ఆ పాట లేకుండానే బాబు బంగారం రిలీజ్..? | Babu Bangaram Not To Have Nayanatara Song | Sakshi
Sakshi News home page

ఆ పాట లేకుండానే బాబు బంగారం రిలీజ్..?

Published Sun, Jul 17 2016 12:55 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

ఆ పాట లేకుండానే బాబు బంగారం రిలీజ్..?

ఆ పాట లేకుండానే బాబు బంగారం రిలీజ్..?

వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ బాబు బంగారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్టు 12న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వెంకటేష్ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా చాలా రోజుల క్రితమే రిలీజ్ కావాల్సి ఉన్నా.. వాయిదా పడుతూ వస్తోంది.

ముఖ్యంగా కబాలి రిలీజ్ డేట్ ప్రకటించకపోవటంతో బాబు బంగారం సినిమా రిలీజ్ విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడింది. అదే సమయంలో హీరోయిన్ నయనతార షూటింగ్కు సహకరించక పోవటం కూడా ఒక కారణం అన్న టాక్ వినిపిస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరగకపోవటంతో ఒక పాట షూటింగ్ మిగిలి ఉండగానే, నయనతార ఇచ్చిన డేట్స్ అయిపోయాయి. దీంతో ఇక షూటింగ్లో పాల్గొనేది లేదంటూ నయన్ చెన్నై వెళ్లిపోయింది.

తరువాత నయన్ను ఒప్పించి ఆ ఒక్క పాట షూట్ చేయడానికి యూనిట్ సభ్యులు చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. ఇప్పటికే వరుస కమిట్మెంట్స్తో బిజీగా ఉన్న నయనతార, మరో సారి వెంకటేష్ కోసం డేట్స్ ఇవ్వలేకపోయింది. ఇక చేసేదేమి లేక ఆ పాట లేకుండానే సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement