పోలీస్ డ్రెస్ కోడ్ పూర్తిగా మార్చండి: కేసీఆర్
పోలీస్ డ్రెస్ కోడ్ పూర్తిగా మార్చండి: కేసీఆర్
Published Sat, Jun 21 2014 4:36 PM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పోలీసుల పనితీరును అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఆధునీకరణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో 'అధునాతన టెక్నాలజీని వాడుతూ న్యూయార్క్ తరహా పోలీసింగ్‌ను నిర్వహించాలి' అని కేసీఆర్ తెలిపారు.
ఈ సమావేశానికి హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
1650 ఇన్నోవాలు, అవసరం మేరకు టూవీలర్లు కొనుగోలు చేయాలని ఈ సమావేశంలో కేసీఆర్ తెలిపారు. పోలీస్ సిబ్బంది డ్రెస్ కోడ్‌ను పూర్తిగా మార్చాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. హైదరాబాద్ జంటనగరాలు అంతా కవరయ్యేలా సీసీ కెమరాలు తక్షణం అమర్చండని కేసీఆర్ అధికారులకు తెలిపినట్టు సమాచారం.
Advertisement