రియల్ వ్యాపారికి తుపాకీతో బెదిరింపులు
Published Sat, Oct 15 2016 2:33 PM | Last Updated on Tue, Aug 28 2018 7:24 PM
హైదరాబాద్: నగరంలో మరోసారి తుపాకి కలకలం రేపింది. అమీర్‌పేట్ ఆర్‌ఎస్ బ్రదర్స్ సమీపంలో కిశోర్‌కుమార్ అనే రియల్ వ్యాపారిని శనివారం మధ్యాహ్నం గుర్తు తెలియని దుండగులు తుపాకీతో బెదిరించారు. అకస్మాత్తుగా జరిగిన చర్యతో భయబ్రాంతులకు గురైన కిషోర్‌కుమార్ అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఈ ఘటనపై బాధితుడు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమీర్ పేటలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement