‘కాంతార’ నటుడు కిశోర్ కుమార్ ట్విటర్ ఖాతాను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీనిపై నెటిజన్లు నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తన పోస్టుల కారణంగానే ట్విటర్ అతడి ఖాతాను సస్సెండ్ చేశారని కొందరు అంటుంటే, ట్విటర్ నిబంధనలు ఉల్లంఘించడమే కారణమని మరికొందరు అభిప్రాయం పడుతున్నాయి. ఇలా తన ట్విటర్ ఖాతా సస్పెండ్ కావడంపై తీవ్ర చర్చ జరుగుతున్న క్రమంలో తాజాగా కిషోర్ కూమార్ స్పందించాడు.
చదవండి: ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పుడు నేను అనుకుంది చేయలేకపోయా: ప్రభాస్
తన ట్విటర్ అకౌంట్‌ను నిలిపివేయడానికి కారణమేంటో వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ షేర్ చేశాడు. ‘నా అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారు. అందువల్లే నా ట్విటర్ నా అకౌంట్‌ను తొలగించింది. అంతేకాని నేను పెట్టిన పోస్ట్‌ల వల్ల కాదు. నా ట్విటర్ సస్పెన్షన్‌పై ఇప్పటికైన అనవసరమైన వాదనలను ఆపండి. నా పోస్ట్‌ల వల్ల దానిని నిలిపివేయలేదు. డిసెంబర్20న నా అకౌంట్ హ్యాక్ అయింది. దానికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని ట్విటర్ నాకు హామీ ఇచ్చింది’ అంటూ రాసుకొచ్చాడు. అలాగే ట్విటర్ తనతో జరిపిన సంప్రదింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను కూడా ఈ సందర్భంగా ఆయన షేర్ చేశాడు.
చదవండి: సోనూసూద్.. తప్పుడు సందేశాలివ్వొద్దు!: నార్త్ రైల్వే ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment