్వాత పలు చిత్రాల్లో సహాయ పాత్రలు చేశాడు. రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు'లో కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. అయితే చిరు 'ఆచార్య', పవన్ 'భీమ్లా నాయక్' చిత్రాల విషయంలో తనకు అన్యాయం జరిగిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
'ఆచార్య సినిమా కోసం 20 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నాను. బాగా చేశానని చిరంజీవి కూడా మెచ్చుకున్నారు. భుజంపై చేయివేసి మరీ మాట్లాడేవారు. తీరా మూవీ విడుదలయ్యాక నా సీన్స్ కనిపించలేదు. ఎడిటింగ్‌లో తీసేశారు. 'భీమ్లా నాయక్' కోసం ఓ రోజు షూటింగ్‌కి వెళ్లాను. మధ్య గ్యాప్ వచ్చింది. తర్వాత నా బదులు వేరే నటుడిని ఆ పాత్ర కోసం తీసుకున్నారు. ఎందుకలా చేశారో అర్థం కాలేదు. ఈ విషయాల్లో చాలా బాధపడ్డాను' అని నటుడు కిశోర్ కుమార్ చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: పవన్ విద్యార్హతపై పూటకో మాట.. పిఠాపురం నామినేషన్‌లో తేటతెల్లం)
Comments
Please login to add a commentAdd a comment