మోత్కూరు (తుంగతుర్తి) : సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో తెలంగాణ పోలీస్ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. శనివారం స్థానిక సుమంగళి çఫంక్షన్‌హాల్‌లోఏర్పాటు చేసిన మోత్కూరు, అడ్డగూడూర్ మండలాల సామూహిక సీసీ టీవీ కెమెరాను డీసీపీ రామచంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. తనకోటా నిధులు రూ.7.50 లక్షలతో సీసీ కెమెరాల ఏర్పాటు చేశారని మరిన్ని కెమెరాల ఏర్పాటుకు మోత్కూరుకు రూ.3 లక్షలు , అడ్డగూడూర్‌కు రూ.5లక్షలు కేటాయిం చనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. డీసీపీ కె.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటులో జిల్లా రాష్ట్రం లోనే ముందంజలో ఉందన్నారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఏసీపీ శ్రీరామోజు, రమేష్, రామన్నపేట సీఐ ఎన్. శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేంద్రనాథ్, ఎంపీపీ ఓర్సులక్ష్మి, జెడ్పీటీసీ వలక్ష్మీ, స్థానిక సర్పంచ్ పిచ్చయ్య, సింగిల్‌విండో చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎంపీటీసీ జయశ్రీ, ప్రమీళ, శ్రీను, ఎస్‌ఐలు యాదగిరి, శివనాగప్రసాద్ తదితరులు ఉన్నారు.
గీత కార్మికులకు ఎక్స్‌గ్రేషియో చెక్కుల పంపిణీ
మోత్కూరు, అడ్డగూడూర్ మండలాల పరిధిలోని 16 మంది కల్లుగీత కార్మికులకు రూ. 4.86 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులను ఎమ్మెల్యే గాదరికిషోర్‌కుమార్, ఎక్సైజ్ సూపరిండెంటెంట్ కృష్ణప్రియ పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment